MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • IPL 2026: 7 సిక్సర్లతో ప్రత్యర్ధిని ఏడిపించాడు.. కట్ చేస్తే.. ధోనికే అంకితమిచ్చాడు.. ఎవరీ ముకుల్ చౌదరీ

IPL 2026: 7 సిక్సర్లతో ప్రత్యర్ధిని ఏడిపించాడు.. కట్ చేస్తే.. ధోనికే అంకితమిచ్చాడు.. ఎవరీ ముకుల్ చౌదరీ

IPL 2026: ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కేకేఆర్‌పై సంచలన విజయం సాధించింది. 182 పరుగుల లక్ష్య ఛేదనలో ఒక దశలో 128 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున ఉన్న జట్టును ముకుల్ చౌదరి తన అసాధారణ హిట్టింగ్‌తో గెలిపించాడు.

1 Min read
Author : Pavithra D
Published : Apr 10 2026, 12:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
లక్నో కొత్త హీరో ముకుల్ చౌదరి
Image Credit : Pinterest

లక్నో కొత్త హీరో ముకుల్ చౌదరి

ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు మరో ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేసింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై లక్నో చివరి బంతికి గెలుపొందింది. ఈ విజయంలో 21 ఏళ్ల యువ సంచలనం ముకుల్ చౌదరి పోషించిన పాత్ర అద్వితీయం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సంక్లిష్ట స్థితి నుంచి సంచలన విజయం
Image Credit : Getty

సంక్లిష్ట స్థితి నుంచి సంచలన విజయం

182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నోకు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. మార్క్రమ్(22), రిషబ్ పంత్(10), నికోలస్ పూరన్ వంటి దిగ్గజ బ్యాటర్లు త్వరగానే పెవిలియన్ చేరారు. ఒక దశలో లక్నో 128 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమికి చేరువగా ఉంది.

Related Articles

Related image1
IPL లో ఎవరూ సాధించలేని అద్భుత రికార్డు సచిన్ సొంతం !
Related image2
IPL 2026: పిల్ల రాక్షసులకు, పెద్ద రాక్షసులకు మధ్య యుద్ధం.. ఈ విధ్వసకర పోరులో నిలిచేదెవరు.? ఓడేదెవరు.?
35
ముకుల్ విధ్వంసం
Image Credit : X@IPL

ముకుల్ విధ్వంసం

అలాంటి ఒత్తిడి సమయంలో క్రీజులోకి వచ్చిన ముకుల్ చౌదరి, మొదట నిలకడగా ఆడి ఆ తర్వాత ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. ముఖ్యంగా 19, 20 ఓవర్లలో ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 27 బంతుల్లోనే 54 పరుగులు సాధించి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

45
తండ్రి కల, కష్టాల ప్రయాణం
Image Credit : Social Media

తండ్రి కల, కష్టాల ప్రయాణం

మ్యాచ్ అనంతరం ముకుల్ చౌదరి తన భావోద్వేగ ప్రయాణాన్ని పంచుకున్నాడు. తనను ఒక గొప్ప క్రికెటర్‌గా చూడాలనేది తన తండ్రి కల అని, పేదరికంలో ఉన్నప్పటికీ తన తండ్రి తనను ఎంతో ప్రోత్సహించారని తెలిపాడు. తన ఊరిలో అకాడమీలు లేకపోవడంతో జైపూర్‌కు మారి క్రికెట్ శిక్షణ తీసుకున్నట్లు వెల్లడించాడు. యూపీతో జరిగిన అండర్-19 మ్యాచ్‌లో తన ప్రదర్శన చూశాకే, తండ్రికి తనపై నమ్మకం పెరిగిందని గుర్తు చేసుకున్నాడు.

55
ఒత్తిడిని అవకాశంగా మలుచుకుని:
Image Credit : X@IPL

ఒత్తిడిని అవకాశంగా మలుచుకుని:

ఐపీఎల్‌లో ఫ్లడ్ లైట్ల కింద ఆడటం తనకు ఇది రెండో మ్యాచ్ మాత్రమేనని ముకుల్ తెలిపాడు. ఒత్తిడిని భారంలా కాకుండా ఒక 'గోల్డెన్ ఛాన్స్'లా భావించి ఆడానని, బంతి తన జోన్‌లోకి వస్తే సిక్సర్లు బాదడం తనకు ఇష్టమని చెప్పాడు. ఈ విజయంతో లక్నో టోర్నీలో తన రెండో విజయాన్ని అందుకోగా, కేకేఆర్ మాత్రం ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026 : మహిళల T20 వరల్డ్ కప్‌ విన్నింగ్ టీమ్ ప్రైజ్ మనీ ఎంత? ఓడిన టీమ్స్ కి ఎంతిస్తారు?
Recommended image2
T20 World Cup 2026: పాకిస్తాన్‌తో భారత్ తొలి ఫైట్.. ఐసీసీ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ ఇదే
Recommended image3
FIFA World Cup: ఫుట్‌బాల్ అభిమానుల‌కు ఉచిత టీవీల పంపిణీ చేస్తున్న కంపెనీ.. ఎందుకో తెలుసా.?
Related Stories
Recommended image1
IPL లో ఎవరూ సాధించలేని అద్భుత రికార్డు సచిన్ సొంతం !
Recommended image2
IPL 2026: పిల్ల రాక్షసులకు, పెద్ద రాక్షసులకు మధ్య యుద్ధం.. ఈ విధ్వసకర పోరులో నిలిచేదెవరు.? ఓడేదెవరు.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved