MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Sports
  • టెస్టు జట్టులోకి పాండ్యా రీఎంట్రీ.? ఆ ఊహ ఎంత బాగుందో కదా..!

టెస్టు జట్టులోకి పాండ్యా రీఎంట్రీ.? ఆ ఊహ ఎంత బాగుందో కదా..!

Hardik Pandya: టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా టెస్టు క్రికెట్‌లోకి తిరిగి రావాలని అభిప్రాయపడ్డాడు. వెన్ను గాయం కారణంగా టెస్టులకు దూరమైన పాండ్యా, ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్, అద్భుత ఫామ్‌లో ఉన్నాడని.. 

2 Min read
Author : Pavithra D
Published : Jan 01 2026, 06:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టెస్టు క్రికెట్‌లోకి..
Image Credit : BCCI\Twitter

టెస్టు క్రికెట్‌లోకి..

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా టెస్టు క్రికెట్‌లోకి తిరిగి రావాలని భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప కీలక వ్యాఖ్యలు చేశాడు. పాండ్యాకు టెస్టు జట్టులో పునరాగమనం చేసే సత్తా ఉందని అతడు అభిప్రాయపడ్డాడు. 2025 సంవత్సరం టీమిండియాకు టెస్టుల్లో మిశ్రమ ఫలితాలను ఇచ్చింది. ఈ ఏడాది ఆరంభంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయిన భారత్, ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ను సమం చేసింది. స్వదేశంలో వెస్టిండీస్‌తో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసినప్పటికీ, సౌత్ ఆఫ్రికాపై ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
 భారత్ వైట్ వాష్‌..
Image Credit : BCCI\Twitter

భారత్ వైట్ వాష్‌..

సౌత్ ఆఫ్రికాపై రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్ వైట్ వాష్‌కు గురవడంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆశలు సంక్లిష్టంగా మారాయి. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే మిగిలిన మ్యాచ్‌లన్నింటిలోనూ తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాబిన్ ఊతప్ప చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

Related Articles

Related image1
Hardik : ఫస్ట్ ఇండియన్ క్రికెటర్‌గా హార్దిక్ పాండ్యా.. ఈ రికార్డు చూస్తే షాక్ అవుతారు !
Related image2
IND vs SA: హార్దిక్ పాండ్యా ఊచకోత.. 16 బంతుల్లోనే ఫిఫ్టీ, బద్దలైన రికార్డులు ఇవే!
35
పాండ్యా టెస్టు క్రికెట్‌లోకి రీ-ఎంట్రీ..
Image Credit : BCCI\Twitter

పాండ్యా టెస్టు క్రికెట్‌లోకి రీ-ఎంట్రీ..

రాబిన్ ఊతప్ప మాట్లాడుతూ.. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా టెస్టు క్రికెట్‌లోకి రీ-ఎంట్రీ ఇవ్వాలని తాను అభిప్రాయపడుతున్నట్లు తెలిపాడు. పాండ్యా ప్రస్తుతం కేవలం వైట్ బాల్ క్రికెట్‌లో మాత్రమే ఆడుతున్నాడు. 2017లో శ్రీలంకపై టెస్టు అరంగ్రేట్రం చేసిన పాండ్యా, ఇప్పటివరకు కేవలం 11 టెస్టులు మాత్రమే ఆడాడు. చివరిసారిగా పాండ్యా 2018లో ఇంగ్లాండ్‌పై టెస్టుల్లో ఆడాడు. వెన్ను గాయం కారణంగా అతడు టెస్టు క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. అయితే, ఆడిన 11 టెస్టుల్లోనూ 532 పరుగులతో పాటు 17 వికెట్లు పడగొట్టి తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు.

45
ఏడో స్థానం సరిగ్గా సరిపోతుంది..
Image Credit : BCCI\Twitter

ఏడో స్థానం సరిగ్గా సరిపోతుంది..

పాండ్యా టెస్టు క్రికెట్‌లోకి తిరిగి వస్తే అతడికి ఏడో స్థానం సరిగ్గా సరిపోతుందని, భారత లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ కష్టాలు తీరిపోతాయని ఊతప్ప అభిప్రాయపడ్డాడు. పాండ్యా ఒక అద్భుతమైన ఆటగాడని, ఒకవేళ తాను ఆడతానని, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను సాధిస్తానని పాండ్యా చెబితే, సెలెక్టర్లు గానీ, బోర్డు పెద్దలు గానీ నో చెప్పరని ఊతప్ప అన్నాడు. ఎందుకంటే అతడు సూపర్ ఫామ్‌తో పాటు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడు. ఒక ఇన్నింగ్స్‌లో 12 నుంచి 15 ఓవర్ల వరకు సులభంగా బౌలింగ్ చేయగలడు.

55
ఎవరూ 20 ఓవర్లకు మించి..
Image Credit : BCCI\Twitter

ఎవరూ 20 ఓవర్లకు మించి..

ప్రస్తుతం జట్టులోని మిగతా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌లలో ఎవరూ 20 ఓవర్లకు మించి బౌలింగ్ చేయడం లేదని ఊతప్ప గుర్తు చేశాడు. నితీష్ కుమార్ రెడ్డి కేవలం 12 ఓవర్ల లోపే బౌలింగ్ చేస్తున్నాడు. కాబట్టి హార్దిక్ పాండ్యా అంతకు మించి ఒకటి రెండు ఓవర్లు ఎక్కువగా బౌలింగ్ చేయగలడు. అతడు రీ-ఎంట్రీ ఇస్తే బాగుంటుందని, అయితే ఇది పూర్తిగా అతడి వ్యక్తిగత నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని ఊతప్ప స్పష్టం చేశాడు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Recommended image2
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ వరల్డ్ రికార్డు.. శ్రీలంకపై సెంచరీతో ద్రవిడ్ 27 ఏళ్ల ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు
Recommended image3
భారత్ శ్రీలంక టెస్టులో ప్లేయర్స్ మధ్య వాగ్వాదం.. అసలేం జరిగింది? తొలిరోజు ఆధిప‌త్యం ఎవ‌రిదంటే
Related Stories
Recommended image1
Hardik : ఫస్ట్ ఇండియన్ క్రికెటర్‌గా హార్దిక్ పాండ్యా.. ఈ రికార్డు చూస్తే షాక్ అవుతారు !
Recommended image2
IND vs SA: హార్దిక్ పాండ్యా ఊచకోత.. 16 బంతుల్లోనే ఫిఫ్టీ, బద్దలైన రికార్డులు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved