MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Sports
  • Jadeja : 6 మ్యాచ్‌లు, 1 వికెట్.. ఇదేం ఆటరా సామీ? అట్టర్ ఫ్లాప్ షో.. జడ్డూ భాయ్ బై బై !

Jadeja : 6 మ్యాచ్‌లు, 1 వికెట్.. ఇదేం ఆటరా సామీ? అట్టర్ ఫ్లాప్ షో.. జడ్డూ భాయ్ బై బై !

Ravindra Jadeja : న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ 1-2 తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమికి ప్రధాన కారణం ఒక స్టార్ ఆల్ రౌండర్ వైఫల్యమే అని విశ్లేషణలు వస్తున్నాయి. ఆ ఆటగాడి వన్డే కెరీర్ ఇక ముగిసినట్లేనని క్రీడా వర్గాల్లో చర్చ మొదలైంది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jan 19 2026, 07:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Ravindra Jadeja : బ్లూ జెర్సీలో ఇక కనిపించడా? ఆ స్టార్ ప్లేయర్‌కు ఇదే లాస్ట్ సిరీస్?
Image Credit : AFP

Ravindra Jadeja : బ్లూ జెర్సీలో ఇక కనిపించడా? ఆ స్టార్ ప్లేయర్‌కు ఇదే లాస్ట్ సిరీస్?

న్యూజిలాండ్‌తో జరిగిన ఉత్కంఠభరిత వన్డే సిరీస్‌లో భారత జట్టుకు చేదు అనుభవం మిగిలింది. స్వదేశంలో జరిగిన ఈ సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయి టీమిండియా ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత న్యూజిలాండ్ జట్టు భారత్‌పై రెండోసారి ఆధిపత్యం చెలాయించింది. గతంలో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత్‌ను 3-0 తేడాతో వైట్‌వాష్ చేసి కివీస్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.

ఇప్పుడు అదే జోరును కొనసాగిస్తూ వన్డే సిరీస్‌లోనూ ఆతిథ్య జట్టుపై తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. అయితే, ఈ సిరీస్ పరాజయం తర్వాత టీమిండియాలోని ఒక ప్రముఖ ఆల్ రౌండర్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. ఈ సిరీస్‌లో సదరు ఆటగాడి వైఫల్యం జట్టు ఓటమికి ప్రధాన కారణంగా నిలిచిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ దారుణంగా విఫలమవడంతో, అతను జట్టుకు భారంగా మారాడనే వాదనలకు బలం చేకూరుతోంది. అతనే రవీంద్ర జడేజా.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Ravindra Jadeja : వరుసగా 6 మ్యాచ్‌ల్లో వైఫల్యం
Image Credit : AFP

Ravindra Jadeja : వరుసగా 6 మ్యాచ్‌ల్లో వైఫల్యం

టీమిండియాలో కీలక ఆటగాడిగా గుర్తింపు పొందిన ఈ స్టార్ ఆల్ రౌండర్‌కు ఇటీవలి కాలంలో చెప్పుకోదగ్గ ప్రదర్శన లేదు. సౌతాఫ్రికాతో జరిగిన 3 వన్డేల సిరీస్‌తో పాటు, తాజాగా ముగిసిన న్యూజిలాండ్ సిరీస్‌లోని 3 మ్యాచ్‌ల్లోనూ అతనికి జట్టులో చోటు దక్కింది.

అయితే, ఈ ఆరు మ్యాచ్‌ల్లోనూ జడేజా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక చతికిలపడ్డాడు. గణాంకాలను పరిశీలిస్తే, ఈ 6 వన్డే మ్యాచ్‌లలో అతను కేవలం ఒకే ఒక్క వికెట్ తీయగలిగాడు. బౌలింగ్‌లో ప్రభావం చూపలేకపోయిన అతను, బ్యాటింగ్‌లోనూ తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ ఆరు మ్యాచ్‌లలో 5 ఇన్నింగ్స్‌లు ఆడిన అతను వరుసగా 32, 24*, 4, 27, 12 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

Related Articles

Related image1
IND vs NZ : కొంపముంచిన ఆ ఇద్దరు.. ఇండోర్ వన్డేలో టీమిండియా ఓటమి కారణాలు ఇవే
Related image2
Virat Kohli : వందేళ్ల రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ.. కివీస్‌పై సెంచరీతో ఒంటరి పోరాటం
35
న్యూజిలాండ్ సిరీస్ ఓటమికి కారణం?
Image Credit : AFP

న్యూజిలాండ్ సిరీస్ ఓటమికి కారణం?

న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో భారత్ ఓటమికి ఈ ఆల్ రౌండర్‌ను ప్రధాన బాధ్యుడిగా పేర్కొనడంలో అతిశయోక్తి లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లలోనూ అతని ఖాతాలో ఒక్క వికెట్ కూడా చేరలేదు. బౌలింగ్‌లో విఫలమైనా, కనీసం బ్యాటింగ్‌లోనైనా జట్టును ఆదుకుంటాడని ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలింది.

ముఖ్యంగా సిరీస్ నిర్ణయాత్మకమైన చివరి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ క్రీజులో ఉన్నప్పుడు, ఒక బలమైన భాగస్వామ్యం అవసరమైంది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన జడేజా బాధ్యతాయుతంగా ఆడలేకపోయాడు. కేవలం 12 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. దీంతో జట్టు కష్టాల్లో పడింది. ప్రస్తుతం 37 ఏళ్ల వయసులో ఉన్న రవీంద్ర జడేజాకు వన్డే ఫార్మాట్ నుండి ఇక ఉద్వాసన పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి.

45
టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన జడేజా
Image Credit : X@BCCI

టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన జడేజా

గతంలో అనేక క్లిష్ట సమయాల్లో టీమిండియాను ఒడ్డున పడేసిన స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా. న్యూజిలాండ్ తో జరిగిన చివరి వన్డేలో కేవలం 12 పరుగులకే తన వికెట్‌ను కోల్పోయి జట్టును నిరాశపరిచాడు. టీ20 ప్రపంచ కప్ 2024 విజయం తర్వాత అతను ఇప్పటికే టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

టెస్ట్ క్రికెట్‌లో బ్యాట్, బాల్‌తో అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ, వన్డేల్లో మాత్రం జడేజా గణాంకాలు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. ప్రస్తుతం అతని ప్రదర్శన చూస్తుంటే జట్టుకు భారంగా మారినట్లు కనిపిస్తోంది.

55
ప్రత్యామ్నాయం సిద్ధం.. జడేజాకు వీడ్కోలు
Image Credit : ANI

ప్రత్యామ్నాయం సిద్ధం.. జడేజాకు వీడ్కోలు

మరోవైపు, జట్టులో స్థానం కోసం యువ ఆల్ రౌండర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ సిద్ధంగా ఉన్నారు. గాయం కారణంగా వాషింగ్టన్ సుందర్ ఈ సిరీస్‌కు దూరంగా ఉన్నప్పటికీ, అతను తిరిగి జట్టులోకి వస్తే జడేజా స్థానానికి ముప్పు వాటిల్లడం ఖాయం. అక్షర్ పటేల్ కూడా తనదైన శైలిలో రాణిస్తుండటంతో, జడేజాను పక్కన పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో, బ్లూ జెర్సీలో రవీంద్ర జడేజాను మళ్లీ చూడటం కష్టమేనని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు. ఇదే అతని చివరి వన్డే సిరీస్ అయ్యే అవకాశం ఉంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image2
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Recommended image3
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Related Stories
Recommended image1
IND vs NZ : కొంపముంచిన ఆ ఇద్దరు.. ఇండోర్ వన్డేలో టీమిండియా ఓటమి కారణాలు ఇవే
Recommended image2
Virat Kohli : వందేళ్ల రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ.. కివీస్‌పై సెంచరీతో ఒంటరి పోరాటం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved