MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Sports
  • IND vs NZ : మరోసారి న్యూజిలాండ్ చేతిలో బలి.. కుల్దీప్ కెరీర్‌లో రెండోసారి ఇలా!

IND vs NZ : మరోసారి న్యూజిలాండ్ చేతిలో బలి.. కుల్దీప్ కెరీర్‌లో రెండోసారి ఇలా!

Kuldeep Yadav : రాజ్‌కోట్ వన్డేలో కుల్దీప్ యాదవ్ 10 ఓవర్లలో 82 పరుగులు సమర్పించుకున్నాడు. వన్డే కెరీర్‌లో న్యూజిలాండ్ చేతిలో ఇలా జరగడం ఇది రెండోసారి కావడంతో చెత్త రికార్డు నమోదైంది. కుల్దీప్ బౌలింగ్ కు ఏమైంది?

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jan 15 2026, 08:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కుల్దీప్ మ్యాజిక్ ఫెయిల్.. ఆ ఇద్దరు బ్యాటర్ల ఊచకోత మామూలుగా లేదు!
Image Credit : Getty

కుల్దీప్ మ్యాజిక్ ఫెయిల్.. ఆ ఇద్దరు బ్యాటర్ల ఊచకోత మామూలుగా లేదు!

సాధారణంగా మైదానంలో తన మణికట్టు మాయాజాలంతో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టే టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్.. న్యూజిలాండ్ జట్టు ముందు మాత్రం తేలిపోయాడు. రాజ్ కోట్ లో జరిగిన రెండో వన్డేలో కివీస్ బ్యాటర్లు కుల్దీప్ బౌలింగ్‌ను చీల్చి చెండాడారు. ఫలితంగా టీమిండియా ఓటమి పాలవ్వడమే కాకుండా, సిరీస్ సమం అయ్యింది. ఈ మ్యాచ్‌లో కుల్దీప్ తన వన్డే కెరీర్‌లోనే ఒక చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
IND vs NZ : చరిత్రాత్మక విజయంతో సిరీస్ సమం
Image Credit : AFP

IND vs NZ : చరిత్రాత్మక విజయంతో సిరీస్ సమం

భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా, రెండో మ్యాచ్‌లో కివీస్ జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. బుధవారం (జనవరి 14) రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో జరిగిన ఈ పోరులో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 284 పరుగుల భారీ స్కోరును సాధించింది. అయితే, ఈ లక్ష్యాన్ని బ్లాక్ క్యాప్స్ చాలా సునాయాసంగా ఛేదించింది. భారత గడ్డపై న్యూజిలాండ్‌కు ఇదే అత్యంత భారీ రన్ చేజ్ కావడం విశేషం. ఈ విజయంతో సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైంది.

35
కుల్దీప్ యాదవ్ కు షాక్
Image Credit : Getty

కుల్దీప్ యాదవ్ కు షాక్

ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి టీమిండియా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పైనే పడింది. అయితే, కివీస్ స్టార్ బ్యాటర్లు డారిల్ మిచెల్, విల్ యంగ్.. కుల్దీప్‌పై ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగారు. ఒత్తిడిని సృష్టించి అతడిని లయ తప్పేలా చేశారు. మిగిలిన జట్లపై తన స్పిన్ మాయాజాలంతో బ్యాటర్లను ఇబ్బంది పెట్టే కుల్దీప్, ఈ మ్యాచ్‌లో మాత్రం పూర్తిగా ప్రభావం చూపలేకపోయాడు. తన కోటా 10 ఓవర్లలో ఏకంగా 82 పరుగులు సమర్పించుకున్నాడు. వికెట్లు తీయకపోగా, ధారాళంగా పరుగులు ఇవ్వడం భారత ఓటమిని శాసించింది.

45
కెరీర్‌లో మూడోసారి.. కివీస్‌పై రెండోసారి
Image Credit : ANI

కెరీర్‌లో మూడోసారి.. కివీస్‌పై రెండోసారి

కుల్దీప్ యాదవ్ తన 119 వన్డేల కెరీర్‌లో ఒక ఇన్నింగ్స్‌లో (10 ఓవర్ల స్పెల్‌లో) 80కి పైగా పరుగులు ఇవ్వడం ఇది మూడోసారి మాత్రమే. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇందులో రెండు సార్లు ప్రత్యర్థి జట్టు న్యూజిలాండ్ కావడం గమనార్హం. గతంలో 2020లో హామిల్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో కివీస్ బ్యాటర్లు కుల్దీప్ బౌలింగ్‌లో 84 పరుగులు రాబట్టారు.

అది కుల్దీప్ కెరీర్‌లోనే అత్యంత ఖరీదైన స్పెల్. ఆ తర్వాత 2021లో పుణెలో ఇంగ్లండ్ పై కూడా వికెట్లేమీ తీయకుండా 84 పరుగులు ఇచ్చాడు. ఇప్పుడు రాజ్‌కోట్‌లో మరోసారి 82 పరుగులు ఇచ్చి తన కెరీర్‌లో మరో మాయని మచ్చను వేసుకున్నాడు.

వన్డే క్రికెట్ లో కుల్దీప్ యాదవ్ అత్యంత ఖరీదైన స్పెల్స్

  • 84/2 - వర్సెస్ న్యూజిలాండ్, హామిల్టన్ (2020)
  • 84/0 - వర్సెస్ ఇంగ్లండ్, పుణె (2021)
  • 82/1 - వర్సెస్ న్యూజిలాండ్, రాజ్‌కోట్ (2026)
  • 78/1 - వర్సెస్ దక్షిణాఫ్రికా, రాయ్‌పూర్ (2025)
55
డారిల్ మిచెల్, విల్ యంగ్ వీరవిహారం
Image Credit : Getty

డారిల్ మిచెల్, విల్ యంగ్ వీరవిహారం

రాజ్‌కోట్ వన్డేలో కుల్దీప్ యాదవ్ గణాంకాలను దెబ్బతీయడంలో డారిల్ మిచెల్ ప్రధాన పాత్ర పోషించాడు. నంబర్ 3లో బ్యాటింగ్‌కు వచ్చిన విల్ యంగ్ కూడా భారత స్పిన్నర్లపై విరుచుకుపడ్డాడు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 152 బంతుల్లో 162 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 

విల్ యంగ్ 87 పరుగుల వద్ద అవుటైనప్పటికీ, డారిల్ మిచెల్ మాత్రం చివరి వరకు క్రీజులో నిలిచి జట్టును గెలిపించాడు. మిచెల్ 117 బంతుల్లో 131 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. భారత్‌పై వన్డేల్లో అతనికి ఇది నాలుగో సెంచరీ కావడం విశేషం.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Recommended image2
Abhishek Sharma: T20ల్లో అభిషేక్ శర్మ సునామీ.. దెబ్బకు రికార్డులు బద్దలు
Recommended image3
Asia Cup 2026 Winner: రివేంజ్ తీర్చేసుకున్నారు.. మహిళల ఆసియా కప్ 2026 విజేతగా భారత్
Related Stories
Recommended image1
IND vs NZ : గెలిచే మ్యాచ్ లో ఓడిపోయారు.. ఆ ఒక్క క్యాచ్ పట్టుంటే కథ వేరేలా ఉండేది !
Recommended image2
Gold iPhone : కోహ్లీ ఫ్యాన్ మామూలోడు కాదు సామీ.. ఏకంగా 15 లక్షల గిఫ్ట్ తెచ్చాడు !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved