MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • Gold iPhone : కోహ్లీ ఫ్యాన్ మామూలోడు కాదు సామీ.. ఏకంగా 15 లక్షల గిఫ్ట్ తెచ్చాడు !

Gold iPhone : కోహ్లీ ఫ్యాన్ మామూలోడు కాదు సామీ.. ఏకంగా 15 లక్షల గిఫ్ట్ తెచ్చాడు !

Gold iPhone Virat Kohli : రాజ్ కోట్‌లో విరాట్ కోహ్లీని కలిసేందుకు వచ్చిన ఓ అభిమాని రూ.15 లక్షల విలువైన బంగారు ఐఫోన్ కవర్ తెచ్చాడు. మరోవైపు వన్డే ర్యాంకింగ్స్‌లో మళ్లీ నంబర్ 1 స్థానానికి చేరి కోహ్లీ రికార్డు సృష్టించాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jan 14 2026, 09:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
రాజ్ కోట్‌లో విరాట్ కోహ్లీకి అరుదైన బహుమతి.. చూస్తే షాక్ అవుతారు!
Image Credit : X/BCC

రాజ్ కోట్‌లో విరాట్ కోహ్లీకి అరుదైన బహుమతి.. చూస్తే షాక్ అవుతారు!

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు తమ అభిమాన క్రికెటర్‌పై ప్రేమను చాటుకునేందుకు ఎప్పుడూ ముందుంటారు. 

ఈ క్రమంలోనే తాజాగా ఓ అభిమాని విరాట్ కోహ్లీ కోసం ఎవరూ ఊహించని ఖరీదైన బహుమతిని తీసుకువచ్చాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా రాజ్ కోట్ చేరుకున్న కోహ్లీకి ఈ బహుమతిని అందించేందుకు ఆ అభిమాని ప్రయత్నించాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
సూరత్ నుంచి రాజ్ కోట్‌కు..
Image Credit : X/BCCI

సూరత్ నుంచి రాజ్ కోట్‌కు..

ప్రస్తుతం విరాట్ కోహ్లీ న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడుతున్నాడు. ఇందులో భాగంగా బుధవారం రాజ్ కోట్  లో సిరీస్‌లోని రెండో వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌కి ముందు సూరత్‌కు చెందిన ఓ వీరాభిమాని విరాట్ కోహ్లీని కలిసేందుకు రాజ్ కోట్ చేరుకున్నాడు. అయితే అతను ఒట్టి చేతులతో రాలేదు. తన అభిమాన క్రికెటర్ కోసం అత్యంత ఖరీదైన బహుమతిని వెంట తెచ్చుకున్నాడు. అతడి చేతిలో ఉన్నది సాధారణ ఐఫోన్ కవర్ కాదు, ఏకంగా బంగారంతో చేసిన కవర్ కావడం విశేషం.

Related Articles

Related image1
Virat Kohli : సచిన్ టెండూల్కర్ ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ
Related image2
KL Rahul : రోహిత్, కోహ్లీ ఫెయిల్.. రాజ్‌కోట్‌లో రాహుల్ రఫ్ఫాడించాడు.. సిక్సర్‌తో సెంచరీ
36
రూ. 15 లక్షల విలువైన గోల్డ్ కవర్
Image Credit : X/BCCI

రూ. 15 లక్షల విలువైన గోల్డ్ కవర్

ఆ అభిమాని చేతిలో ఉన్న ఐఫోన్ బ్యాక్ కవర్‌పై విరాట్ కోహ్లీ ఫోటో చాలా అందంగా చెక్కబడి ఉంది. మొదట్లో దీనిని సాధారణ కవర్‌గానే భావించినప్పటికీ, తర్వాత అది స్వచ్ఛమైన బంగారంతో చేసినదని తెలిసింది. రిపోర్టుల ప్రకారం, ఈ గోల్డ్ ఐఫోన్ కవర్ విలువ సుమారు రూ. 15 లక్షల వరకు ఉంటుందని సమాచారం. విరాట్ కోహ్లీకి గతంలోనూ అభిమానులు తమ చేతితో గీసిన పెయింటింగ్స్, బ్రాస్‌లెట్లు వంటి ఎన్నో బహుమతులు ఇచ్చారు. కానీ ఇంత ఖరీదైన బంగారు కవర్‌ను బహుమతిగా తేవడం ఇదే తొలిసారి అని చెప్పవచ్చు.

A Virat Kohli fan from Surat wants to gift Kohli an iPhone gold case worth 15 Lakh. pic.twitter.com/jL0qhWsIoy

— Mufaddal Vohra (@mufaddal_vohra) January 14, 2026

46
మరోసారి వన్డేలో నంబర్ 1
Image Credit : X/BCC

మరోసారి వన్డేలో నంబర్ 1

మైదానం బయట అభిమానుల ప్రేమను పొందుతున్న విరాట్ కోహ్లీ, మైదానంలో తన బ్యాట్‌తో పరుగుల వరద పారిస్తున్నాడు. 37 ఏళ్ల ఈ ఢిల్లీ దిగ్గజ బ్యాటర్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో 91 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 93 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో కోహ్లీ ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ తన సత్తా చాటాడు.

56
రోహిత్ శర్మను వెనక్కి నెట్టి..
Image Credit : X/BCC

రోహిత్ శర్మను వెనక్కి నెట్టి..

తాజాగా ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ మళ్లీ ప్రపంచ నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. తన సహచర ఆటగాడు, టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకున్నాడు. దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత విరాట్ కోహ్లీ మళ్లీ ఈ స్థానానికి చేరుకోవడం గమనార్హం. ఇంతకుముందు ఏప్రిల్ 2, 2021న కోహ్లీ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 స్థానంలో ఉన్నాడు. రెండో వన్డేకి ముందు ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో కోహ్లీకి 12 రేటింగ్ పాయింట్లు పెరిగాయి. దీంతో మొత్తం 785 రేటింగ్ పాయింట్లతో ఆయన అగ్రస్థానంలో నిలిచాడు.

66
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ పాయింట్ల పట్టిక ఇలా..
Image Credit : X/TeamVirat

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ పాయింట్ల పట్టిక ఇలా..

విరాట్ కోహ్లీ 785 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా, న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ తన కెరీర్ బెస్ట్ ర్యాంకింగ్‌తో రెండో స్థానంలో నిలిచాడు. ఇక రోహిత్ శర్మ రేటింగ్ పాయింట్లు 781 నుంచి 775కి తగ్గాయి. దీంతో రోహిత్ శర్మ మూడో స్థానానికి పడిపోయాడు. ఒకవైపు అభిమానుల ఖరీదైన బహుమతులు, మరోవైపు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం.. మొత్తానికి విరాట్ కోహ్లీకి ఈ సిరీస్ ఎంతో ప్రత్యేకంగా మారిందని చెప్పవచ్చు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: టీమిండియాలో భారీ మార్పులు.. జట్టులో నుంచి 8 మంది అవుట్
Recommended image2
WTC Final రేసులో టీమిండియాకు బిగ్ షాక్.. టాప్‌లో ఆసీస్, సఫారీలు సంచలనం !
Recommended image3
Messi Net Worth: బాబోయ్ మెస్సీ నెట్ వర్త్ ఇన్ని వేల కోట్లా? బ్రాండ్స్, క్లబ్‌లతో మైండ్ బ్లోయింగ్ ఇన్‌కమ్ !
Related Stories
Recommended image1
Virat Kohli : సచిన్ టెండూల్కర్ ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ
Recommended image2
KL Rahul : రోహిత్, కోహ్లీ ఫెయిల్.. రాజ్‌కోట్‌లో రాహుల్ రఫ్ఫాడించాడు.. సిక్సర్‌తో సెంచరీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved