అంధ మహిళల టీ20 వరల్డ్ కప్ : ఛాంపియన్ గా భారత్
Blind Women T20 World Cup : శ్రీలంకలో జరిగిన తొలి అంధ మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భారత్ అద్భుతంగా రాణించి నేపాల్‌పై ఏడు వికెట్ల తేడాతో చారిత్రక విజయం సాధించింది. ఛాంపియన్ గా చరిత్ర సృష్టించింది.

కొలంబోలో టీమిండియా చరిత్ర
భారత అంధ మహిళల క్రికెట్ జట్టు ప్రపంచ కప్ వేదికపై అరుదైన జైత్రయాత్రను నమోదు చేసింది. శ్రీలంకలో జరిగిన తొలి అంధ మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో నేపాల్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించి చారిత్రక గెలుపును అందుకుంది. ఐతిహాసిక పి. శరవణముత్తు ఓవల్ మైదానంలో జరిగిన ఈ టోర్నీలో భారత జట్టు ఆరంభం నుంచి ఆధిపత్యం ప్రదర్శించింది.
ఫైనల్‌లో ముందుగా బౌలింగ్ చేసిన భారత్, నేపాల్‌ను 114 పరుగులకే కట్టడి చేయడం ద్వారా విజయం వైపు పెద్ద అడుగు వేసింది. ఆ తరువాత లక్ష్య ఛేదనలో ఫులా సరేన్ (27 బంతుల్లో అజేయంగా 44) దంచికొట్టడంతో భారత్ 12 ఓవర్లలోనే విజయతీరాలకు చేరుకుంది.
టోర్నీలో భారత ఆధిపత్యం.. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు
ఈ టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్, శ్రీలంక, యూఏఈ, నేపాల్‌తోపాటు భారత్ పోటీ పడ్డాయి. మొదటి మ్యాచ్ నుంచి ఫైనల్ వరకూ ఒక్క పరాజయం కూడా చవిచూడకుండా భారత్ అజేయ ఛాంపియన్‌గా నిలవడం విశేషం. సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాను సునాయాసంగా ఓడించిన టీమిండియా, అదే వేగంతో ఫైనల్‌లోనూ దూసుకెళ్లింది.
పాకిస్థాన్‌కు చెందిన మెహ్రీన్ అలీ 600కుపైగా పరుగులతో టోర్నీ టాప్ బ్యాటర్‌గా నిలిచినా, జట్టు విజయపథంలో మాత్రం భారత్ ముందంజలో నిలిచింది.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఫులా సరేన్
ఫైనల్‌లో ఫులా సరేన్ చేసిన 44 అజేయ పరుగులు నిర్ణయాత్మక పాత్ర పోషించాయి. మ్యాచ్ ప్రారంభం నుంచి ధైర్యంగా ఆడుతూ స్కోరును వేగంగా ముందుకు నడిపిన ఆమె, భారత్ విజయాన్ని అందించింది. ఆమె ఆటతీరు, క్రమశిక్షణ, ధృఢ సంకల్పం ఈ చారిత్రక గెలుపులో కీలకం. అందుకే ఆమెకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.
ఈ విజయం కేవలం ఒక ట్రోఫీ మాత్రమే కాదు.. అంధుల క్రికెట్ అభివృద్ధికి దేశం చూపుతున్న అంకితభావానికి నిదర్శనం. భారత అంధ మహిళల జట్టు అందించిన ఈ మైలురాయి, దేశంలో క్రీడాస్ఫూర్తిని మరింత పెంచేలా ఉంది.
India creates history! 🇮🇳
Our women’s blind cricket team defeats Nepal to win the Women’s Blind World Cup title! 🏆
A proud moment celebrating courage, talent and determination. Congratulations, Team India! 🇮🇳💙 @narendramodi@BCCI#INDvsNEP#Final#BlindCricket#TeamIndiapic.twitter.com/riVQZqqxLH— Differently Abled Cricket Council of India (@dcciofficial) November 23, 2025

