MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • DC vs MI : ముంబై ఇండియన్స్ ఓటమికి టాప్ 5 రీజన్స్ ఇవే..!

DC vs MI : ముంబై ఇండియన్స్ ఓటమికి టాప్ 5 రీజన్స్ ఇవే..!

IPL 2026 : ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో శనివారం సాయంత్రం ముంబై ఇండియన్స్ అభిమానులకు ఒక పీడకల మిగిలింది. అసలు ఈ మ్యాచ్ లో ముంబై ఎందుకు ఓడిపోయింది..? 

2 Min read
Author : Arun Kumar P
Published : Apr 04 2026, 08:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
ముంబై పై డిల్లీ విజయం..
Image Credit : Getty

ముంబై పై డిల్లీ విజయం..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో డిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండో విజయం అందుకుని పాయింట్స్ టేబుల్ లో టాప్ కు చేరింది. సొంత మైదానంలో చెలరేగి ఆడిన డిసి బలమైన ముంబై ఇండియన్స్ ని చిత్తుచేసింది. ఐదుసార్లు ఐపిఎల్ ఛాంపియన్ అయిన ముంబై టీంని డిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో షాకిచ్చింది. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీలతో చెలరేగినా ముంబైకి ఓటమి తప్పలేదు... డిల్లీ బ్యాటర్ సమీర్ రిజ్వీ 90 పరుగుల తుఫాన్ ఇన్నింగ్స్ ముందు వీరు నిలవలేకపోయారు.

అయితే ఈ మ్యాచ్ లో ముంబై ఓటమికి కారణమేంటి... సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీనా..? రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆడకపోవడమా..? టీం చెత్త ఫీల్డింగా..? బ్యాటింగ్ వైఫల్యమా..? ముంబై ఓటమికి దారితీసిన 5 కీలక కారణాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
1. ఇంపాక్ట్ ప్లేయర్ సమీర్ రిజ్వీ విధ్వంసం
Image Credit : Getty

1. ఇంపాక్ట్ ప్లేయర్ సమీర్ రిజ్వీ విధ్వంసం

ఢిల్లీ తరఫున 'ఇంపాక్ట్ ప్లేయర్'‌గా బరిలోకి దిగిన సమీర్ రిజ్వీ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. కేవలం 51 బంతుల్లో 90 పరుగులు చేసి తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. అతని ధాటికి ముంబై బౌలర్లు చేతులెత్తేశారు. రిజ్వీకి ఇది వరుసగా రెండో హాఫ్ సెంచరీ. ఈ ఇన్నింగ్స్‌తో ముంబై చేతుల్లోంచి విజయాన్ని లాగేసుకున్నాడు.

37
2. హార్దిక్ పాండ్యా లేకపోవడం..
Image Credit : Getty

2. హార్దిక్ పాండ్యా లేకపోవడం..

టాస్ సమయంలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. హార్దిక్ పాండ్యా పూర్తి ఫిట్‌గా లేడని తర్వాత తెలిసింది. రెగ్యులర్ కెప్టెన్, ఫినిషర్ హార్దిక్ లేని లోటు ముంబైకి స్పష్టంగా కనిపించింది. చివరి ఓవర్లలో వేగంగా పరుగులు చేయగల బ్యాటర్ మిడిల్ ఆర్డర్‌లో కరువయ్యాడు.

47
3. క్యాచులు వదిలేయడం..
Image Credit : Sales TEam

3. క్యాచులు వదిలేయడం..

ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఓపెనర్ పాథుమ్ నిస్సంకకు ఒకటి కాదు, రెండుసార్లు లైఫ్ లభించింది. మొదట దీపక్ చాహర్, ఆ తర్వాత నమన్ ధీర్ అతనిచ్చిన సులభమైన క్యాచ్‌లను నేలపాలు చేశారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకున్న నిస్సంక 44 పరుగులు చేసి ఢిల్లీకి అవసరమైన బలమైన పునాది వేశాడు.

57
4. చేతులెత్తేసిన మిడిల్ ఆర్డర్
Image Credit : Getty

4. చేతులెత్తేసిన మిడిల్ ఆర్డర్

రోహిత్ శర్మ (35 పరుగులు), సూర్యకుమార్ యాదవ్ (51 పరుగులు) 10వ సారి హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు మంచి ప్లాట్‌ఫామ్ అందించారు. కానీ వాళ్లిద్దరూ ఔటైన తర్వాత ముంబై బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయింది. చిన్న బౌండరీలున్న ఈ మైదానంలో 162 పరుగుల స్కోరు ఏమాత్రం సరిపోలేదు.

67
5. ముఖేష్ కుమార్ సూపర్ బౌలింగ్
Image Credit : Getty

5. ముఖేష్ కుమార్ సూపర్ బౌలింగ్

ఢిల్లీ బౌలర్ ముఖేష్ కుమార్ 2 వికెట్లు తీయడమే కాకుండా, ఫీల్డింగ్‌లోనూ అద్భుతంగా రాణించాడు. తన బౌలింగ్‌లోనే తిలక్ వర్మ ఇచ్చిన కష్టమైన క్యాచ్‌ను 'క్యాచ్ అండ్ బౌల్డ్' రూపంలో పట్టుకొని ముంబైని దెబ్బకొట్టాడు. అంతేకాకుండా మరో రెండు అద్భుతమైన క్యాచ్‌లు పట్టి ముంబై భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు.

77
DC vs MI మ్యాచ్ రికార్డులు..
Image Credit : ANI

DC vs MI మ్యాచ్ రికార్డులు..

  • రోహిత్ శర్మ ఢిల్లీపై 50 సిక్సర్లు పూర్తి చేసుకున్నాడు. ఒకే జట్టుపై అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్ల జాబితాలో ఇప్పుడు మూడో స్థానంలో ఉన్నాడు.
  • సూర్య-రోహిత్ జోడీ ముంబై తరఫున 10వ సారి 50+ పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది.
  • ముంబై ఓడిపోయినా జస్ప్రీత్ బుమ్రా డైరెక్ట్ హిట్‌తో నితీశ్ రాణాను రనౌట్ చేసిన తీరు అభిమానుల మనసు గెలుచుకుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
క్రికెట్
క్రీడలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
భారత జాతీయ క్రికెట్ జట్టు
రోహిత్ శర్మ
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇంటర్నేషనల్ క్రికెట్లో 35,117 బంతులు, 5850 ఓవర్లు.. కెరీర్లో ఒక్క నోబాల్ వేయని స్టార్ బౌలర్, ఎవరో తెలుసా?
Recommended image2
IND vs WI 3rd T20: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.. సిరీస్‌లో టీమిండియా ఆధిక్యం
Recommended image3
India vs West Indies: భారత్ ఓటమికి అసలు కారణాలు ఇవే
Related Stories
Recommended image1
MI : రోహిత్ శర్మ షాకింగ్ డెసిషన్? ఐపీఎల్ 2026 తర్వాత క్రికెట్‌కు గుడ్‌బై?
Recommended image2
MI vs KKR : 220 రన్స్ కొట్టినా కేకేఆర్ ఎందుకు ఓడిపోయింది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved