MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Sports
  • IND vs PAK : ఒకేసారి ఇద్దరు భారత ఓపెనర్లకు గాయాలు.. గంభీర్ ప్లాన్ ఏంటి?

IND vs PAK : ఒకేసారి ఇద్దరు భారత ఓపెనర్లకు గాయాలు.. గంభీర్ ప్లాన్ ఏంటి?

IND vs PAK : టీమిండియా స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ప్రాక్టీస్ సెషన్‌లో బుమ్రా విసిరిన యార్కర్‌కు గాయపడ్డారు. నమీబియా, పాకిస్థాన్ మ్యాచ్‌ల ముందు భారత్‌కు ఇది పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి. ఇటీవల గాయాలు భారత జట్టులో ఆందోళనను పెంచుతున్నాయి.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 12 2026, 04:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టీ20 ప్రపంచ కప్ 2026: గాయాల దెబ్బలో భారత్
Image Credit : Getty

టీ20 ప్రపంచ కప్ 2026: గాయాల దెబ్బలో భారత్

టీ20 ప్రపంచ కప్ 2026లో వరుస విజయాలతో దూసుకుపోవాలని భావిస్తున్న భారత క్రికెట్ జట్టుకు గాయాల సమస్యలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అమెరికాపై విజయంతో టోర్నీని ఘనంగా ప్రారంభించిన భారత్, ఇప్పుడు కీలక ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై ఆందోళన చెందుతోంది. 

తాజాగా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడటం మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. గురువారం నమీబియాతో జరగనున్న మ్యాచ్‌కు ముందు, అలాగే ఫిబ్రవరి 15న పాకిస్థాన్‌తో జరగనున్న హై-వోల్టేజ్ పోరుకు ముందు ఈ ఘటన జరగడం గమనార్హం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బుమ్రా యార్కర్‌కు విలవిలలాడిన ఇషాన్ కిషన్
Image Credit : X

బుమ్రా యార్కర్‌కు విలవిలలాడిన ఇషాన్ కిషన్

ఫిబ్రవరి 11న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన శిక్షణా సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నెట్స్‌లో స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కొంటున్న సమయంలో, ఒక టో క్రషింగ్ యార్కర్ ఇషాన్ కిషన్ ఎడమ కాలికి బలంగా తగిలింది. బంతి తగిలిన వెంటనే కిషన్ తీవ్రమైన నొప్పితో విలవిలలాడారు. వెంటనే జట్టు ఫిజియోలు మైదానంలోకి వచ్చి అతనికి ప్రాథమిక చికిత్స అందించారు. 

గాయం తర్వాత కూడా కిషన్ సుమారు ఐదు నిమిషాల పాటు బ్యాటింగ్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ, నొప్పి తట్టుకోలేక సెషన్‌ను మధ్యలోనే ముగించి వెనుదిరిగారు. ప్రస్తుతానికి అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు కనిపిస్తున్నా, వాపు వచ్చే అవకాశం ఉన్నందున వైద్య బృందం అతడిని నిశితంగా గమనిస్తోందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

35
ఓపెనింగ్ జోడీపై సందిగ్ధత.. మరోవైపు అభిషేక్ శర్మకు అనారోగ్యం
Image Credit : Getty

ఓపెనింగ్ జోడీపై సందిగ్ధత.. మరోవైపు అభిషేక్ శర్మకు అనారోగ్యం

ఇషాన్ కిషన్ గాయం ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే, మరోవైపు యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆరోగ్యం కూడా జట్టుకు తలనొప్పిగా మారింది. తీవ్రమైన కడుపు ఇన్ఫెక్షన్‌తో ఆసుపత్రిలో చేరిన అభిషేక్, ఇటీవల డిశ్చార్జ్ అయ్యారు. అయితే నమీబియాతో మ్యాచ్‌లో అతను బరిలోకి దిగుతారా లేదా అన్నది ఇంకా స్పష్టత లేదు. 

అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో కూడా పూర్తి ఫిట్‌నెస్ లేకపోయినా బరిలోకి దిగిన అభిషేక్, రెండో బంతికే అవుట్ కావడమే కాకుండా ఫీల్డింగ్ కూడా చేయలేదు. ఒకవేళ అభిషేక్, ఇషాన్ ఇద్దరూ అందుబాటులో లేకపోతే, సంజూ శాంసన్ ఓపెనర్‌గా వచ్చే అవకాశం ఉంది. అతనికి తోడుగా వాషింగ్టన్ సుందర్‌ను ప్రమోట్ చేసే దిశగా కోచ్ గౌతమ్ గంభీర్ ఆలోచిస్తున్నారని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

45
పాకిస్థాన్ మ్యాచ్ దృష్ట్యా జాగ్రత్తలు
Image Credit : Getty

పాకిస్థాన్ మ్యాచ్ దృష్ట్యా జాగ్రత్తలు

ఫిబ్రవరి 15న కొలంబోలో పాకిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్ టీమిండియాకు అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో నమీబియా మ్యాచ్ కోసం ఇషాన్ కిషన్ విషయంలో ఎటువంటి రిస్క్ తీసుకోవద్దని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఇషాన్ కిషన్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. 

న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో సెంచరీ బాది ఫామ్‌లోకి వచ్చిన అతను, పవర్ ప్లేలో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడగలడు. అటువంటి కీలక ఆటగాడు పాక్ మ్యాచ్‌కు దూరం కాకూడదని అభిమానులు కోరుకుంటున్నారు. కిషన్ అందుబాటులో లేకపోతే వికెట్ కీపింగ్ బాధ్యతలను కూడా సంజూ శాంసన్ చేపట్టాల్సి ఉంటుంది.

55
పెరుగుతున్న గాయాలు
Image Credit : Getty

పెరుగుతున్న గాయాలు

ఈ ప్రపంచ కప్‌లో భారత జట్టును గాయాలు వెంటాడుతూనే ఉన్నాయి. దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో మోకాలి గాయం కారణంగా పేసర్ హర్షిత్ రాణా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అతని స్థానంలో జట్టులోకి వచ్చిన మహమ్మద్ సిరాజ్, అమెరికాపై మూడు వికెట్లతో అద్భుత ప్రదర్శన చేయడం ఒక్కటే ప్రస్తుతం జట్టుకు ఊరటనిచ్చే అంశం.

 ప్రస్తుతం జట్టులో సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా వంటి సీనియర్లు ఉన్నప్పటికీ, టాపార్డర్ గాయాలు ప్లేయింగ్ ఎలెవన్ ఎంపికను కష్టతరం చేస్తున్నాయి. నమీబియా మ్యాచ్ ప్రారంభానికి ముందు కిషన్ ఫిట్‌నెస్‌పై బీసీసీఐ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Afghanistan vs India: ఆప్ఘ‌న్‌పై టీమిండియా ఘ‌న విజ‌యం.. శాంస‌న్ సునామీ ఇన్నింగ్స్, సిరీస్ కైవ‌సం
Recommended image2
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Recommended image3
Abhishek Sharma: T20ల్లో అభిషేక్ శర్మ సునామీ.. దెబ్బకు రికార్డులు బద్దలు
Related Stories
Recommended image1
IND vs PAK : అభిషేక్ శర్మ వచ్చేశాడు.. ఇక పాకిస్థాన్ బౌలర్లకు చుక్కలే !
Recommended image2
ENG vs WI: దెబ్బకు ఇంగ్లండ్ మైండ్ బ్లాక్.. నేపాల్ చేతిలో బతికిపోయినా, విండీస్ పాతాళానికి తొక్కేసింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved