MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • టీమిండియాకి తిక్క కుదిరిందిగా.. రెండో టెస్టు ఓడిపోతే ఇక కష్టమే..

టీమిండియాకి తిక్క కుదిరిందిగా.. రెండో టెస్టు ఓడిపోతే ఇక కష్టమే..

India vs South Africa: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు ఓటమి అనంతరం బీసీసీఐ యూటర్న్ తీసుకుంది. రెండో టెస్టు కోసం పేస్ పిచ్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. సిరీస్ కాపాడుకోవాలంటే భారత్‌కు ఈ టెస్ట్ కీలకం. 

2 Min read
Author : Pavithra D
Published : Nov 20 2025, 01:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అనూహ్య పరాజయం తర్వాత..
Image Credit : BCCI\Twitter

అనూహ్య పరాజయం తర్వాత..

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో అనూహ్య పరాజయం తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తన వ్యూహాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. తొలి టెస్టు ఓటమి అనంతరం టీమిండియా మేనేజ్‌మెంట్ పునరాలోచనలో పడింది. ముఖ్యంగా సిరీస్‌ను చేజార్చుకోకుండా ఉండాలంటే రెండో టెస్టులో తప్పనిసరిగా గెలవాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో, గౌహతిలో జరగనున్న రెండో టెస్టు కోసం పేస్ పిచ్‌ను సిద్ధం చేస్తున్నారనే సమాధానం బలంగా వినిపిస్తోంది.

25
మొదటి టెస్టులో ఓటమి తర్వాత
Image Credit : ANI

మొదటి టెస్టులో ఓటమి తర్వాత

తొలి టెస్టులో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ పిచ్‌ బంతిని బాగా గింగిరాలు తిప్పింది. ఇది బ్యాట్స్‌మెన్‌లను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. భారత మేనేజ్‌మెంట్ సూచనల మేరకే పిచ్‌ను సిద్ధం చేశారని క్యూరేటర్ ధృవీకరించడంతో, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు కూడా దీనిపై సమర్థించుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో రెండో టెస్టుకు ఎలాంటి పిచ్‌ను సిద్ధం చేస్తారనే విషయంపై ఆసక్తి పెరిగింది. మొదటి టెస్టులో ఓటమి తర్వాత అందరి దృష్టి రెండో టెస్టు పిచ్‌పైనే పడింది.

Related Articles

Related image1
Team India ముందు తలవంచిన పీసీబీ చీఫ్ నఖ్వీ.. ఆసియా కప్ 2025 ట్రోఫీ అందజేత
Related image2
Team India: టీమిండియాకు 'హరీస్ రౌఫ్' దొరికేశాడ్రోయ్.. అయ్యో.! గంభీర్ శిష్యుడిని ఏకీపారేస్తున్నారుగా
35
ఆటగాళ్ల గాయాలు ఆందోళన
Image Credit : ANI

ఆటగాళ్ల గాయాలు ఆందోళన

మరోవైపు, టీమిండియాకు ఈ కీలక సమయాన ఆటగాళ్ల గాయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తొలి టెస్టు మధ్యలోనే మెడనొప్పితో వైదొలిగిన కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ రెండో టెస్టులో ఆడటం అనుమానంగానే ఉంది. గిల్ దూరం అయితే, తాత్కాలిక సారథిగా పంత్ వ్యవహరించే అవకాశం ఉంది. గిల్ స్థానంలో బ్యాటింగ్ చేసేది ఎవరు అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

45
భారత్‌కు అత్యంత కీలకం
Image Credit : BCCI

భారత్‌కు అత్యంత కీలకం

ప్రస్తుతం సాయి సుదర్శన్, పడిక్కల్ మాత్రమే ఆప్షన్‌లుగా ఉన్నట్లు సమాచారం. అల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి బీసీసీఐ నుంచి పిలుపు రావడంతో అతను జట్టులో చేరాడు. దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి పాలైన టీమిండియా గౌహతిలో జరిగే రెండో టెస్టుకు సిద్ధమవుతోంది. సిరీస్ చేజారకుండా ఉండాలంటే ఈ మ్యాచ్ భారత్‌కు అత్యంత కీలకం. ఇప్పటికే గౌహతికి చేరుకున్న టీమిండియా ప్రాక్టీస్ ప్రారంభించింది.

55
డబ్ల్యూటీసీ ఫైనల్స్ రేసులో వెనుకంజ
Image Credit : BCCI\Twitter

డబ్ల్యూటీసీ ఫైనల్స్ రేసులో వెనుకంజ

సఫారీలు ఈ మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా లేదా గెలిచినా కూడా సిరీస్ వారి సొంతం అవుతుంది. అంతేకాకుండా, భారత్ గడ్డపై సౌత్ ఆఫ్రికా చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్ రేసులో వెనకబడిన టీమిండియాకు, ఈ మ్యాచ్‌లో విజయం అత్యంత అవసరం. స్పోర్టింగ్ పిచ్‌పై సౌత్ ఆఫ్రికా జోరుకు టీమిండియా ఎలా అడ్డుకట్ట వేస్తుందో చూడాలి.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
శుభ్‌మన్ గిల్

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India : వీరు కదా అసలైన హీరోలు.. గంభీర్ నమ్మిన పంచ పాండవులు !
Recommended image2
పాకిస్థాన్ పై వరుణ్ చక్రవర్తి మాస్ ట్రోలింగ్.. !
Recommended image3
ఐసీసీ వరల్డ్ కప్ టీమ్ లో మనోళ్లదే హవా.. ఆ నలుగురు ప్లేయర్లు ఎవరో తెలుసా?
Related Stories
Recommended image1
Team India ముందు తలవంచిన పీసీబీ చీఫ్ నఖ్వీ.. ఆసియా కప్ 2025 ట్రోఫీ అందజేత
Recommended image2
Team India: టీమిండియాకు 'హరీస్ రౌఫ్' దొరికేశాడ్రోయ్.. అయ్యో.! గంభీర్ శిష్యుడిని ఏకీపారేస్తున్నారుగా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved