అనుమతి వచ్చేసిందిరోయ్.! బెంగళూరులోనే RCB మ్యాచ్‌లు.. ఇది కదా కావాల్సింది..
RCB: ఆర్సీబీ అభిమానులకు శుభవార్త. చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహణకు ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది. గత భద్రతా సమస్యలు, కమిషన్ నివేదీక ఉన్నప్పటికీ, కేఎస్ సీఏ అన్ని నిబంధనలు పాటిస్తామని ప్రకటించింది.

ఆర్సీబీ అభిమానులకు తీపికబురు
ఆర్సీబీ అభిమానులకు తీపికబురు. చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతాయో లేదోనని నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ప్రభుత్వం స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణకు అనుమతి ఇచ్చింది. అయితే, కొన్ని షరతులు విధించింది.
మార్చిలో ఐపీఎల్ కొత్త సీజన్
వచ్చే మార్చిలో ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభం కానుండగా, తమ సొంత గడ్డపై ఆర్సీబీని ప్రోత్సహించాలని బెంగళూరు అభిమానులు ఆరాటపడుతున్నారు. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్(కేఎస్ సీఏ) చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించేందుకు ప్రభుత్వ అనుమతి లభించిందని ప్రకటించింది.
తొక్కిసలాటలో 11 మంది మరణించగా..
అన్ని నిబంధనలతో పాటు ప్రభుత్వం, అధికారులు సూచించిన షరతులను పాటిస్తామని కేఎస్ సీఏ తెలిపింది. గత ఏడాది జూన్ 4న చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై జస్టిస్ జాన్ మైఖేల్ నేతృత్వంలో జ్యుడీషియల్ కమిషన్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
కొన్ని షరతులతో మ్యాచ్‌లకు అనుమతి..
కమిషన్ చిన్నస్వామి స్టేడియం మ్యాచ్‌ల నిర్వహణకు సురక్షితం కాదని తేల్చింది. అయినప్పటికీ, కొన్ని షరతులతో మ్యాచ్‌లు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ఏడాది మార్చి 26 నుంచి ఐపీఎల్ సీజన్ 2026 ప్రారంభం కానుంది.
ధనాధన్ మ్యాచ్‌లు చూసే భాగ్యం..
చిన్నస్వామి స్టేడియంలో ధనాధన్ మ్యాచ్‌లను చూసే భాగ్యం బెంగళూరు వాసులకు, అభిమానులకు దక్కనుంది. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లను సైతం నిర్వహించేందుకు అనుమతి లభించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

