ఇది ఫిక్స్.! ధోని ఫ్రెండ్‌ను తరిమేస్తోన్న ముంబై.. రిలీజ్ ప్లేయర్స్ లిస్టు ఇదిగో..
MI: ఐపీఎల్ 2026 మినీ వేలం కోసం ముంబై ఇండియన్స్ సిద్దమైంది. ఎలాగో ముంబై కోర్ టీం బలంగా ఉండటంతో.. కేవలం కొందరిని మాత్రమే విడుదల చేయాలని ముంబై రెడీ అయింది

టాప్ ఫ్రాంచైజీలలో ఒకటి..
ఐపీఎల్ చరిత్రలోనే ముంబై ఇండియన్స్ టాప్ ఫ్రాంచైజీలలో ఒకటిగా నిలిచింది. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా, రెండుసార్లు సీఎల్‌టీ20 ఛాంపియన్స్‌గా నిలిచింది. అయితే గత సీజన్‌లో ఈ జట్టు ప్రదర్శన మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. కాబట్టి ఆ తప్పులు మళ్లీ చేయకూడదని చూసుకుంటోంది ముంబై ఇండియన్స్.
మినీ వేలానికి సిద్దం..
ఐపీఎల్ 2026 మినీ వేలం కోసం ముంబై ఇండియన్స్ సిద్దమైంది. ఎలాగో ముంబై కోర్ టీం బలంగా ఉండటంతో.. కేవలం కొందరిని మాత్రమే విడుదల చేయాలని ముంబై రెడీ అయింది. అలాగే గాయాల కారణంగా గత సీజన్ జట్టులోకి చేర్చిన కొందరిని కూడా రిలీజ్ చేయనుంది.
కోర్ టీం బలం..
ముంబైకి కోర్ టీం ప్రధాన బలం అని చెప్పొచ్చు. ఆ కోర్ టీం లిస్టులో ముఖ్యంగా హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, ట్రెంట్ బోల్ట్ ఉంటారు. మరీ ముఖ్యంగా స్కై, హార్దిక్, రోహిత్, బుమ్రా.. ఆ జట్టుకు ఎన్నో ఏళ్ల నుంచి కీలక సభ్యులు.
రిటైన్, రిలీజ్ ప్లేయర్స్ వీరే..
హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, నమన్ ధీర్, ర్యాన్ రికెల్టన్, బెవాన్ జాకబ్స్, తిలక్ వర్మ, విల్ జాక్స్, అశ్వని కుమార్, ట్రెంట్ బోల్ట్, జస్ప్రిత్ బుమ్రా, అర్జున్ టెండూల్కర్, మిచెల్ శాంట్నర్, కర్ణ శర్మ వంటి ఆటగాళ్లు రిటైన్ లిస్టులో ఉండగా.. రాబిన్ మింజ్, రీస్ టోప్లీ, రాజ్ బవా, సత్యనారాయణ రాజు, లిజాడ్ విలియమ్స్, విగ్నేష్ పుథుర్, కృష్ణన్ శ్రిజిత్, దీపక్ చాహర్, అల్లాహ్ ఘజాన్ఫార్ రిలీజ్ లిస్టులో ఉన్నారు.
మొదటి 5 మ్యాచ్‌లు ఓటమి..
గత సీజన్‌లో మొదటి ఐదు మ్యాచ్‌లలో ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. కానీ ఆ తర్వాత పుంజుకుని వరుస విజయాలు అందుకుంది. ప్లేఆఫ్స్‌కి చేరుకుంది. మొత్తంగా 14 మ్యాచ్‌లు ఆడిన ముంబై.. ఎనిమిది విజయాలు అందుకుని.. ఆరు మ్యాచ్‌లలో ఓడిపోయి.. 16 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది.