MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Sports
  • CWG 2026 : కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ దూకుడు..టాప్ 10 దేశాల్లో చోటు, ఎన్ని మెడల్స్ సాధించిందో తెలుసా?

CWG 2026 : కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ దూకుడు..టాప్ 10 దేశాల్లో చోటు, ఎన్ని మెడల్స్ సాధించిందో తెలుసా?

CWG 2026 Medal Table : కామన్వెల్త్ గేమ్స్ లో భారత క్రీడాకారులు ఆకాశమే హద్దుగా చెలరేగి మెడల్స్ సాధిస్తున్నారు. తాజాగా జూడో లో డబుల్ గోల్డ్ సాధించడంతో భారత్ టాప్ 10 లోకి చేరింది.

3 Min read
Author : Arun Kumar P
Published : Aug 01 2026, 09:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఒకేరోజు రెండు స్వర్ణాలు
Image Credit : x/WeAreTeamIndia

ఒకేరోజు రెండు స్వర్ణాలు

స్కాట్లాండ్ లోని గ్లాస్గో నగరంలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026 లో భారత్ సత్తా చాటుతోంది... తాజాగా ఒకే రోజు ఏకంగా రెండు గోల్డ్ మెడల్స్ సాధించింది. జూడోలో మొదటిసారి భారత్ కు స్వర్ణం అందించింది అస్మిత డే.. ఇదే క్రీడల్లో హర్ష్ సింగ్ మరో స్వర్ణ పతకం సాధించాడు. మరో జూడో ప్లేయర్ యామిని మౌర్య రజత పతకం సాధించింది. 23 ఏళ్ల అస్మిత 48 కేజీల విభాగం, హర్ష్ 60 కేజీల విభాగంలో సత్తాచాటి గోల్డ్ మెడల్స్ సాధించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
భారత్ ఖాతాలో మరిన్ని స్వర్ణాలు ఖాయం..
Image Credit : X@airnewsalerts

భారత్ ఖాతాలో మరిన్ని స్వర్ణాలు ఖాయం..

ఇప్పటివరకు జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ మొత్తం 23 పతకాలు సాధించింది. ఇందులో 5 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. అలాగే 12 సిల్వర్, 6 కాంస్య పతకాలు సాధించారు భారత క్రీడాకారులు. దీంతో అత్యధిక పతకాల లిస్ట్ లో భారత్ టాప్ 10 లోకి చేరింది.

అయితే భారత్ ఖాతాలో మరికొన్ని పతకాలు చేరనున్నాయి. బాక్సింగ్ విభాగంలో ఏకంగా 10 మంది భారత బాక్సర్లు ఫైనల్ కి చేరారు. ప్రియ, లవ్లీనా, ప్రీతి పవార్, అరుంధతి చౌదరి, సాక్షి చౌదరి, జైస్మిన్ లాంబొరియా, అంకుశ్ పంఘాల్, సచిన్, జాదుమణి, నరేందర్ లు సత్తాచాటి స్వర్ణ పతకానికి చేరువయ్యాయి... వీరిలో ఏ కొందరు స్వర్ణాలు సాధించినా భారత్ టాప్ 5 లోకి చేరడం ఖాయం.

35
కామన్వెల్త్ లో అత్యధిక పతకాలు సాధించిన దేశాలివే..
Image Credit : chat GPT

కామన్వెల్త్ లో అత్యధిక పతకాలు సాధించిన దేశాలివే..

కామన్వెల్త్ గేమ్స్ 2026 లో ఇప్పటివరకు అత్యధిక పతకాలు సాధించిన దేశంగా ఆస్ట్రేలియా నిలిచింది. ఈ దేశ క్రీడాకారులు ఏకంగా 55 గోల్డ్ మెడల్స్ సాధించారు. అలాగే 30 సిల్వర్, 43 రజత పతకాలతో మొత్తం 128 మెడల్స్ సాధించారు.

CWG 2026 లో ఇంగ్లాండ్ ఇప్పటివరకు 80 మెడల్స్ సాధించి రెండో స్థానంలో నిలిచింది. 17 స్వర్ణం, 34 సిల్వర్, 29 రజత పతకాలు ఇంగ్లాండ్ ఖాతాలో ఉన్నాయి. తర్వాత 53 పతకాలతో (17 గోల్డ్, 34 సిల్వర్, 29 రజత) కెనడా 3వ స్థానంలో నిలిచింది. 23 మెడల్స్ తో భారత్ టాప్ 10 లోకి చేరింది.

45
జావెలిన్‌లో లో రెండు పతకాలు
Image Credit : X

జావెలిన్‌లో లో రెండు పతకాలు

కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత అథ్లెట్లు చరిత్ర సృష్టించారు. తాజాగా పురుషుల జావెలిన్ త్రోలో స్టార్ ప్లేయర్ నీరజ్ చోప్రా రజత పతకం గెలుచుకోగా, అరంగేట్రం చేసిన యశ్‌వీర్ సింగ్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఒకే ఈవెంట్‌లో ఇద్దరు భారత క్రీడాకారులు పోడియంపై నిలవడం ఇదే మొదటిసారి. ఈ చారిత్రక విజయంపై కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ హర్షం వ్యక్తం చేశారు. ఇది భారత అథ్లెటిక్స్‌కు గర్వకారణమని ఆయన కొనియాడారు.

ఈ అద్భుత ప్రదర్శనపై మన్సుఖ్ మాండవీయ 'X'(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. "ఇదో గుర్తుండిపోయే డబుల్ పోడియం ఫినిష్! కామన్వెల్త్ గేమ్స్ జావెలిన్ త్రోలో రజతం గెలిచిన నీరజ్ చోప్రాకు, కాంస్యం సాధించిన యశ్‌వీర్ సింగ్‌కు అభినందనలు. ఒకే ఈవెంట్‌లో ఇద్దరు భారతీయులు పోడియంపై నిలవడం చారిత్రకం. ఇది భారత అథ్లెటిక్స్‌కు నిజంగా గర్వకారణమైన మైలురాయి!" అని ఆయన రాశారు.

ఈ ఈవెంట్‌లో శ్రీలంకకు చెందిన రుమేష్ తరంగ పతిరగే సంచలన ప్రదర్శన చేశాడు. తన రెండో ప్రయత్నంలో జావెలిన్‌ను 89.75 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని ఎగరేసుకుపోయాడు.

55
డెకాథ్లాన్‌లో తేజస్విన్ శంకర్ రికార్డ్
Image Credit : iSTOCK

డెకాథ్లాన్‌లో తేజస్విన్ శంకర్ రికార్డ్

మరోవైపు భారత క్రీడాకారుడు తేజస్విన్ శంకర్ కూడా చరిత్ర సృష్టించాడు. డెకాథ్లాన్ ఈవెంట్‌లో కామన్వెల్త్ గేమ్స్ పతకం గెలిచిన తొలి భారతీయుడిగా నిలిచాడు. కాంస్య పతకం సాధించిన తేజస్విన్‌ను మంత్రి మాండవీయ అభినందించారు. దేశం గర్విస్తోందని అన్నారు.

"పురుషుల డెకాథ్లాన్‌లో చరిత్ర సృష్టించాం! కాంస్యం గెలిచి, డెకాథ్లాన్‌లో భారత్‌కు తొలి CWG పతకాన్ని అందించిన TOPS అథ్లెట్ తేజస్విన్ శంకర్‌కు అభినందనలు. దేశం మొత్తం నిన్ను చూసి గర్విస్తోంది," అని మాండవీయ మరో 'X' పోస్ట్‌లో పేర్కొన్నారు.

తేజస్విన్ శంకర్ ఈ పోటీలో మొత్తం 7,976 పాయింట్లతో అద్భుత ప్రదర్శన చేసి, భారత అథ్లెటిక్స్‌లో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. చివరి ఈవెంట్ అయిన 1500 మీటర్ల పరుగు పందెంలో సత్తా చాటి కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. ఈ రేసును అతను 4 నిమిషాల 36.19 సెకన్లలో పూర్తి చేశాడు.

ఇంగ్లండ్‌కు చెందిన పోటీదారు చివరి నిమిషంలో సవాలు విసిరినా, తేజస్విన్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ప్రత్యర్థి 4:32.29 టైమింగ్‌తో రేసును పూర్తి చేసినా, తేజస్విన్‌ను అధిగమించలేకపోయాడు. దీంతో ఈ భారత అథ్లెట్ చారిత్రక విజయాన్ని అందుకున్నాడు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
క్రీడలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Asia Cup 2026 Final: ఆసియా కప్‌లో భారత్‌ను ఆపడం ఎవరి వల్ల కాదు.. మళ్లీ ఫైనల్‌కు టీమిండియా గ్రాండ్ ఎంట్రీ
Recommended image2
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image3
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Related Stories
Recommended image1
CWG 2026 : అరంగేట్రంలోనే అదరగొట్టిన జ్ఞానేశ్వరి.. భారత్ ఖాతాలో మరో మెడల్
Recommended image2
CWG 2026: కామన్వెల్త్ గేమ్స్‌లో మురళి శ్రీశంకర్ సంచలనం.. లాంగ్ జంప్‌లో సిల్వర్ మెడల్ తో సరికొత్త చరిత్ర
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved