దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌కు భారత కెప్టెన్‌గా కేఎల్ రాహుల్.. జట్టులో ఎవరెవరున్నారంటే?
India ODI squad : దక్షిణాఫ్రికాతో వన్డేల కోసం కేఎల్ రాహుల్ ను భారత కెప్టెన్ గా నియమించారు. శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ గాయాల కారణంగా ఈ సిరీస్ నుంచి అవుట్ అయ్యారు. రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మలు తిరిగి జట్టులోకి వచ్చారు.

దక్షిణాఫ్రికా సిరీస్‌కు టీమిండియా స్క్వాడ్ ప్రకటించిన బీసీసీఐ
ఇండియా, దక్షిణాఫ్రికా మధ్య నవంబర్ 30 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 15 మంది ప్లేయర్లతో జట్టును ప్రకటించింది. ఆదివారం ప్రకటించిన భారత స్క్వాడ్‌లో ప్రముఖ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కొనసాగగా, కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా నియమించారు.
రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడంతో రాహుల్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. కేఎల్ రాహుల్ ఇంతకుముందు 2022 నుంచి 2023 మధ్య 12 వన్డేలకు కెప్టెన్‌గా వ్యవహరించారు.
శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ గాయాలతో జట్టుకు దూరం
శుభ్‌మన్ గిల్ నవంబర్ 29న ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండరు. ఇటీవల కోల్‌కతాలో జరిగిన దక్షిణాఫ్రికా టెస్ట్ మ్యాచ్‌లో బ్యాటింగ్ సమయంలో మెడ గాయం కావడంతో ఆయన సిరీస్‌కు దూరమయ్యారు. ప్రస్తుతం ముంబైలో ఆయన చికిత్స పొందుతున్నారు.
అలాగే, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా రిబ్ గాయం కారణంగా జట్టులో లేరు. సిడ్నీ వన్డేలో క్యాచింగ్ సమయంలో ఆయనకు స్ప్లీన్ చీలిక సమస్య తలెత్తగా, ఐసీయూలో చికిత్స పొందారు. కనీసం రెండు నెలల పాటు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.
జట్టులో సీనియర్లు కొనసాగింపు కానీ, కెప్టెన్సీ అతనికే
చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సీనియర్ సెలక్షన్ కమిటీ రోహిత్ శర్మ అందుబాటులో ఉన్నప్పటికీ రాహుల్‌నే స్టాండ్-ఇన్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ వరకు భారత జట్టును నడిపించిన రోహిత్ తర్వాత గిల్‌కు కెప్టెన్సీ ఇచ్చిన విషయం తెలిసిందే.
రుతురాజ్, తిలక్ వర్మ రీ ఎంట్రీ
గాయాలతో దూరమైన గిల్, అయ్యర్‌లకు బదులుగా జట్టులోకి రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మలను తిరిగి రప్పించారు. ఈ ఇద్దరూ గత వారం రాజకోట్‌లో జరిగిన ఇండియా ఏ, సౌతాఫ్రికా ఏ సిరీస్‌లో అద్భుతంగా రాణించారు. రుతురాజ్ 117, 68 నాటౌట్, 25 పరుగుల ఇన్నింగ్స్ లను ఆడాడు. తిలక్ వర్మ 79 పరుగులు, 1 వికెట్ తో రాణించాడు. అయితే అదే సిరీస్‌లో అద్భుతంగా రాణించిన అభిషేక్ శర్మను సెలెక్టర్లు జట్టులోకి తీసుకోలేదు.
అక్షర్ పటేల్‌కు విశ్రాంతి.. జడేజా వచ్చాడు
ఆస్ట్రేలియా టూర్‌కు ఎంపిక కానీ రవీంద్ర జడేజా ఈ వన్డే సిరీస్‌లోకి తిరిగి వచ్చారు. అతని స్థానంలో ఉన్న అక్షర్ పటేల్‌కు విశ్రాంతి ఇచ్చారు. జడేజా వన్డే కెరీర్ ముగిసిందనే ఊహాగానాలకు అగార్కర్ ముందుగానే సమాధానం ఇచ్చారు. జట్టు ప్రణాళికలో జడేజా కీలక పాత్రలో ఉన్నారని ఆయన చెప్పారు.
జస్ప్రీత్ బుమ్రా ఇటీవల పలు సిరీస్‌లలో భారీ వర్క్‌లోడ్‌తో బౌలింగ్ చేసినందున ఆయనకు విశ్రాంతి ఇచ్చారు. ఫిబ్రవరి, మార్చిలో జరిగే టీ20 వరల్డ్ కప్ దృష్ట్యా ఇది కీలకమైన విషయం.
మహ్మద్ సిరాజ్ కూడా ఈ సిరీస్‌కు దూరంగా ఉండగా, భారత పేస్ దళాన్ని అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా లాంటి యంగ్ ప్లేయర్లు నడిపించనున్నారు. మహ్మద్ షమీని మరోసారి ఎంపిక చేయకపోవడం గమనార్హం.
ఆసియా కప్‌లో క్వాడ్రిసెప్స్ గాయం కారణంగా దూరమైన హార్దిక్ పాండ్యా ఇంకా జట్టులో చేరలేదు. ఆయన టీ20 సిరీస్‌లో తిరిగి ఆడే అవకాశం ఉంది. అంతకుముందు కొన్ని దేశీ టీ20 మ్యాచ్‌లు ఆడాలని సూచనలు వచ్చాయి.
ఇండియా – సౌతాఫ్రికా వన్డే సిరీస్ షెడ్యూల్
• 1st ODI: రాంచీ – నవంబర్ 30
• 2nd ODI: రాయ్‌పూర్ – డిసెంబర్ 3
• 3rd ODI: విశాఖపట్నం – డిసెంబర్ 6
తర్వాత డిసెంబర్ 9 నుంచి 19 మధ్య ఐదు టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి.
భారత వన్డే జట్టు ఇదే
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్ (కెప్టెన్/వికెట్ కీపర్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నితీష్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్షదీప్ సింగ్, ధ్రువ్ జురేల్

