MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Gen Z cricketers India: రోహిత్, కోహ్లీ తర్వాత వీళ్లే కింగ్స్.. వీళ్ల సంపాదన చూస్తే దిమ్మతిరిగిపోతుంది భయ్యా!

Gen Z cricketers India: రోహిత్, కోహ్లీ తర్వాత వీళ్లే కింగ్స్.. వీళ్ల సంపాదన చూస్తే దిమ్మతిరిగిపోతుంది భయ్యా!

Gen Z cricketers India: రోహిత్, కోహ్లీల శకం తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి యంగ్ టాలెంటెడ్ ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. ఈ ఆటగాళ్లు కేవలం తమ అద్భుతమైన ఆటతీరుతోనే కాకుండా, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, ఐపీఎల్ కాంట్రాక్టులతో కోట్లు ఆర్జిస్తున్నారు.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 20 2026, 02:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కోట్లకు అధిపతులైన యంగ్ ఇండియన్ క్రికెటర్లు.. జెన్ జీ మానియా అంటే ఇదే మరి
Image Credit : Chatgpt

కోట్లకు అధిపతులైన యంగ్ ఇండియన్ క్రికెటర్లు.. జెన్ జీ మానియా అంటే ఇదే మరి

మన దేశంలో క్రికెట్ అనేది కేవలం ఆట మాత్రమే కాదు, ఒక సెంటిమెంట్, ఒక ఎమోషన్. కాలం మారిన కొద్దీ మన దేశానికి ఎంతో మంది దిగ్గజ ఆటగాళ్ళు దొరికారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ప్లేయర్లు మనందరి గుండెల్లో నిలిచారు.

కానీ ఇప్పుడు టైం మారింది. క్రికెట్ ప్రపంచాన్ని ఇప్పుడు జెన్ జీలు టేకోవర్ చేసేసారు. ప్రతి రంగంలోనూ సత్తా చాటుతున్న ఈ జనరేషన్, క్రికెట్ పిచ్‌ మీద కూడా దుమ్ము లేపుతోంది. ఇప్పడు మన ఇండియన్ క్రికెట్‌లో జెన్ జీ ప్లేయర్లదే హవా.

వన్డేలు, టెస్టుల్లో మన జాతీయ జట్టును లీడ్ చేస్తున్న శుభ్‌మన్ గిల్ నుంచి, అతి చిన్న వయసులోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన వైభవ్ సూర్యవంశీ దాకా అంతా ఈ జనరేషనే. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్ కూడా ఇదే జాబితాలో టాప్‌లో ఉన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
శుభ్‌మన్ గిల్ - ప్రిన్స్ ఆఫ్ ఇండియన్ క్రికెట్
Image Credit : X@BCCI

శుభ్‌మన్ గిల్ - ప్రిన్స్ ఆఫ్ ఇండియన్ క్రికెట్

ఈ జెన్ జీ క్రికెటర్ల లిస్టులో ముందుండే పేరు శుభ్‌మన్ గిల్. ఈయన వయసు 27 సంవత్సరాలు. పంజాబ్ లోని ఫాజిల్కాలో పుట్టారు. ఇంత చిన్న వయసులోనే టీమిండియాను లీడ్ చేయడం మామూలు విషయం కాదు. శుభ్‌మన్ ప్రస్తుతం టెస్టులు, వన్డే ఫార్మాట్లలో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు.

అయితే టీ20 ఇంటర్నేషనల్స్‌లో మాత్రం ఆయన కెప్టెన్ కాదు. ఈయనను అందరూ ముద్దుగా 'ప్రిన్స్ ఆఫ్ ఇండియన్ క్రికెట్' అంటారు. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు కూడా ఇతనే కెప్టెన్.

ఆస్తుల విషయానికి వస్తే, శుభ్‌మన్ గిల్ అంచనా నెట్‌వర్త్ 80 కోట్ల నుంచి 100 కోట్ల రూపాయల మధ్య ఉంది. బీసీసీఐ కాంట్రాక్ట్, ఐపీఎల్ జీతం, అలాగే బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా ఈయన భారీగా ఆర్జిస్తున్నారు.

36
యశస్వి జైస్వాల్
Image Credit : X/BCCI

యశస్వి జైస్వాల్

జెన్ జీ స్టార్లలో యశస్వి జైస్వాల్ పేరు కూడా ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈయన వయసు 24 ఏళ్ళు. ఉత్తరప్రదేశ్‌లోని భదోహి జిల్లా ఈయన సొంతూరు. టీమిండియాలో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా బరిలోకి దిగే యశస్వి, తన దూకుడుతో కూడిన బ్యాటింగ్‌కు ఫేమస్.

ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి యశస్వి పడ్డ కష్టాలు అన్నీఇన్నీ కావు, ఆయన ప్రయాణం ఎన్నో పోరాటాలతో సాగింది. ఐపీఎల్‌లో ఈ యువ కిషోర్ రాజస్థాన్ రాయల్స్ టీమ్ తరఫున ఆడుతున్నారు.

2026 నాటికి యశస్వి జైస్వాల్ అంచనా నెట్‌వర్త్ సుమారు 55 కోట్ల రూపాయలుగా ఉంది. 'ది స్పోర్ట్స్ లెజెండ్' సంస్థ ఈ ఏడాది ఆగస్టు 11న విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం ఈ అంచనా సంపాదన ఇది.

46
అభిషేక్ శర్మ - పవర్ హిట్టర్
Image Credit : BCCI

అభిషేక్ శర్మ - పవర్ హిట్టర్

ఈ జాబితాలో మూడో పేరు అభిషేక్ శర్మది. ఈయన వయసు 26 సంవత్సరాలు. గతంలో భారత్ తరఫున అండర్-19 వరల్డ్ కప్ కూడా ఆడారు. అభిషేక్ బ్యాటింగ్ చేస్తుంటే చూస్తూ ఉండిపోవాల్సిందే, అంతలా అభిమానులను ఆకట్టుకుంటారు.

అభిషేక్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్, అంతేకాదు మంచి ఆల్ రౌండర్ కూడా. టీమిండియా తరఫున ఓపెనర్‌గా వస్తుంటారు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడుతూ మెరుపులు మెరిపిస్తున్నారు.

మీడియా రిపోర్ట్ల ప్రకారం అభిషేక్ శర్మ నికర ఆస్తుల విలువ సుమారు 12 కోట్ల నుంచి 30 కోట్ల రూపాయల మధ్య ఉంటుందని అంచనా.

56
తిలక్ వర్మ - మిడిల్ ఆర్డర్ కు బలం
Image Credit : PTI

తిలక్ వర్మ - మిడిల్ ఆర్డర్ కు బలం

జెన్ జీ క్రికెటర్లలో మరొకరు తిలక్ వర్మ. ఈయన వయసు 23 ఏళ్ళు. 2002 నవంబర్ 8న హైదరాబాద్, తెలంగాణలోనే జన్మించారు. తిలక్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మనే కాకుండా, అవసరమైనప్పుడు ఆఫ్ స్పిన్ బౌలింగ్ కూడా చేయగలరు.

ఈయన బ్యాటింగ్ స్టైల్ చాలా స్పెషల్. ఒత్తిడిలో కూడా క్రీజులో నిలదొక్కుకోవడం, ఛాన్స్ దొరికితే స్పీడ్‌గా పరుగులు తీయడం ఈయన స్పెషాలిటీ. ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో భారత్ తరఫున మిడిల్ ఆర్డర్‌లో ఆడుతున్నారు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ టీమ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

మీడియా అంచనాల ప్రకారం తిలక్ వర్మ నెట్‌వర్త్ సుమారు 20 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. ముంబై ఇండియన్స్ ఇచ్చే సాలరీ, మ్యాచ్ ఫీజులు, బ్రాండ్ల ద్వారా ఈయన సంపాదిస్తున్నారు.

66
వైభవ్ సూర్యవంశీ - అతి పిన్న వయసు సంచలనం
Image Credit : ANI

వైభవ్ సూర్యవంశీ - అతి పిన్న వయసు సంచలనం

జెన్ జీ స్టార్ల లిస్టులో వైభవ్ సూర్యవంశీ పేరు ఇప్పుడు హాట్ టాపిక్. ఈ యంగ్ ప్లేయర్ వయసు కేవలం 15 ఏళ్లే. మార్చి 27, 2011న బీహార్‌లోని సమస్తిపూర్‌లో పుట్టారు. ఇంత చిన్న వయసులోనే తన అటాకింగ్ బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు.

వైభవ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్. మైదానంలో పెద్ద పెద్ద సిక్సర్లు కొట్టడంలో దిట్ట. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఈ యంగ్ స్టార్, తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఇప్పటికే కొన్ని రికార్డులు బద్దలు కొట్టాడు.

మీడియా రిపోర్ట్ల ప్రకారం వైభవ్ సూర్యవంశీ నికర ఆస్తుల విలువ దాదాపు 2.5 కోట్ల నుంచి 7 కోట్ల రూపాయల మధ్య ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ జెన్ జీ క్రికెటర్లంతా తమ కష్టాన్ని, ప్రతిభను నమ్ముకుని చాలా చిన్న వయసులోనే క్రికెట్ లో అద్భుతాలు సృష్టిస్తున్నారు. శుభ్‌మన్ కెప్టెన్సీ నుంచి యశస్వి దూకుడు, అభిషేక్ భారీ షాట్లు, తిలక్ కూర్పు, వైభవ్ ఊచకోత.. ఇవన్నీ మన ఇండియన్ క్రికెట్ ఫ్యూచర్ ఏంటో చూపిస్తున్నాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
భారత జాతీయ క్రికెట్ జట్టు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Abhishek Sharma Weakness: అభిషేక్ శర్మ సీక్రెట్ లీక్? విండీస్ బౌలర్లు పట్టిన వీక్ పాయింట్ ఇదే
Recommended image2
IPL 2027 Auction: 4 ఏళ్ల తర్వాత ఇండియాకి ఐపీఎల్ ఆక్షన్.. గోవాలో వేలం తేదీ ఫిక్స్
Recommended image3
IND vs WI: బెంగళూరులో టీమిండియా గెలవాలంటే ఈ 3 మార్పులు చేయాల్సిందే !
Related Stories
Recommended image1
iPhone 17: 99 వేల ఫోన్ కేవలం 55 వేలకే.. ఐఫోన్ 17 పై భారీ డిస్కౌంట్
Recommended image2
Best 5G Smartphones Under Rs 10000: రూ. 10 వేల లోపే బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్.. అదిరిపోయే ఫీచర్లతో టాప్-5 మొబైల్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved