MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Football
  • FIFA World Cup 2026: వరల్డ్ కప్‌లో 96 ఏళ్ల రికార్డు బద్దలు.. ఎవరీ 17 ఏళ్ల గిల్బెర్టో మోరా?

FIFA World Cup 2026: వరల్డ్ కప్‌లో 96 ఏళ్ల రికార్డు బద్దలు.. ఎవరీ 17 ఏళ్ల గిల్బెర్టో మోరా?

FIFA World Cup 2026: ఫీఫా ప్రపంచ కప్ 2026 ప్రారంభ మ్యాచ్‌లో మెక్సికో, దక్షిణాఫ్రికాను 2-0 తేడాతో ఓడించింది. మెక్సికో విజయంతో మెగా టోర్నీని ప్రారంభించింది. మెక్సికో యంగ్ ప్లేయర్ గిల్బెర్టో మోరా 96 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించాడు.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 12 2026, 08:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఒక్క మ్యాచ్‌తో వరల్డ్ ఫేమస్.. 96 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన 17 ఏళ్ల ప్లేయర్
Image Credit : Getty

ఒక్క మ్యాచ్‌తో వరల్డ్ ఫేమస్.. 96 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన 17 ఏళ్ల ప్లేయర్

ఫీఫా వరల్డ్ కప్ 2026 (FIFA World Cup 2026) గ్రాండ్‌గా స్టార్ట్ అయింది. మెక్సికో తన మొదటి మ్యాచ్‌లోనే అద్భుతమైన ఆటతీరుతో దుమ్మురేపింది. సౌతాఫ్రికాతో జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరులో మెక్సికో 2-0 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో మెక్సికో వరల్డ్ కప్ క్యాంపెయిన్ అదిరిపోయే రేంజ్‌లో మొదలైంది.

అయితే మ్యాచ్ రిజల్ట్ కంటే కూడా సెకండ్ హాఫ్‌లో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. 17 ఏళ్ల ఒక యంగ్ ప్లేయర్ మైదానంలోకి అడుగుపెట్టడమే ఆలస్యం.. మెక్సికన్ ఫుట్‌బాల్ హిస్టరీలోనే ఒక గోల్డెన్ పేజీ రాసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
96 ఏళ్ల రికార్డు బ్రేక్
Image Credit : Getty

96 ఏళ్ల రికార్డు బ్రేక్

ఈ మ్యాచ్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన ఆ 17 ఏళ్ల వండర్ కిడ్ పేరు గిల్బెర్టో మోరా. మెక్సికోకు చెందిన ఈ యంగ్ మిడ్‌ఫీల్డర్ ఫీఫా వరల్డ్ కప్‌లో తన దేశానికి ప్రాతినిధ్యం వహించిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. దాదాపు ఒక సెంచరీ కాలంగా చెక్కుచెదరకుండా ఉన్న రికార్డును ఈ యంగ్ ప్లేయర్ కేవలం ఒక్క మ్యాచ్‌తో బద్దలు కొట్టాడు.

మ్యాచ్ 65వ నిమిషంలో మోరా సబ్‌స్టిట్యూట్‌గా గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. హోమ్ గ్రౌండ్ అయిన ఎస్టాడియో ఎజ్టెకా స్టేడియంలో అభిమానుల కేకల మధ్య మోరా హిస్టరీ క్రియేట్ చేశాడు. ఇది అతని వరల్డ్ కప్ జర్నీకి, అలాగే మెక్సికో టీమ్‌కు మర్చిపోలేని గ్రేట్ మూమెంట్‌గా నిలిచిపోయింది.

¡Debut de ensueño! 💚✨

17 años y acaba de jugar su primera Copa del Mundo... ¡Gilberto Mora ya es histórico! 👏🥹🇲🇽 #SomosMéxicopic.twitter.com/0YZon1i8vj

— Selección Nacional (@miseleccionmx) June 11, 2026

Related Articles

Related image1
FIFA World Cup 2026: మెస్సీ కంటే డేంజర్.. రోనాల్డో కంటే స్పీడ్ ! గ్రౌండ్ లో మ్యాజిక్ చేసే టాప్ 10 ఫుట్‌బాల్ సూపర్ స్టార్స్ వీరే !
Related image2
FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్ షురూ.. స్టేడియంలో షకీరా ఊరమాస్ డాన్స్.. సౌతాఫ్రికాను చితక్కొట్టిన మెక్సికో
36
కోచ్ నమ్మకాన్ని నిలబెట్టిన గిల్బెర్టో మోరా
Image Credit : Getty

కోచ్ నమ్మకాన్ని నిలబెట్టిన గిల్బెర్టో మోరా

ఫీఫా వరల్డ్ కప్ 2026 ఈసారి 48 టీమ్స్‌తో చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇంత పెద్ద టోర్నమెంట్‌లో, అదీ లక్షలాది మందితో కిక్కిరిసిపోయిన ఎస్టాడియో ఎజ్టెకా స్టేడియంలో ఒత్తిడిని తట్టుకోవడం అంత ఈజీ కాదు. కానీ మెక్సికో హెడ్ కోచ్ జేవియర్ దేశంలోనే మోస్ట్ ప్రామిసింగ్ యంగ్ టాలెంట్ అయిన గిల్బెర్టో మోరాపై పూర్తి నమ్మకం ఉంచాడు. ఫుట్‌బాల్‌లోనే అతిపెద్ద స్టేజ్‌పై అతనికి ఛాన్స్ ఇచ్చాడు. మోరా కేవలం 17 ఏళ్ల 240 రోజుల వయసులోనే వరల్డ్ కప్‌లో అడుగుపెట్టి ఈ ఫీట్ సాధించాడు.

🚨🇲🇽 𝐎𝐅𝐅𝐈𝐂𝐈𝐀𝐋 | Gilberto Mora (17) makes HISTORY. He is now the youngest ever Mexico player at a World Cup. 💎✅ pic.twitter.com/xaL8LBLlfP

— EuroFoot (@eurofootcom) June 11, 2026

46
మాన్యువల్ రోసాస్ పాత రికార్డు బద్దలు
Image Credit : Getty

మాన్యువల్ రోసాస్ పాత రికార్డు బద్దలు

దీనికంటే ముందు ఈ రికార్డు మాన్యువల్ 'చాకేటాస్' రోసాస్ పేరిట ఉండేది. 1930లో జరిగిన మొట్టమొదటి ఫీఫా వరల్డ్ కప్‌లో రోసాస్ 18 ఏళ్ల 134 రోజుల వయసులో మెక్సికో తరఫున ఆడాడు. ఆ తర్వాత మళ్లీ ఇన్నేళ్లలో ఆ రికార్డును ఎవరూ టచ్ చేయలేకపోయారు. సరిగ్గా 96 ఏళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉన్న ఈ చరిత్రాత్మక రికార్డును గిల్బెర్టో మోరా ఇప్పుడు క్లీన్ స్వీప్ చేశాడు. దీంతో ఫుట్‌బాల్ ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ యంగ్ సెన్సేషన్ వైపు చూస్తోంది.

56
క్లబ్ టిజువానా టు వరల్డ్ కప్ జర్నీ
Image Credit : Getty

క్లబ్ టిజువానా టు వరల్డ్ కప్ జర్నీ

మెక్సికోలోని చియాపాస్‌లో జన్మించిన గిల్బెర్టో మోరా చిన్నప్పటి నుంచే ఫుట్‌బాల్‌లో చురుగ్గా ఉండేవాడు. క్లబ్ టిజువానా యూత్ అకాడమీలో చేరి తన ఆటను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాడు. చాలామంది ప్లేయర్లు ఆ వయసులో ఇంకా యూత్ ఫుట్‌బాల్ ఆడుతుంటే, మోరా మాత్రం తన టాలెంట్‌తో ఏకంగా మెయిన్ సీనియర్ టీమ్‌లోనే ప్లేస్ సంపాదించాడు. కేవలం 17 ఏళ్ల వయసులోనే లీగా MX (Liga MX) టీమ్ కోసం 50 కి పైగా సీనియర్ మ్యాచులు ఆడి అందరినీ షాక్‌కు గురిచేశాడు. ఎన్నో గోల్స్ చేయడమే కాకుండా, అసిస్ట్‌లు అందిస్తూ తన వయసుకు మించిన మెచ్యూరిటీని మైదానంలో చూపించాడు.

🤯💎 17-year-old Gilberto Mora was born to break records and we are witnessing something never seen before: 

- Youngest player to start in Liga MX
- Youngest player to score in Liga MX
- Youngest player to assist in Liga MX
- Youngest debut with Mexico 
- Youngest player to… pic.twitter.com/SNoE6KUnOl

— All Fútbol MX 🇲🇽 (@AllFutbolMX) June 12, 2026

66
కెరీర్‌లో రాకెట్ స్పీడ్ గ్రోత్ లో గిల్బెర్టో మోరా
Image Credit : Getty

కెరీర్‌లో రాకెట్ స్పీడ్ గ్రోత్ లో గిల్బెర్టో మోరా

గిల్బెర్టో మోరా కెరీర్ గ్రాఫ్ చాలా స్పీడ్‌గా దూసుకుపోయింది. అతనిలో ఉన్న అసాధారణ ప్రతిభను గుర్తించిన హెడ్ కోచ్ జేవియర్, టీమ్‌లో ఎంత కాంపిటీషన్ ఉన్నప్పటికీ మోరాను వరల్డ్ కప్ స్క్వాడ్‌లోకి సెలెక్ట్ చేశాడు. నిజానికి మోరా 2025 స్టార్టింగ్‌లోనే ఇంటర్నేషనల్ లెవెల్‌లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. మెక్సికో సీనియర్ నేషనల్ టీమ్ తరఫున డెబ్యూ చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా అప్పుడే రికార్డుకెక్కాడు. ఇప్పుడు ఏకంగా వరల్డ్ కప్‌లోనే హిస్టారికల్ రికార్డును తన పేరిట లిఖించుకుని ఫుట్‌బాల్ ప్రపంచంలో నయా సూపర్ స్టార్‌గా అవతరించాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
FIFA ప్రపంచ కప్
క్రీడలు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్ షురూ.. స్టేడియంలో షకీరా ఊరమాస్ డాన్స్.. సౌతాఫ్రికాను చితక్కొట్టిన మెక్సికో
Recommended image2
FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్ 2026 ఓపెనింగ్ సెర్మనీ రచ్చ.. షకీరా నుంచి కేటీ పెర్రీ దాకా.. ఇండియా టైమింగ్స్ ఇవే !
Recommended image3
FIFA World Cup 2026: మెస్సీ కంటే డేంజర్.. రోనాల్డో కంటే స్పీడ్ ! గ్రౌండ్ లో మ్యాజిక్ చేసే టాప్ 10 ఫుట్‌బాల్ సూపర్ స్టార్స్ వీరే !
Related Stories
Recommended image1
FIFA World Cup 2026: మెస్సీ కంటే డేంజర్.. రోనాల్డో కంటే స్పీడ్ ! గ్రౌండ్ లో మ్యాజిక్ చేసే టాప్ 10 ఫుట్‌బాల్ సూపర్ స్టార్స్ వీరే !
Recommended image2
FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్ షురూ.. స్టేడియంలో షకీరా ఊరమాస్ డాన్స్.. సౌతాఫ్రికాను చితక్కొట్టిన మెక్సికో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved