IND vs AUS T20I: టీమిండియాకు బిగ్ షాక్
IND vs AUS T20I: భారత్, ఆస్ట్రేలియా టీ20 సిరీస్ కు ముందు భారత్ కు బిగ్ షాక్ తగిలింది. తెలుగు ప్లేయర్ నీతిశ్ కుమార్ రెడ్డి గాయాలతో తొలి మూడు మ్యాచ్‌లకు దూరం అయ్యాడు.

సిరీస్ ఆరంభానికి ముందే టీమిడియాకు ఎదురుదెబ్బ
భారత్-ఆస్ట్రేలియా టీ20 సిరీస్ కు ముందే భారత్ కు ఎదురుదెబ్బ తగిలింది. టీమ్ ఇండియాకు వరుస గాయాలు సమస్యగా మారాయి. సిడ్నీలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ శ్రేయస్ అయ్యర్ ఇప్పటికే జట్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు మరో కీలక ఆటగాడు నీతిశ్ కుమార్ రెడ్డి కూడా గాయంతో తొలి మూడు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. బుధవారం (29 అక్టోబర్) ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.
22 ఏళ్ల పేస్-బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన నీతిశ్ కుమార్ రెడ్డి, టీ20 స్క్వాడ్‌లో హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయంగా ఎంపికయ్యాడు. అయితే, ఆయన లేని పరిస్థితి టీమ్ కాంబినేషన్‌పై ప్రభావం చూపనుంది.
క్వాడ్రిసెప్స్ గాయం నుండి కోలుకునేలోపే కొత్త సమస్య
నీతిశ్ రెడ్డి, ఆస్ట్రేలియాతో జరిగిన చివరి రెండు వన్డేకు గాయం కారణంగా దూరం అయ్యాడు. రెండో వన్డే సమయంలో అతనికి క్వాడ్రిసెప్స్ గాయం అయింది. కోలుకునే ప్రాసెస్‌లో ఉన్నప్పుడు ఇప్పుడు మెడలో అకస్మిక నొప్పి (neck spasm) వచ్చిందని బీసీసీఐ వెల్లడించింది.
“గాయం నుంచి కోలుకునే సమయంలో మెడ నొప్పి రావడం వల్ల అతని రికవరీ మూవ్‌మెంట్ తగ్గింది. బీసీసీఐ వైద్య బృందం అతని పరిస్థితిని పరిశీలిస్తోంది” అని బీసీసీఐ పేర్కొంది. అతనికి పూర్తిగా ఫిట్ అయ్యేందుకు వారం రోజులు పట్టే అవకాశముంది.
ప్లేయింగ్-11లోకి హర్షిత్ రాణా
నీతిశ్ స్థానంలో పేస్ బౌలర్ హర్షిత్ రాణాను ప్లేయింగ్-11లోకి వచ్చాడు. దీంతో జట్టుకు బౌలింగ్ విభాగంలో ప్రత్యామ్నాయం లభించినప్పటికీ, ఆల్‌రౌండ్ సామర్థ్యం లోపం ఏర్పడింది. మిడిల్-ఆర్డర్ బ్యాటింగ్, డెత్ ఓవర్ల బౌలింగ్‌లో నీతిశ్ పాత్ర కోల్పోవడం, సిరీస్ ప్రారంభంలోనే భారత్‌కు పెద్ద దెబ్బ అయింది.
మొదటి టీ20ని దెబ్బకొట్టిన వర్షం
మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలుచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మనుకా ఓవల్ పిచ్ బ్యాటింగ్‌కి అనుకూలంగా కనిపిస్తోందని, మొత్తం 40 ఓవర్ల పాటు అదే స్థాయిలో ఉంటుందని అన్నాడు. అయితే, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. వికెట్ తర్వాత నెమ్మదగవచ్చని భావించి, ముందుగా బ్యాటింగ్ చేయడమే తమ లక్ష్యమని వ్యాఖ్యానించాడు.
టాస్ ఓడినా, తన స్ట్రాటజీకి అనుకూలంగా నిర్ణయం రావడం తనకు మంచే జరిగిందని తెలిపాడు. అయితే, వర్షం కారణంగా పలుమార్లు మ్యాచ్ నిలిచిపోయింది. అయితే, వర్షం పూర్తిగా తగ్గకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేశారు.
తొలి టీ20 మ్యాచ్ ప్లేయింగ్-11
భారత్ జట్టు: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దుబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా,
ఆస్ట్రేలియా జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టాయినిస్, జోష్ ఫిలిప్, జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఎలిస్, మాథ్యూ కుహ్నెమన, జోష్ హేజిల్‌వుడ్

