MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • కెరీర్ మొత్తం 6 సిక్సర్లే.. 12 డబుల్, 2 ట్రిపుల్ సెంచరీలు.. ఎవరా ప్లేయర్?

కెరీర్ మొత్తం 6 సిక్సర్లే.. 12 డబుల్, 2 ట్రిపుల్ సెంచరీలు.. ఎవరా ప్లేయర్?

Don Bradman : సర్ డాన్ బ్రాడ్‌మాన్ తన టెస్ట్ కెరీర్‌లో 12 డబుల్ సెంచరీలు, 2 ట్రిపుల్ సెంచరీలతో రికార్డుల మోత మోగించాడు. అయితే, అతను మొత్తం కెరీర్‌లో కేవలం 6 సిక్సులు మాత్రమే కొట్టారు. ఇప్పటికీ చెరగని రికార్డులు సాధించాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Nov 24 2025, 03:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
క్రికెట్‌లో అసాధ్యమైన డాన్ బ్రాడ్‌మాన్ రికార్డు
Image Credit : Getty

క్రికెట్‌లో అసాధ్యమైన డాన్ బ్రాడ్‌మాన్ రికార్డు

క్రికెట్ చరిత్రలో సెంచరీల సంఖ్య పెద్దదైనా, డబుల్ సెంచరీలు సాధించడంలో సర్ డాన్ బ్రాడ్‌మాన్ రికార్డును ఇప్పటికీ ఎవరూ బద్దలు కొట్టలేకపోయారు. టెస్ట్ క్రికెట్‌లో ఆయన 12 డబుల్ సెంచరీలు సాధించాడు. ఇప్పటికీ ఈ రికార్డును ఏ ప్లేయరూ అందుకోలేకపోయారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, ఇన్ని భారీ స్కోర్లు చేసినప్పటికీ ఆయన మొత్తం కెరీర్‌లో కేవలం 6 సిక్సులు మాత్రమే కొట్టారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
టెస్ట్ డబుల్ సెంచరీల కింగ్ డాన్ బ్రాడ్‌మాన్
Image Credit : Getty

టెస్ట్ డబుల్ సెంచరీల కింగ్ డాన్ బ్రాడ్‌మాన్

క్రికెట్‌లో డబుల్ సెంచరీల రికార్డులు అనగానే వన్డేల్లో రోహిత్ శర్మ పేరు గుర్తుకువస్తుంది. అయితే, టెస్ట్ క్రికెట్‌లో డబుల్ సెంచరీల అసలు రాజు మాత్రం డాన్ బ్రాడ్‌మాన్. 1928 నుంచి 1948 వరకు అంతర్జాతీయ స్థాయిలో ఆయన బ్యాటింగ్ గణాంకాలు ఇప్పటికీ చరిత్రలో అద్భుతంగా నిలిచాయి. ఆయన రికార్డులు మూడు తరాల క్రికెటర్లకు కూడా అందని ఎత్తులో ఉన్నాయి.

Related Articles

Related image1
IND vs SA : ఎవడ్రా ఈ ముత్తుసామి? గువాహటిలో భారత్ ను కష్టాల్లోకి నెట్టాడు !
Related image2
ఒక్క పరుగు టార్గెట్.. క్రికెట్ చరిత్రలో కొత్త రికార్డు.. సూపర్ ఓవర్‌లో భారత్ కు షాక్
35
12 డబుల్ సెంచరీలతో తుపాను ఆట
Image Credit : ChatGPT

12 డబుల్ సెంచరీలతో తుపాను ఆట

డాన్ బ్రాడ్‌మాన్ టెస్ట్‌ల్లో 12 డబుల్ సెంచరీలు చేశారు. ఇది ఇప్పటికీ ఎవ్వరూ చేరుకోలేని రికార్డు. ఆధునిక క్రికెట్‌లో విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్ వంటి టాప్ బ్యాట్స్‌మన్‌లు కూడా ఈ మైలురాయిని చేరలేకపోయారు. కాలం మారినా, ఫార్మాట్లు వేగవంతమైనా, డాన్ బ్రాడ్‌మాన్ రికార్డు మాత్రం ఇప్పటికీ టాప్ లోనే ఉంది.

45
సంగక్కర దగ్గరగా వచ్చాడు కానీ..
Image Credit : Getty

సంగక్కర దగ్గరగా వచ్చాడు కానీ..

ఈ రికార్డుకు అత్యంత దగ్గరగా చేరిన ఆటగాడు శ్రీలంకకు చెందిన కుమార సంగక్కర. తన కెరీర్‌లో ఆయన 11 డబుల్ సెంచరీలు చేశారు. డాన్ బ్రాడ్‌మాన్ రికార్డును బద్దలు కొట్టడానికి ఒక్క డబుల్ సెంచరీ దూరంలోనే ఆగిపోయారు. అయినప్పటికీ ఈ రికార్డులు డాన్ బ్రాడ్‌మాన్ ఆట స్థాయి ఎంత గొప్పదో స్పష్టం చేస్తుంది.

55
6 సిక్సులు మాత్రమే.. అయినా భారీ ఇన్నింగ్స్‌లు
Image Credit : Getty

6 సిక్సులు మాత్రమే.. అయినా భారీ ఇన్నింగ్స్‌లు

డాన్ బ్రాడ్‌మాన్ తనదైన ఆటతో ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కొనే వాడు. అనేక షాట్లు ఆడాడు. కానీ, టెస్ట్ కెరీర్‌లో ఆయన కేవలం 6 సిక్సులు మాత్రమే కొట్టాడు. భారీ సెంచరీలు, డబుల్ సెంచరీలు చేయడం ఆయనకు కొత్త కాదు, కానీ అవన్నీ ప్రధానంగా గ్రౌండ్ షాట్స్‌తోనే చేశారు. గాలిలోకి బంతిని కొట్టడం కన్నా బంతిని నేల మీదుగా బౌండరీకి పంపించడం ఆయన వ్యూహ్యంగా ఉండేది.

క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ సగటు డాన్ బ్రాడ్‌మాన్ సొంతం

డాన్ బ్రాడ్‌మాన్ గొప్పతనానికి నిదర్శనం ఆయన కెరీర్ బ్యాటింగ్ సగటు. 52 టెస్ట్‌ల్లో ఆయన 99.94 సగటుతో 6,996 పరుగులు చేశారు. ఈ సగటును ఇప్పటివరకు ఎవ్వరూ అందుకోలేదు. టెస్ట్‌ల్లో ఆయన 2 ట్రిపుల్ సెంచరీలు కూడా చేశారు. ఇది ఆయన బ్యాటింగ్ సామర్థ్యానికి నిలువెత్తు సాక్ష్యం.

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోనూ డాన్ బ్రాడ్‌మాన్ జోరు

అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో మాత్రమే కాదు, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో కూడా డాన్ బ్రాడ్‌మాన్ రికార్డులు టాప్ లో ఉన్నాయి. 234 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో ఆయన 117 సెంచరీలు, 69 హాఫ్ సెంచరీలు చేశారు. ఆయన అత్యధిక స్కోరు 452 నాటౌట్. ఈ గణాంకాలు ఎందుకు ఆయనను ‘డాన్’ అని పిలిచారో స్పష్టంగా చెబుతాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Richest Women Cricketers : టాప్ 5 రిచ్చెస్ట్ ఉమెన్ క్రికెటర్స్ వీళ్లే.. టాప్ 3 లో మన తెలుగమ్మాయి
Recommended image2
Kohli Anushka: విరాట్-అనుష్క లండన్ ఎందుకు వెళ్లారో తెలుసా? సీక్రెట్ బయటపెట్టిన మాధురీ దీక్షిత్ భర్త!
Recommended image3
Team India: టీమిండియాలో భారీ మార్పులు.. జట్టులో నుంచి 8 మంది అవుట్
Related Stories
Recommended image1
IND vs SA : ఎవడ్రా ఈ ముత్తుసామి? గువాహటిలో భారత్ ను కష్టాల్లోకి నెట్టాడు !
Recommended image2
ఒక్క పరుగు టార్గెట్.. క్రికెట్ చరిత్రలో కొత్త రికార్డు.. సూపర్ ఓవర్‌లో భారత్ కు షాక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved