MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • Ishan Kishan : అమ్మబాబోయ్ ఏం కొట్టుడు.. రికార్డులన్నీ బద్దలు కొట్టిన ఇషాన్ కిషన్

Ishan Kishan : అమ్మబాబోయ్ ఏం కొట్టుడు.. రికార్డులన్నీ బద్దలు కొట్టిన ఇషాన్ కిషన్

Ishan Kishan : రాయ్‌పూర్‌లో జరుగుతున్న రెండో టీ20లో న్యూజిలాండ్ 209 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనలో ఇషాన్ కిషన్ దుమ్మురేపే నాక్ ఆడాడు. కేవలం 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. రికార్డుల మోత మోగించాడు.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jan 23 2026, 10:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మ్యాచ్ మలుపు తిప్పిన ఇషాన్ కిషన్.. సిక్సర్ల వర్షంతో తడిసిముద్దైన స్టేడియం
Image Credit : Getty

మ్యాచ్ మలుపు తిప్పిన ఇషాన్ కిషన్.. సిక్సర్ల వర్షంతో తడిసిముద్దైన స్టేడియం

IND vs NZ 2nd T20: రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. ఈ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ విధ్వంసం రేపాడు. స్వదేశంలో టీమిండియా ఆడుతున్న 100వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఇది కావడం విశేషం. 

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. అనంతరం 209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినా.. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్‌ల విధ్వంసకర బ్యాటింగ్‌తో ధీటుగా ముందుకు సాగింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఇషాన్, సూర్య విధ్వంసం: 48 బంతుల్లో 122 పరుగులు
Image Credit : X/BCCI

ఇషాన్, సూర్య విధ్వంసం: 48 బంతుల్లో 122 పరుగులు

రెండు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులో కలిసిన ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. వీరిద్దరూ కలిసి మైదానంలో పరుగుల వరద పారించారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు కేవలం 48 బంతుల్లోనే 122 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కివీస్ బౌలర్లను దిక్కుతోచని స్థితిలోకి నెట్టేస్తూ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు.

Related Articles

Related image1
IPL Records : కింగ్ కోహ్లీ తర్వాతే ఎవరైనా.. దడపుట్టిస్తున్నాడు భయ్యా !
Related image2
T20 World Cup : అసలేం ప్లాన్ చేశారు బాసూ? భారత్ తో పెట్టుకుంటే అంతే.. బంగ్లాదేశ్‌కు భారీ షాక్ !
35
ఇషాన్ కిషన్ రికార్డు: 21 బంతుల్లోనే అర్ధశతకం
Image Credit : Getty

ఇషాన్ కిషన్ రికార్డు: 21 బంతుల్లోనే అర్ధశతకం

ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ తన బ్యాటింగ్ పవర్‌ను చూపించాడు. కేవలం 21 బంతుల్లోనే తన అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. తద్వారా న్యూజిలాండ్‌పై టీ20ల్లో భారత్ తరఫున అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు అభిషేక్ శర్మ (22 బంతులు) పేరిట ఉండేది. బుధవారం జరిగిన తొలి టీ20లో అభిషేక్ ఈ ఘనత సాధించగా, ఇప్పుడు ఇషాన్ దానిని బ్రేక్ చేశాడు.

పవర్ ప్లే ముగిసే సమయానికి ఇషాన్ కిషన్ 23 బంతుల్లో 56 పరుగులతో నిలిచాడు. ఇది పవర్ ప్లేలో భారత బ్యాటర్ చేసిన రెండో అత్యధిక స్కోరు. ఇషాన్ మొత్తం 32 బంతుల్లో 76 పరుగులు చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. 10వ ఓవర్లో ఈష్ సోధి బౌలింగ్‌లో మ్యాట్ హెన్రీకి క్యాచ్ ఇచ్చి ఇషాన్ పెవిలియన్ చేరాడు.

45
కివీస్ ఇన్నింగ్స్: శాంట్నర్, రచిన్ రవీంద్రల పోరాటం
Image Credit : Getty

కివీస్ ఇన్నింగ్స్: శాంట్నర్, రచిన్ రవీంద్రల పోరాటం

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ జట్టుకు ఓపెనర్లు డెవాన్ కాన్వే, టిమ్ సీఫెర్ట్‌లు శుభారంభం అందించే ప్రయత్నం చేశారు. అయితే భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ కివీస్‌ను కట్టడి చేశారు. డెవాన్ కాన్వే 9 బంతుల్లో 19 పరుగులు చేసి హర్షిత్ రాణా బౌలింగ్‌లో ఔటయ్యాడు. టిమ్ సీఫెర్ట్ 13 బంతుల్లో 24 పరుగులు చేసి వరుణ్ చక్రవర్తికి చిక్కాడు. గ్లెన్ ఫిలిప్స్ (19)ను కుల్దీప్ యాదవ్ పెవిలియన్ చేర్చాడు.

మధ్య ఓవర్లలో కుల్దీప్ యాదవ్ రెండు కీలక వికెట్లు తీసి కివీస్ స్కోరు వేగాన్ని తగ్గించాడు. అయితే, చివర్లో కెప్టెన్ మిచెల్ శాంట్నర్, రచిన్ రవీంద్రలు భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. రచిన్ రవీంద్ర 26 బంతుల్లో 44 పరుగులు చేయగా, శాంట్నర్ కేవలం 27 బంతుల్లో 47 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరి దూకుడుతో న్యూజిలాండ్ స్కోరు 200 దాటింది. న్యూజిలాండ్ జట్టు 20 ఓవర్లలో 208 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది.

55
భారత్‌కు షాక్: సంజూ, అభిషేక్ విఫలం
Image Credit : ANI

భారత్‌కు షాక్: సంజూ, అభిషేక్ విఫలం

209 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత్‌కు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ సంజూ శాంసన్ మ్యాట్ హెన్రీ వేసిన తొలి ఓవర్లోనే నాలుగో బంతికి సిక్స్ కొట్టినప్పటికీ, తర్వాతి బంతికే రచిన్ రవీంద్రకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సంజూ 5 బంతుల్లో 6 పరుగులు మాత్రమే చేశాడు.

అలాగే, గత మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. జాకబ్ డఫీ వేసిన రెండో ఓవర్ తొలి బంతికే భారీ షాట్ ఆడబోయి డెవాన్ కాన్వేకు క్యాచ్ ఇచ్చాడు. దీంతో అభిషేక్ ఖాతా తెరవకుండానే గోల్డెన్ డక్‌గా ఔటయ్యాడు. దీంతో భారత్ స్వల్ప వ్యవధిలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలోనే ఇషాన్ కిషన్, సూర్య కుమార్ అద్భుతమైన నాక్ లు ఆడారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 Cricket Centuries: టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన టాప్ 7 బ్యాటర్లు ఎవరో తెలుసా?
Recommended image2
Hardik Pandya: అఫ్గానిస్తాన్‌తో T20I సిరీస్‌కు హార్దిక్ పాండ్యా ఎందుకు ఎంపిక కాలేదు?
Recommended image3
Richest Women Cricketers : టాప్ 5 రిచ్చెస్ట్ ఉమెన్ క్రికెటర్స్ వీళ్లే.. టాప్ 3 లో మన తెలుగమ్మాయి
Related Stories
Recommended image1
IPL Records : కింగ్ కోహ్లీ తర్వాతే ఎవరైనా.. దడపుట్టిస్తున్నాడు భయ్యా !
Recommended image2
T20 World Cup : అసలేం ప్లాన్ చేశారు బాసూ? భారత్ తో పెట్టుకుంటే అంతే.. బంగ్లాదేశ్‌కు భారీ షాక్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved