MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • U19 World Cup 2026: భారత్ ఖాతాలో మరో ప్రపంచకప్.. ఇంగ్లాండ్‌ను దంచికొట్టిన కుర్రాళ్లు !

U19 World Cup 2026: భారత్ ఖాతాలో మరో ప్రపంచకప్.. ఇంగ్లాండ్‌ను దంచికొట్టిన కుర్రాళ్లు !

U19 World Cup Final 2026: హరారేలో జరిగిన అండర్-19 ప్రపంచకప్ 2026 ఫైనల్లో ఇంగ్లాండ్‌ను 100 పరుగుల తేడాతో ఓడించి భారత్ ఆరోసారి విశ్వవిజేతగా నిలిచింది. వైభవ్ సూర్యవంశీ 175 పరుగులతో రికార్డు సృష్టించాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Feb 06 2026, 08:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన యువ భారత్.. 6వ సారి వరల్డ్ కప్ కైవసం
Image Credit : Getty

ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన యువ భారత్.. 6వ సారి వరల్డ్ కప్ కైవసం

యువ భారత్ మరోసారి ప్రపంచ క్రికెట్‌పై తన ఆధిపత్యాన్ని చాటుకుంది. జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగిన అండర్-19 ప్రపంచకప్ 2026 ఫైనల్లో భారత్ 100 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను మట్టికరిపించింది. ఈ విజయంతో భారత్ రికార్డు స్థాయిలో ఆరోసారి అండర్-19 ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్‌లో వైభవ్ సూర్యవంశీ వీరవిహారంతో భారీ స్కోరు సాధించిన టీమిండియా, అనంతరం బౌలింగ్‌లోనూ అదరగొట్టి ఇంగ్లాండ్‌ను కట్టడి చేసింది.

𝗖.𝗛.𝗔.𝗠.𝗣.𝗜.𝗢.𝗡.𝗦 🏆

Congratulations to India U19 on winning the ICC Men's U19 World Cup 2026 👏👏

Their historic 6⃣th title 🫡

Take. A. Bow 🙇

Scorecard ▶️ https://t.co/hisult7mtv#U19WorldCuppic.twitter.com/5a0Pf4wpTw

— BCCI (@BCCI) February 6, 2026

25
వైభవ్ సూర్యవంశీ రికార్డుల వేట
Image Credit : Getty

వైభవ్ సూర్యవంశీ రికార్డుల వేట

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు చేసి ఇంగ్లాండ్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. అతని ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 15 సిక్సర్లు ఉన్నాయి. అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ చరిత్రలో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. 2012లో ఉన్ముక్త్ చంద్ చేసిన 111 పరుగుల రికార్డును వైభవ్ బద్దలుకొట్టాడు. వైభవ్, ఆయుష్ రెండో వికెట్‌కు 142 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమిండియా భారీ స్కోరుకు పునాది వేశారు.

4⃣3⃣9⃣ Runs 
6⃣2⃣.7⃣1⃣ Average 
1⃣7⃣5⃣ Highest 
3⃣ Fifties and 1⃣ Hundred 

For his staggering impact with the bat, Vaibhav Sooryavanshi is named the Player of the Tournament at the #U19WorldCup 2026 👌👌

Updates ▶️ https://t.co/hisult6ODXpic.twitter.com/hqMQZB0LrO

— BCCI (@BCCI) February 6, 2026

Related Articles

Related image1
Vaibhav Suryavanshi : ఏమిటా బ్యాటింగ్ సామీ ! వైభవ్ సూర్యవంశీ 5 కొత్త రికార్డులు ఇవే
Related image2
WPL 2026 : వయసు పెరిగినా వేట తగ్గలేదు.. పర్పుల్ క్యాప్ సోఫీ సొంతం.. టాప్ 5 బౌలర్లు వీరే !
35
ఐసీసీ ఫైనల్ చరిత్రలో అత్యధిక స్కోరు
Image Credit : Getty

ఐసీసీ ఫైనల్ చరిత్రలో అత్యధిక స్కోరు

50 ఓవర్లలో భారత్ 9 వికెట్ల నష్టానికి 411 పరుగులు చేసింది. పురుషుల 50 ఓవర్ల ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు. గతంలో 2003 ప్రపంచకప్ ఫైనల్లో భారత్‌పై ఆస్ట్రేలియా చేసిన 359/2 పరుగులే రికార్డుగా ఉండేది. భారత్ తరఫున ఆయుష్ (53), అభిజ్ఞాన్ కుందు (40), కనిష్క్ చౌహాన్ (37 నాటౌట్) కీలక పరుగులు సాధించారు. చివరి ఓవర్లలో కనిష్క్ మెరుపులు మెరిపించడంతో భారత్ 400 పరుగుల మార్కును దాటింది.

45
పోరాడి ఓడిన ఇంగ్లాండ్
Image Credit : Getty

పోరాడి ఓడిన ఇంగ్లాండ్

412 పరుగుల అసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. కేవలం 100 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఆ జట్టు, ఒక దశలో 183 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే కైలెబ్ ఫాల్కనర్ ఒంటరి పోరాటం చేస్తూ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. జేమ్స్ మింటోతో కలిసి అతను ఎనిమిదో వికెట్‌కు 92 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే 40.2 ఓవర్లలో 311 పరుగుల వద్ద ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముగియడంతో భారత్ 100 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Innings Break!

India U19 register the highest team total in ICC Men's U19 World Cup knockouts 👏👏

Over to the bowlers in the Final 🙌 

Updates ▶️ https://t.co/hisult7mtv#U19WorldCuppic.twitter.com/8WsIo7bxkU

— BCCI (@BCCI) February 6, 2026

55
భారత్ విజయ పరంపర
Image Credit : x@BCCI

భారత్ విజయ పరంపర

ఈ టోర్నీలో అజేయంగా నిలిచిన భారత్, ఫైనల్లోనూ అదే జోరును కొనసాగించింది. 2000, 2008, 2012, 2018, 2022 తర్వాత ఇప్పుడు 2026లో ఆరోసారి ట్రోఫీని గెలుచుకుంది. గతంలో 2022 ఫైనల్లోనూ భారత్ ఇంగ్లాండ్‌నే ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. ఇంగ్లాండ్ జట్టు ఇప్పటివరకు కేవలం ఒకే ఒక్కసారి (1998లో) మాత్రమే అండర్-19 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. తాజాగా జరిగిన ఫైనల్లో భారత బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేసి ఇంగ్లాండ్ ఆశలపై నీళ్లు చల్లారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Vaibhav Suryavanshi : ఏమిటా బ్యాటింగ్ సామీ ! వైభవ్ సూర్యవంశీ 5 కొత్త రికార్డులు ఇవే
Recommended image2
IND vs PAK : భారత్-పాక్ మ్యాచ్ ఖాయం.. రాసిపెట్టుకోండి పాకిస్థాన్ యూ టర్న్ !
Recommended image3
T20 World Cup : రెండు దేశాల తరపున టీ20 వరల్డ్ కప్ ఆడిన ఆరుగురు మొనగాళ్లు వీరే!
Related Stories
Recommended image1
Vaibhav Suryavanshi : ఏమిటా బ్యాటింగ్ సామీ ! వైభవ్ సూర్యవంశీ 5 కొత్త రికార్డులు ఇవే
Recommended image2
WPL 2026 : వయసు పెరిగినా వేట తగ్గలేదు.. పర్పుల్ క్యాప్ సోఫీ సొంతం.. టాప్ 5 బౌలర్లు వీరే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved