MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Sports
  • Cricket
  • Cricketers Retirement : రహానే ట్రైలర్ మాత్రమే, సినిమా మిగిలే ఉంది.. రిటైర్మెంట్ కు సిద్దమైన టాప్ 5 క్రికెటర్లు వీళ్లే

Cricketers Retirement : రహానే ట్రైలర్ మాత్రమే, సినిమా మిగిలే ఉంది.. రిటైర్మెంట్ కు సిద్దమైన టాప్ 5 క్రికెటర్లు వీళ్లే

టీమిండియా క్రికెటర్ అజింక్య రహానె అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. అతడు రిటైర్మెంట్ ప్రకటించిన వెంటనే మరో ఐదుగురు ఆటగాళ్లు కూడా అదే బాటలో ఉన్నారనే చర్చ మొదలైంది. అంటే రహానేది ట్రైలర్ మాత్రమే… ఇకపై రిటైర్మెంట్ సినిమా ఉంటుందన్నమాట.

2 Min read
Author : Arun Kumar P
| Updated : Jul 31 2026, 04:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
రిటైర్మెంట్ కు సిద్దంగా ఉన్న ఇండియన్ క్రికెటర్లు వీళ్లే..
Image Credit : X/BCCI

రిటైర్మెంట్ కు సిద్దంగా ఉన్న ఇండియన్ క్రికెటర్లు వీళ్లే..

టీమిండియా క్రికెటర్ అజింక్య రహానె సడన్ గా రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పాడు… దీంతో అభిమానులే కాదు క్రికెట్ పండితులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ఈ రిటైర్మెంట్ పరంపర రహానేతో ఆగేలా కనిపించడంలేదు… మరికొందరు ఆటగాళ్లు కూడా రహానే బాటలోనే నడిచే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

గత మూడేళ్లుగా జట్టుకు దూరంగా ఉన్న రహానె చివరికి కఠిన నిర్ణయం తీసుకోక తప్సలేదు. ఇలా రహానేే లాగే సెలక్షన్ కమిటీ పదేపదే పక్కన పెడుతుండటంతో ఎక్కువగా ఆడే అవకాశం రాని ఆటగాళ్లు రిటైర్మెంట్ కు సిద్దమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే మరో ఐదుగురు ఆటగాళ్లు కూడా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని క్రీడావర్గాల్లో టాక్ నడుస్తోంది. మరి ఆ ఆటగాళ్లు ఎవరో చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
1. భువనేశ్వర్ కుమార్
Image Credit : X/Tanuj

1. భువనేశ్వర్ కుమార్

స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ వయసు పెరిగినా బౌలింగ్ లో పదును తగ్గలేదు. గత రెండు ఐపీఎల్ సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఛాంపియన్‌గా నిలవడంలో ఇతడు కీలక పాత్ర పోషించాడు… ఈ మెగా టోర్నీలో టాప్ వికెట్ టేకర్స్ లో ఒకడిగా నిలిచాడు. ఇంతబాగా ఆడుతున్నా బిసిసిఐ గానీ, సెలక్షన్ కమిటీ గానీ చాలా కాలంగా భువీని పట్టించుకోవడం లేదు. అందుకే త్వరలోనే భువనేశ్వర్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పే అవకాశం ఉందని అంటున్నారు.

Related Articles

Related image1
Rahane Retirement : క్యాప్ నంబర్ 278, సైనింగ్ ఆఫ్.. టీమిండియాకు గుడ్ బై చెబుతూ అజింక్యా రహానే ఎమోషనల్
Related image2
Ajinkya Rahane Net Worth: అజింక్య రహానే కు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా? లగ్జరీ కార్లు, బిజినెస్ సీక్రెట్స్ ఇవే
36
2. శార్దూల్ ఠాకూర్
Image Credit : Getty

2. శార్దూల్ ఠాకూర్

శార్దూల్ ఠాకూర్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ప్రస్తుతం గందరగోళంలో ఉంది. ముఖ్యంగా హర్షిత్ రాణా, గుర్నూర్ బ్రార్ వంటి యువ ఆటగాళ్లు జట్టులోకి రావడంతో శార్దూల్ తిరిగి టీమిండియాలోకి రావడం మరింత కష్టంగా మారింది. ప్రస్తుతం కామెంటరీ చేస్తున్న శార్దూల్, త్వరలో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పినా ఆశ్చర్యపోనవసరం లేదు. అతడు కూడా రిటైర్మెంట్ ఆలోచనలోనే ఉన్నాడని తెలుస్తోంది.

46
3. ఇషాంత్ శర్మ
Image Credit : Getty

3. ఇషాంత్ శర్మ

భారత టెస్ట్ జట్టులో అత్యంత విజయవంతమైన ఫాస్ట్ బౌలర్లలో ఇషాంత్ శర్మ ఒకడు. వన్డే, టీ20 ఫార్మాట్స్ లో కూడా అద్భుతాలు చేయగల సత్తా ఇతడికి ఉంది… ఐపిఎల్ లో రాణించినా ఇతడికి అవకాశాలు దక్కడంలేదు. ఇషాంత్ శర్మ అంతర్జాతీయ కెరీర్ చివరి దశలో ఉన్నాడు… చివరగా ఇండియా తరపున ఆడి గౌరవంగా క్రికెట్ కు వీడ్కోలు పలకాలని చూస్తున్నాడు. అయితే ఇది జరిగేలా కనిపించడంలేదు… 37 ఏళ్ల ఇషాంత్ మళ్లీ టీమిండియాలోకి రావడం దాదాపు అసాధ్యంగానే కనిపిస్తోంది. అందుకే ఇతడు త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది.

56
4. కరణ్ నాయర్
Image Credit : X/@ImTanujSingh

4. కరణ్ నాయర్

టెస్ట్ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో భారత బ్యాటర్‌గా రికార్డ్ సృష్టించిన ఆటగాడు కరుణ్ నాయర్. ఏడేళ్ల తర్వాత ఇటీవలే మళ్లీ అతడికి అవకాశం వచ్చింది… టీమిండియాలోకి ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. నాలుగు అవకాశాలు చేజార్చుకోవడంతో కరణ్ నాయర్ మళ్లీ జట్టులోకి రావడం అనుమానమే. అందుకే అతను కూడా రిటైర్మెంట్ అంచున ఉన్నాడు.

66
5. మహ్మద్ షమీ
Image Credit : ANI

5. మహ్మద్ షమీ

ఒకప్పుడు టీమిండియాలో స్టార్ బౌలర్ గా ఓ వెలుగు వెలిగిన షమీ ఇప్పుడు అవకాశం కొసం ఎదురుచూడాల్సి వస్తోంది. జట్టులో చోటు కోల్పోయినా దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు… అయినా బీసీసీఐ సెలక్షన్ కమిటీ మహమ్మద్ షమీని పదేపదే విస్మరిస్తోంది. ఇదే కారణంగా రాబోయే రోజుల్లో షమీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించే అవకాశం ఉంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత జాతీయ క్రికెట్ జట్టు
క్రికెట్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ వరల్డ్ రికార్డు.. శ్రీలంకపై సెంచరీతో ద్రవిడ్ 27 ఏళ్ల ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు
Recommended image2
భారత్ శ్రీలంక టెస్టులో ప్లేయర్స్ మధ్య వాగ్వాదం.. అసలేం జరిగింది? తొలిరోజు ఆధిప‌త్యం ఎవ‌రిదంటే
Recommended image3
AUS vs BAN : రెండు రోజుల్లోనే టెస్ట్ మ్యాచ్ ఖతం.. బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా రివెంజ్ విజయం
Related Stories
Recommended image1
Rahane Retirement : క్యాప్ నంబర్ 278, సైనింగ్ ఆఫ్.. టీమిండియాకు గుడ్ బై చెబుతూ అజింక్యా రహానే ఎమోషనల్
Recommended image2
Ajinkya Rahane Net Worth: అజింక్య రహానే కు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా? లగ్జరీ కార్లు, బిజినెస్ సీక్రెట్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved