MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • PAK vs ENG : పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన ఇంగ్లాండ్.. సెమీస్ బెర్త్ ఫిక్స్

PAK vs ENG : పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన ఇంగ్లాండ్.. సెమీస్ బెర్త్ ఫిక్స్

England vs Pakistan : టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్తాన్‌పై 2 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఇంగ్లాండ్, సెమీఫైనల్‌కు చేరిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. హ్యారీ బ్రూక్ అద్భుతమైన సెంచరీతో దుమ్మురేపాడు. దీంతో పాక్ ఇంటిదారి పట్టడం ఖాయమైంది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 24 2026, 11:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
పాకిస్తాన్‌పై ఇంగ్లాండ్ ఊచకోత.. హ్యారీ బ్రూక్ సెంచరీ విధ్వంసం
Image Credit : Gettu/ANI

పాకిస్తాన్‌పై ఇంగ్లాండ్ ఊచకోత.. హ్యారీ బ్రూక్ సెంచరీ విధ్వంసం

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో పాకిస్తాన్‌ను ఓడించి ఇంగ్లాండ్ సెమీఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ సూపర్ 8 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ప్రస్తుత టోర్నమెంట్‌లో సెమీఫైనల్‌కు చేరుకున్న మొదటి జట్టుగా ఇంగ్లాండ్ నిలిచింది. హ్యారీ బ్రూక్ అద్భుతమైన సెంచరీతో ఇంగ్లాండ్‌ను విజయతీరాలకు చేర్చగా, పాక్ బౌలర్ షాహీన్ అఫ్రిది పోరాటం వృధా అయింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
పాకిస్తాన్ పోరాటం.. తడబడిన బ్యాటర్లు
Image Credit : Getty

పాకిస్తాన్ పోరాటం.. తడబడిన బ్యాటర్లు

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ 45 బంతుల్లో 63 పరుగులతో రాణించి ఇన్నింగ్స్‌ను ఆదుకున్నాడు. బాబర్ ఆజం (25), ఫఖర్ జమాన్ (25), షాదాబ్ ఖాన్ (23) పర్వాలేదనిపించినా, భారీ స్కోరు సాధించలేకపోయారు. ఇంగ్లాండ్ బౌలర్లలో లియామ్ డాసన్ 24 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి పాక్ నడ్డి విరిచాడు. జోఫ్రా ఆర్చర్, జేమీ ఓవర్టన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

Related Articles

Related image1
India vs Zimbabwe : తిలక్ అవుట్.. సంజూ ఇన్! సూపర్ 8లో భారత్ సెన్సేషనల్ ప్లాన్
Related image2
Team India : గంభీర్ టార్గెట్‌గా పాక్ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్.. టీమిండియాలో పాలిటిక్స్ నిజమేనా?
36
షాహీన్ అఫ్రిది ఆరంభ అదిరింది
Image Credit : Getty

షాహీన్ అఫ్రిది ఆరంభ అదిరింది

165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌కు షాహీన్ అఫ్రిది చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ మొదటి బంతికే ఫిలిప్ సాల్ట్‌ను డకౌట్‌గా వెనక్కి పంపాడు. ఆ తర్వాత కెప్టెన్ జోస్ బట్లర్ (2), జాకబ్ బెథెల్ (8)లను కూడా అవుట్ చేసి ఇంగ్లాండ్‌ను 35 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడేలా చేశాడు. ఈ టోర్నమెంట్‌లో అఫ్రిది పవర్‌ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా రికార్డు సృష్టించాడు.

46
హ్యారీ బ్రూక్ కెప్టెన్ ఇన్నింగ్స్
Image Credit : X@ICC

హ్యారీ బ్రూక్ కెప్టెన్ ఇన్నింగ్స్

కష్టాల్లో ఉన్న జట్టును హ్యారీ బ్రూక్ ఒంటిచేత్తో ఆదుకున్నాడు. మొదటిసారి టీ20ల్లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన బ్రూక్, కేవలం 50 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒక కెప్టెన్ సాధించిన మొదటి సెంచరీ కావడం విశేషం. బ్రూక్ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. అతనికి సామ్ కర్రన్ (16), విల్ జాక్స్ (28) సహకారం అందించారు. బ్రూక్ చివరిలో అవుట్ అయినా, అప్పటికే ఇంగ్లాండ్ విజయం ఖాయమైంది.

56
ENG vs PAK : చివరి ఓవర్లలో ఉత్కంఠభరిత క్లైమాక్స్
Image Credit : ANI

ENG vs PAK : చివరి ఓవర్లలో ఉత్కంఠభరిత క్లైమాక్స్

చివరి ఓవర్లలో మొహమ్మద్ నవాజ్ వరుసగా వికెట్లు తీయడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. 19వ ఓవర్లో విల్ జాక్స్, జేమీ ఓవర్టన్‌లను నవాజ్ అవుట్ చేయడంతో ఇంగ్లాండ్ శిబిరంలో టెన్షన్ మొదలైంది. చివరి 7 బంతుల్లో 4 పరుగులు కావాల్సిన స్థితిలో జోఫ్రా ఆర్చర్ క్రీజులోకి వచ్చాడు. 20వ ఓవర్ మొదటి బంతికే సల్మాన్ మీర్జా బౌలింగ్‌లో ఆర్చర్ ఫోర్ కొట్టి ఇంగ్లాండ్‌ను 19.1 ఓవర్లలోనే గెలిపించాడు.

66
పాక్ సెమీస్ అవకాశం కష్టమే
Image Credit : Getty

పాక్ సెమీస్ అవకాశం కష్టమే

ఈ ఓటమితో పాకిస్తాన్ సెమీఫైనల్ అవకాశాలు ప్రమాదంలో పడ్డాయి. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో కేవలం ఒక పాయింట్ మాత్రమే ఉన్న పాక్, తమ తదుపరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను తప్పక ఓడించాల్సి ఉంటుంది. మరోవైపు, పాకిస్తాన్‌పై టీ20 ప్రపంచకప్‌లలో ఇంగ్లాండ్‌కు ఇది నాలుగో విజయం. మ్యాచ్ అనంతరం హ్యారీ బ్రూక్ తన ప్రదర్శన పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, సెమీస్‌కు వెళ్లడం సంతోషంగా ఉందని తెలిపాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
పాకిస్తాన్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
క్రీడలు
క్రికెట్

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs AFG: తొలి వన్డేకు టీమిండియా ప్లేయింగ్ XI రెడీ.. గిల్ స్కెచ్‌తో ఆ స్టార్ ప్లేయర్‌కు నో ఛాన్స్!
Recommended image2
FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్ 2026 ఓపెనింగ్ సెర్మనీ రచ్చ.. షకీరా నుంచి కేటీ పెర్రీ దాకా.. ఇండియా టైమింగ్స్ ఇవే !
Recommended image3
FIFA World Cup 2026: మెస్సీ కంటే డేంజర్.. రోనాల్డో కంటే స్పీడ్ ! గ్రౌండ్ లో మ్యాజిక్ చేసే టాప్ 10 ఫుట్‌బాల్ సూపర్ స్టార్స్ వీరే !
Related Stories
Recommended image1
India vs Zimbabwe : తిలక్ అవుట్.. సంజూ ఇన్! సూపర్ 8లో భారత్ సెన్సేషనల్ ప్లాన్
Recommended image2
Team India : గంభీర్ టార్గెట్‌గా పాక్ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్.. టీమిండియాలో పాలిటిక్స్ నిజమేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved