విరాట్ కోహ్లి ఇండియాను వదిలి వెళ్లనున్నాడా? అసలు కారణం అదేనా..
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి భారత్‌ను వదిలి వెళ్లనున్నాడా.. అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా ఓ కీలక వ్యక్తి ఈ విషయమై చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. విరాట్ దేశాన్ని ఎందుకు వదిలి వెళ్తున్నాడని ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..
విరాట్ కోహ్లి త్వరలోనే భారత్‌ను వదిలి వెళ్లనున్నాడని తెలుస్తోంది. తన కుటుంబంతో కలిసి కోహ్లి లండన్‌లో సెటిల్ అవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాలను తెలిపింది మరెవరో కాదు కోహ్లి చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ్ కుమార్ ఈ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇదిలా ఉంటే విరాట్ కోహ్లికి సంబంధించిన ఈ వార్త గత కొన్ని రోజులుగా నెట్టింట వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే. అయితే దీనిపై కోహ్లి ఎప్పుడూ అధికారికంగా స్పందించకపోవడంతో వట్టి పుకారని చాలా మంది భావించారు.
అయితే తాజాగా కోహ్లి చిన్ననాటి కోచ్ ఈ విషయాన్ని తెలపడంతో అనుమానాలకు బలం చేకూర్చినట్లైంది. ఇంటర్వ్యూలో మాట్లాడిన రాజ్ కుమార్.. విరాట్ లండన్‌కు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నాడని, అతి త్వరలోనే భారత్‌దేశం వదిలి వెళ్లిపోతాడని చెప్పుకొచ్చారు. దీంతో ఈ న్యూస్ తెలిసిన కోహ్లి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోహ్లి క్రికెట్‌కు గుడ్ బై చెప్పనున్నాడన్న చర్చ తెరపైకి వచ్చింది. ఇదిలా ఉంటే కోహ్లికి లండన్‌తో మంచి సంబంధం ఉందని తెలిసిందే. హాలీడే దొరికితే చాలు కోహ్లి, అనుష్కలు వెంటనే రెక్కలు కట్టుకొని లండన్‌లో వాలిపోతుంటారు. అంతెందుకు అనుష్క రెండో బిడ్డకు లండన్‌లో జన్మనిచ్చిన సంగతి విధితమే. వీటన్నింటినీ చూస్తుంటే విరాట్ తన ఫ్యామిలీతో లండన్‌లో సెటిల్ కానున్నాడన్న వార్తలకు బలం చేకూర్చినట్లవుతోంది.
ఇక కెరీర్ విషయానికొస్తే ఆస్ట్రేలియా పర్యటనలో ఆశించిన స్థాయి ఫామ్‌లో లేడు కోహ్లీ. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో సెంచరీ చేసినప్పటికీ ఆ తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. అయితే మెల్‌బోర్న్, సిడ్నీలలో కోహ్లి కచ్చితంగా రాణిస్తాడని రోహిత్ శర్మ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే ఇప్పటికే అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. కోహ్లీ, రోహిత్ శర్మ త్వరలోనే అశ్విన్ బాటలో నడిచే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వస్తున్నాయి.
అయితే ఇదే విషయమై కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ మాట్లాడుతూ.. 'విరాట్ ఇప్పటికీ ఫిట్‌గానే ఉన్నాడు. ఇప్పట్లో రిటైర్మెంట్ ఉండదు. కోహ్లీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అతను ఇంకా పూర్తి ఫామ్‌తో క్రికెట్ ఆడగలడని నేను నమ్మకంగా చెప్పగలను' అంటూ వ్యాఖ్యానించారు. మరి కోహ్లి లండన్ వ్యవహారంలో ఎంత వరకు నిజం ఉందో తెలియలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు చూడాల్సిందే.