MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • October 1 Rule Changes: ఎల్పీజీ సబ్సిడీ నుంచి ఎస్‌బీఐ ఏటీఎం వరకు.. అక్టోబర్ 1 నుంచి మారనున్న టాప్ 10 రూల్స్

October 1 Rule Changes: ఎల్పీజీ సబ్సిడీ నుంచి ఎస్‌బీఐ ఏటీఎం వరకు.. అక్టోబర్ 1 నుంచి మారనున్న టాప్ 10 రూల్స్

October 1 Rule Changes: అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్ రానున్నాయి. ఎల్పీజీ బయోమెట్రిక్, ఎస్‌బీఐ ఏటీఎం ఛార్జీలు, ఎఫ్‌డీ వడ్డీ రేట్లు, జనన మరణ నమోదు నిబంధనలు మారనున్నాయి. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 30 2026, 01:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
అక్టోబర్ 1 నుంచి మారే 10 ముఖ్యమైన రూల్స్ ఇవే
Image Credit : chatgpt

అక్టోబర్ 1 నుంచి మారే 10 ముఖ్యమైన రూల్స్ ఇవే

సెప్టెంబర్ నెల ముగిసి అక్టోబర్ నెలలోకి అడుగుపెడుతున్న వేళ, సామాన్యుల జీవితాలపై ప్రభావం చూపే పలు కీలక నిబంధనలు మారబోతున్నాయి. అక్టోబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చే ఈ మార్పులు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల బుకింగ్, బ్యాంకింగ్ వ్యవహారాలు, ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీలు, జనన, మరణ ధృవీకరణ పత్రాల నమోదు వరకూ వ్యాపించి ఉన్నాయి. వీటికి తోడు పండుగల సీజన్ ముందు హోమ్ అప్లయెన్సెస్ ధరలు పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ఆ 10 ముఖ్యమైన మార్పులు ఏంటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఎల్పీజీ సిలిండర్ల ధరల్లో మార్పులు
Image Credit : Asianet News

ఎల్పీజీ సిలిండర్ల ధరల్లో మార్పులు

ప్రతి నెల మొదటి తేదీన పెట్రోలియం కంపెనీలు ఎల్పీజీ సిలిండర్ల ధరలను సమీక్షిస్తాయి. ఈసారి కూడా అక్టోబర్ 1న కొత్త ధరలు విడుదల కానున్నాయి. ఇప్పటికే 19 కిలోల వాణిజ్య సిలిండర్ల ధరల్లో మార్పులు చోటుచేసుకోగా, 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ల ధరలు ప్రస్తుతం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం దిల్లీలో రూ.942, కోల్‌కతాలో రూ.968, ముంబైలో రూ.941.50, చెన్నైలో రూ.957.50 వద్ద ధరలు కొనసాగుతున్నాయి.

అలాగే గృహ వినియోగదారులు సబ్సిడీ ధరకే గ్యాస్ పొందాలంటే బయోమెట్రిక్ ఆధార్ ఆథెంటికేషన్ పూర్తి చేసుకోవడం తప్పనిసరి. అనర్హులను తొలగించడం, నకిలీ కనెక్షన్లను అరికట్టడం కోసం కేంద్ర చమురు, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఈ చర్యలు చేపట్టింది. సెప్టెంబర్ 19 నాటికి దేశంలోని 27.43 కోట్ల మంది (89.9%) ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఇప్పటికే పూర్తి చేసినవారు మళ్లీ చేయాల్సిన అవసరం లేదు. ఆధార్ ఆథెంటికేషన్ చేయని వారికి సిలిండర్ల సరఫరా ఆగిపోదు, కానీ సబ్సిడీ లభించదు. వారు మార్కెట్ ధరకే సిలిండర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. డెలివరీ సమయంలో లేదా ఏజెన్సీ షోరూమ్‌లో లేదంటే ఇండియన్ ఆయిల్ ఒన్, హలో బీపీసీఎల్, హెచ్‌పీ పే యాప్‌ల ద్వారా ఈ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు.

36
ఓటీపీ ఆధారిత ఎల్పీజీ డెలివరీ.. ఎటిఎఫ్ ధరల మార్పు
Image Credit : Chatgpt

ఓటీపీ ఆధారిత ఎల్పీజీ డెలివరీ.. ఎటిఎఫ్ ధరల మార్పు

సిలిండర్ డెలివరీని మరింత పారదర్శకంగా మార్చేందుకు ఓటీపీ ఆధారిత సిస్టమ్ అక్టోబర్ 1 నుంచి అందుబాటులోకి వస్తోంది. సిలిండర్ డెలివరీ సమయంలో కేవలం కాగితపు రసీదు సరిపోదు. కస్టమర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన వన్ టైమ్ పాస్‌వర్డ్‌ను సరిచూసిన తర్వాతే సిలిండర్ చేతికి అందుతుంది.

మరోవైపు విమాన ఇంధనం లేదా ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ ధరలను కూడా చమురు కంపెనీలు మార్చనున్నాయి. ఏటీఎఫ్ ధరల్లో వచ్చే మార్పుల ఆధారంగా విమాన ప్రయాణ ఛార్జీలు పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. ప్రస్తుతం దిల్లీలో కిలోలీటరు ఏటీఎఫ్ రూ.1,04,927, కోల్‌కతాలో రూ.1,09,450, ముంబైలో రూ.98,247, చెన్నైలో రూ.1,09,873 వద్ద ఉంది.

46
ఎస్‌బీఐ ఏటీఎం రూల్స్ ఛేంజ్.. ఎఫ్‌డీ వడ్డీ రేట్ల మార్పులు
Image Credit : others

ఎస్‌బీఐ ఏటీఎం రూల్స్ ఛేంజ్.. ఎఫ్‌డీ వడ్డీ రేట్ల మార్పులు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు అక్టోబర్ 1 నుంచి కొత్త ఏటీఎం నిబంధనలు అమల్లోకి రానున్నాయి. సేవింగ్స్, శాలరీ ఖాతాదారులు ఉచిత పరిమితి దాటితే అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. బ్రాంచ్ ద్వారా తెరిచిన బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాదారులకు నెలకు 4 ఉచిత విత్‌డ్రాయల్స్ తర్వాత ప్రతి ఉపసంహరణపై రూ.15తో పాటు జీఎస్టీ పడుతుంది. శాలరీ ఖాతాదారుల ఉచిత లావాదేవీల పరిమితి 10 నుంచి 5కు తగ్గించారు. ఉచిత పరిమితి దాటిన తర్వాత 6వ లావాదేవీ నుంచి రూ.23 ప్లస్ జీఎస్టీ చెల్లించాలి. నాన్-ఫైనాన్షియల్ లావాదేవీలకు రూ.11 ప్లస్ జీఎస్టీ వర్తిస్తుంది.

అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనల ప్రకారం ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లలో పారదర్శకత పెరగనుంది. బ్యాంకులు ప్రతిరోజు ఉదయం 10 గంటలకల్లా డిపాజిట్ వడ్డీ వివరాలను తమ వెబ్‌సైట్లలో అప్‌డేట్ చేయాలి. ఒకే తేదీన, ఒకే కాలపరిమితితో స్వీకరించిన ఒకే రకమైన డిపాజిట్లపై వినియోగదారులందరికీ సమానమైన వడ్డీ రేట్లు అందించాలి. బ్రాంచ్‌ను బట్టి లేదా వ్యక్తిగతంగా మాట్లాడి వడ్డీ రేట్లు మార్చడానికి వీల్లేదు.

56
ఎన్ఆర్ఐ ప్రాపర్టీ కొనుగోళ్లు.. జనన, మరణ నమోదు రూల్స్
Image Credit : Freepik

ఎన్ఆర్ఐ ప్రాపర్టీ కొనుగోళ్లు.. జనన, మరణ నమోదు రూల్స్

ఎన్ఆర్ఐ నుంచి ఆస్తి కొనుగోలు చేసే ప్రక్రియను ఆదాయపు పన్ను శాఖ మరింత సులభతరం చేసింది. అక్టోబర్ 1 నుంచి నివాసిత వ్యక్తులు లేదా హిందూ అవిభాజ్య కుటుంబాలు ఎన్ఆర్ఐల నుంచి స్థిరాస్తి కొనుగోలు చేసినప్పుడు టిడిఎస్ మినహాయింపు కోసం ప్రత్యేకంగా Tax Deduction and Collection Account Number పొందాల్సిన అవసరం లేదు. కస్టమర్లు తమ పాన్ కార్డు ఉపయోగిస్తూనే టీడీఎస్ మినహాయించి రిపోర్ట్ చేయవచ్చు.

ఇక జనన, మరణ ధృవీకరణ పత్రాల నమోదు వ్యవధి దాటితే ప్రక్రియ కఠినతరం కానుంది. 21 రోజుల వ్యవధి దాటిన తర్వాత నమోదు చేస్తే అదనపు రుసుము, అఫిడవిట్ సమర్పించాల్సి రావచ్చు. నమోదు ఒక సంవత్సరం దాటి రెండు సంవత్సరాల లోపు ఉంటే సమాచారాన్ని ధృవీకరించిన తర్వాతే సర్టిఫికేట్ జారీ చేస్తారు. నమోదు రెండేళ్లకు పైగా ఆలస్యమైతే జుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ ఉత్తర్వులు తప్పనిసరి.

66
టీవీ, ఫ్రిజ్ ధరల పెంపు.. బ్యాంకుల వరుస సెలవులు
Image Credit : Gemini AI

టీవీ, ఫ్రిజ్ ధరల పెంపు.. బ్యాంకుల వరుస సెలవులు

పండుగల సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో టీవీ, ఫ్రిజ్, ఏసీ వంటి హోమ్ ఎలక్ట్రానిక్స్ వస్తువుల ధరలు 8 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. రాగి, ఉక్కు, అల్యూమినియం, క్రూడ్ ఆయిల్ వంటి ముడి పదార్థాల ధరలు పెరగడంతో పాటు రవాణా ఛార్జీలు అధికమవ్వడమే దీనికి ప్రధాన కారణం.

మరోవైపు అక్టోబర్ నెలలో దసరా, గాంధీ జయంతి, వారపు సెలవులతో కలిపి మొత్తం 16 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. బ్యాంకింగ్ పనుల కోసం వెళ్లే వినియోగదారులు ఆర్‌బీఐ సెలవుల జాబితాను చూసుకుని ప్రణాళిక వేసుకోవడం మంచిది. అయితే ఆన్‌లైన్ బ్యాంకింగ్, యూపీఐ, ఏటీఎం సేవలు ఎప్పటిలాగే అందుబాటులో ఉంటాయి.

ఏదైనా ఆర్థిక లావాదేవీలు లేదా దరఖాస్తులు పూర్తి చేసే ముందు సంబంధిత ప్రభుత్వ శాఖలు లేదా బ్యాంకుల అధికారిక సూచనలను చెక్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Hike: కొంపముంచిన పసిడి.. మళ్లీ భారీగా పెరిగిన బంగారం...కొనుగోలుదారులకు షాక్
Recommended image2
Diwali Gold Buying: దీపావళికి బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఈ తప్పు చేస్తే వేలల్లో నష్టపోతారు
Recommended image3
Post Office: ప్ర‌ధాని మోదీ కూడా ఈ ప‌థ‌కంలో పెట్టుబ‌డి పెడుతున్నారు.. మీరు కూడా ట్రై చేస్తారా.?
Related Stories
Recommended image1
Color Changing Lake: ఎడారిలో విచిత్రం.. ఏడాదంతా రంగులు మారే గులాబీ సరస్సు.. అసలు రహస్యం ఇదే
Recommended image2
APPSC: ఏపీపీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్.. ఓటీపీఆర్ అప్‌డేట్ స్టార్ట్.. ఎలా చేసుకోవాలంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved