Hardik : ఫస్ట్ ఇండియన్ క్రికెటర్‌గా హార్దిక్ పాండ్యా.. ఈ రికార్డు చూస్తే షాక్ అవుతారు !
Hardik Pandya : ధర్మశాలలో జరిగే మూడో టీ20లో హార్దిక్ పాండ్యా చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. టీ20ల్లో 2000 పరుగులు, 100 వికెట్ల మైలురాయిని అందుకొని, ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్‌గా నిలిచే అవకాశం ఉంది.

ఒక్క వికెట్.. 61 పరుగులు.. హార్దిక్ పాండ్యా అరుదైన రికార్డు
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 అంతర్జాతీయ సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. సిరీస్‌లోని మూడవ మ్యాచ్ ఆదివారం సాయంత్రం 7:00 గంటలకు ధర్మశాలలోని హెచ్‌పిసిఎ (HPCA) స్టేడియంలో జరగనుంది. ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమంగా ఉంది. సిరీస్‌లో ఆధిక్యం సాధించాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం.
అయితే, ఈ మ్యాచ్ టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు మరింత ప్రత్యేకం కానుంది. ధర్మశాల లో హార్దిక్ పాండ్యా సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాడు. భారత క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ క్రికెటర్ సాధించని అరుదైన రికార్డును నెలకొల్పే అవకాశం ఆయనకు దక్కనుంది.
అరుదైన రికార్డుకు అడుగు దూరంలో హార్దిక్
ధర్మశాల మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా ఒక భారీ మైలురాయిని అధిగమించే అవకాశం ఉంది. 32 ఏళ్ల హార్దిక్ పాండ్యా ఇప్పటివరకు 122 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 96 ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇందులో 6 హాఫ్ సంచరీలతో 1,939 పరుగులు సాధించారు. బౌలింగ్‌లో 99 వికెట్లు పడగొట్టారు.
హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌లో మరో 61 పరుగులు చేసి, ఒక్క వికెట్ తీయగలిగితే చరిత్ర సృష్టిస్తారు. అదే జరిగితే, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో 2000 పరుగులు, 100 వికెట్లు తీసిన భారతదేశపు మొట్టమొదటి క్రికెటర్‌గా హార్దిక్ పాండ్యా రికార్డులకెక్కుతారు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ రాణించే సత్తా ఉన్న హార్దిక్, ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకోవడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు.
ప్రపంచ దిగ్గజ ఆల్ రౌండర్ల సరసన హార్దిక్
బౌలర్‌గా చూస్తే, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో 100 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో హార్దిక్ చేరనున్నాడు. ఇప్పటివరకు భారత్ తరఫున అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా మాత్రమే ఈ ఘనత సాధించారు. హార్దిక్ పాండ్యా వీరి తర్వాత మూడవ భారత బౌలర్‌గా నిలవనున్నాడు.
అయితే ఆల్ రౌండర్‌గా 2000 పరుగులు, 100 వికెట్ల మైలురాయిని చేరుకుంటే, ఆయన ప్రపంచ దిగ్గజాల సరసన చేరతాడు. బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షాకిబ్ అల్ హసన్, ఆఫ్ఘనిస్తాన్ మాజీ కెప్టెన్ మహమ్మద్ నబీ, జింబాబ్వే ప్రస్తుత టీ20 కెప్టెన్ సికిందర్ రజా వంటి ఎలైట్ క్లబ్‌లో హార్దిక్ పాండ్యాకు చోటు దక్కుతుంది. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారతీయ ఆల్ రౌండర్‌గా ఆయన నిలుస్తారు.
అత్యంత విజయవంతమైన ఆల్ రౌండర్‌గా ఎదిగే అవకాశం
ప్రస్తుతం అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అగ్రశ్రేణి ఆల్ రౌండర్ల గణాంకాలను పరిశీలిస్తే.. షాకిబ్ అల్ హసన్ 129 టీ20 మ్యాచ్‌లలో 13 అర్ధశతకాలతో 2,551 పరుగులు, 149 వికెట్లు సాధించాడు. మహమ్మద్ నబీ 145 టీ20 మ్యాచ్‌లలో 7 అర్ధశతకాలతో 2,417 పరుగులు, 104 వికెట్లు సాధించాడు. సికిందర్ రజా 127 టీ20 మ్యాచ్‌లలో 1 సెంచరీ, 16 హాఫ్ సెంచరీలతో 2,883 పరుగులు, 102 వికెట్లు సాధించాడు.
భవిష్యత్తులో హార్దిక్ పాండ్యా తన నిలకడైన ప్రదర్శనతో ఈ ముగ్గురు దిగ్గజాలను వెనక్కి నెట్టి, ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన టీ20 ఆల్ రౌండర్‌గా అవతరించే అవకాశం ఉంది. ప్రస్తుత ఫామ్ చూస్తుంటే అది అసాధ్యమేమీ కాదనిపిస్తోంది.
100 సిక్సర్లు, 100 వికెట్లతో డబుల్ రికార్డు
కేవలం పరుగులు, వికెట్ల రికార్డు మాత్రమే కాదు, హార్దిక్ పాండ్యా మరో అద్భుతమైన డబుల్ రికార్డుకు కూడా చేరువలో ఉన్నాడు. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సిక్సర్లు కొట్టి, 100 వికెట్లు తీసిన ఆటగాళ్లు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కేవలం ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే ఈ ఘనత సాధించారు. వారు మహమ్మద్ నబీ, సికిందర్ రజా, విరేన్‌దీప్ సింగ్.
హార్దిక్ పాండ్యా ఇప్పటికే టీ20ల్లో 100 సిక్సర్ల మైలురాయిని దాటేశారు. బౌలింగ్‌లో ఆయన ఖాతాలో 99 వికెట్లు ఉన్నాయి. మరో ఒక్క వికెట్ తీస్తే 100 వికెట్లు, 100 సిక్సర్లు సాధించిన ప్రపంచంలోని నాలుగవ ఆటగాడిగా, తొలి భారతీయ ఆటగాడిగా హార్దిక్ చరిత్ర సృష్టిస్తాడు.
తొలి మ్యాచ్‌లో హార్దిక్ మెరుపులు
ఈ సిరీస్‌లో హార్దిక్ పాండ్యా ప్రదర్శన గమనిస్తే.. మొదటి టీ20 మ్యాచ్‌లో తన బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. కేవలం 28 బంతుల్లోనే 59 పరుగులు చేసి, తన టీ20 కెరీర్‌లోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ఆ ఇన్నింగ్స్‌లో ఆయన విధ్వంసకర బ్యాటింగ్ తీరు అభిమానులను ఆకట్టుకుంది.
అయితే, రెండవ మ్యాచ్‌లో ఆయన పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. వికెట్లు తీయడంలో విఫలమయ్యాడు. ఇప్పుడు ధర్మశాలలో జరిగే మూడవ మ్యాచ్ ఇటు సిరీస్ పరంగానూ, అటు హార్దిక్ వ్యక్తిగత రికార్డుల పరంగానూ ఎంతో కీలకం. అభిమానులందరూ హార్దిక్ పాండ్యా ఆ ఒక్క వికెట్ తీసి, ఆ 61 పరుగులు చేసి చరిత్ర సృష్టించాలని కోరుకుంటున్నారు.

