MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • IND vs SA : వరల్డ్ కప్ వేళ భారత్‌కు షాక్ మీద షాక్.. గాయంతో స్టార్ పేసర్ అవుట్

IND vs SA : వరల్డ్ కప్ వేళ భారత్‌కు షాక్ మీద షాక్.. గాయంతో స్టార్ పేసర్ అవుట్

India vs South Africa : దక్షిణాఫ్రికాతో సూపర్ 8 పోరుకు ముందు టీమిండియాకు షాక్ తగిలింది. ప్రాక్టీస్ సెషన్‌లో హార్దిక్ పాండ్యా ఆడిన షాట్ తగిలి స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ గాయపడ్డాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 21 2026, 07:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
హార్దిక్ పాండ్యా షాట్‌కు స్టార్ పేసర్ విలవిల
Image Credit : ANI

హార్దిక్ పాండ్యా షాట్‌కు స్టార్ పేసర్ విలవిల

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం జరగనున్న టీ20 ప్రపంచకప్ 2026 సూపర్ 8 పోరులో దక్షిణాఫ్రికాతో తలపడేందుకు భారత్ సిద్ధమవుతోంది. అయితే, ఈ కీలక మ్యాచ్‌కు ముందు భారత జట్టులో తీవ్ర ఆందోళన నెలకొంది. స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కారణంగా జట్టులోని ప్రధాన పేసర్ మహ్మద్ సిరాజ్ గాయపడటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ టోర్నీ ఆరంభం నుండి గాయాలు, అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న టీమిండియాకు ఇది మరో గట్టి దెబ్బ అని చెప్పాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
నెట్స్ ప్రాక్టీస్‌లో ఏం జరిగింది?
Image Credit : BCCI\Twitter

నెట్స్ ప్రాక్టీస్‌లో ఏం జరిగింది?

దక్షిణాఫ్రికాతో మ్యాచ్ కోసం శుక్రవారం రాత్రి అహ్మదాబాద్‌లో టీమిండియా ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోంది. నెట్స్ సెషన్‌లో హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా, మహ్మద్ సిరాజ్ బౌలింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా సంధించిన ఒక మెరుపు షాట్ నేరుగా వెళ్లి సిరాజ్ ఎడమ మోకాలికి బలంగా తాకింది. ఆ దెబ్బకు సిరాజ్ విలవిలలాడిపోయాడు. వెంటనే ఫిజియో మైదానంలోకి వచ్చి సిరాజ్‌ను పరీక్షించారు. ప్రాథమిక చికిత్స అనంతరం సిరాజ్ మళ్ళీ బౌలింగ్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ, అతను మైదానాన్ని వీడేటప్పుడు కుంటుతూ నడవడం అందరినీ ఆందోళనకు గురిచేసింది.

36
గాయాలమయంగా టీమిండియా ప్రయాణం
Image Credit : ANI

గాయాలమయంగా టీమిండియా ప్రయాణం

ఈ టీ20 ప్రపంచకప్‌ 2026 లో భారత్‌ను గాయాలు, అనారోగ్యాలు వెంటాడుతూనే ఉన్నాయి. టోర్నీ ప్రారంభానికి ముందే వాషింగ్టన్ సుందర్ గాయపడగా, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అనారోగ్యం బారిన పడ్డారు. యువ బ్యాటర్ అభిషేక్ శర్మ కూడా పొట్ట సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఇక టోర్నీకి ముందే యువ పేసర్ హర్షిత్ రాణా సర్జరీ కారణంగా జట్టుకు దూరమయ్యాడు. హర్షిత్ రాణా స్థానంలోనే మహ్మద్ సిరాజ్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఇప్పుడు అదే సిరాజ్ గాయపడటం జట్టు మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది.

46
సిరాజ్ అద్భుత ఫామ్.. జట్టులో కీలక పాత్ర
Image Credit : Getty

సిరాజ్ అద్భుత ఫామ్.. జట్టులో కీలక పాత్ర

మహ్మద్ సిరాజ్ ఈ టోర్నీలో ఇప్పటివరకు ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. గ్రూప్ దశలో అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో అనారోగ్యంతో ఉన్న బుమ్రా స్థానంలో సిరాజ్ తుది జట్టులోకి వచ్చాడు. ఆ మ్యాచ్‌లో 162 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడంలో సిరాజ్ కీలక పాత్ర పోషించాడు. తన అద్భుతమైన బౌలింగ్‌తో 3/29 గణాంకాలను నమోదు చేసి జట్టు విజయంలో ప్రధాన భూమిక పోషించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో అర్షదీప్ సింగ్, బుమ్రా లతో పాటు సిరాజ్ ఉండటం జట్టు బౌలింగ్ విభాగానికి ఎంతో బలాన్ని ఇస్తుంది.

56
సూపర్ 8 దిశగా టీమిండియా అద్భుత ప్రయాణం
Image Credit : AFP

సూపర్ 8 దిశగా టీమిండియా అద్భుత ప్రయాణం

భారత్ ఈ టోర్నీలో అద్భుతమైన ఫామ్‌లో ఉంది. తమ తొలి మ్యాచ్‌లో అమెరికాను చిత్తు చేసింది. ఆ తర్వాత పాకిస్థాన్‌పై విజయం సాధించిన టీమిండియా, ఆ తర్వాత నమీబియాపై 91 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది. చివరి గ్రూప్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై 17 పరుగుల తేడాతో గెలిచి అజేయంగా సూపర్ ఎయిట్ దశకు చేరుకుంది. సూపర్ ఎయిట్‌లో భారత్.. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్‌లతో కూడిన గ్రూప్‌లో ఉంది. సెమీఫైనల్‌కు చేరాలంటే ఈ గ్రూప్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలవడం అత్యవసరం.

66
బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ భరోసా
Image Credit : ANI

బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ భరోసా

సిరాజ్ గాయంపై స్పష్టత రావాల్సి ఉండగా, టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ జట్టులోని ఇతర బౌలర్లపై నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిపై ఆయన ప్రశంసలు కురిపించారు. "వరుణ్ మా జట్టులో ప్రధాన వికెట్ టేకర్. ఈ ప్రపంచకప్‌లో అతను అద్భుతంగా రాణిస్తున్నాడు. బుమ్రాతో కలిసి అతను ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచగలడు" అని మోర్కెల్ పేర్కొన్నారు. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌లో సిరాజ్ అందుబాటులో ఉంటాడా లేదా అన్నది మ్యాచ్ కు ముందు వెల్లడయ్యే అవకాశం ఉంది.

టీ20 ప్రపంచకప్ 2026 - భారత జట్టు :

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజూ శాంసన్, శివమ్ దూబే, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రింకూ సింగ్.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Related Stories
Recommended image1
T20 World Cup 2026 : ఛాన్స్ మిస్ అయితే ఇంటికే.. సూపర్ 8లో వర్షం పడితే టీమిండియా పరిస్థితి ఏంటి?
Recommended image2
IND vs SA : మరో ఫైనల్ రేంజ్ ఫైట్.. రికార్డులు చూస్తే మైండ్ బ్లాక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved