MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Chikitha Rao : ఆసియా క్రీడల్లో అదరగొట్టిన తెలుగు రైతుబిడ్డ, ఒకేసారి రెండు గోల్డ్ మెడల్స్.. ఎవరీ చికితారావు?

Chikitha Rao : ఆసియా క్రీడల్లో అదరగొట్టిన తెలుగు రైతుబిడ్డ, ఒకేసారి రెండు గోల్డ్ మెడల్స్.. ఎవరీ చికితారావు?

Chikitha Rao Taniparthi : అంతర్జాతీయ క్రీడల్లో తెలుగు ఆడబిడ్డ అద్భుత ప్రదర్శన కనబర్చింది. జపాన్ లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో తెలంగాణకు చెందిన చికితా రావు తానిపర్తి ఒకటి కాదు రెండు స్వర్ణాలు సాధించింది.

3 Min read
Author : Arun Kumar P
Published : Sep 30 2026, 05:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
తెలంగాణ అమ్మాయి ఆర్చరీలో అద్భుతాలు చేస్తోందిగా..
Image Credit : X/Telangana CMO

తెలంగాణ అమ్మాయి ఆర్చరీలో అద్భుతాలు చేస్తోందిగా..

ఆసియా క్రీడల్లో భారత ఆర్చర్లు సత్తాచాటారు. ముఖ్యంగా తెలంగాణకు చెందిన తానిపర్తి చికితారావు ఒకేరోజు రెండు స్వర్ణ పతకాలు సాధించి యావత్ దేశమే గర్వించేలా చేసింది. జపాన్‌లో జరుగుతున్న ఈ ఆసియా క్రీడల్లో మహిళల కాంపౌండ్ టీమ్‌తో పాటు మిక్స్‌డ్ కాంపౌండ్ టీమ్‌లోనూ చికిత బంగారు పతకాన్ని అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జ్యోతి సురేఖ వెన్నం, మహారాష్ట్రకు చెందిన ప్రీతిక ప్రదీప్‌తో కలిసి మహిళల జట్టులో బరిలోకి దిగిన చికిత చైనాను ఓడించి స్వర్ణం సాధించారు. ఆ తర్వాత సాహిల్ జాదవ్‌తో కలిసి మిక్స్‌డ్ టీమ్‌లోనూ విజయం సాధించింది.

చైనాపై అద్భుత విజయం.. ప్రపంచ రికార్డు స్థాయి ప్రదర్శన

మహిళల కాంపౌండ్ టీమ్ ఫైనల్లో భారత్-చైనా తలపడ్డాయి. చికితారావు, జ్యోతి సురేఖ, ప్రీతిక ప్రదీప్‌లతో కూడిన భారత జట్టు 238-234 తేడాతో చైనాను ఓడించింది. ఈ స్కోరు ప్రపంచ రికార్డు స్థాయిలో నిలిచింది. మ్యాచ్ ఆరంభం నుంచి భారత ఆర్చర్లు ఆధిపత్యం కొనసాగిస్తూ చివరి వరకు అదే వేగాన్ని నిలబెట్టుకున్నారు.

ఇక మిక్స్‌డ్ కాంపౌండ్ టీమ్ ఫైనల్లో చికితారావు, సాహిల్ జాదవ్ జోడీ దక్షిణ కొరియా టీీమ్ ను ఎదుర్కొంది. వీరిమధ్య పోరు చివరివరకు ఉత్కంఠగా సాగింది… మొత్తానికి 157-157తో సమం కావడంతో షూట్‌ఆఫ్‌కు వెళ్లింది. అక్కడ చికిత, సాహిల్ ఇద్దరూ 10 పాయింట్లు సాధించడంతో భారత్‌కు మరో స్వర్ణం దక్కింది. ఈ విజయంతో 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ మిక్స్‌డ్ కాంపౌండ్ టీమ్ విభాగానికి భారత్‌కు స్థానం కూడా లభించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఎవరీ తానిపర్తి చికితా రావు?
Image Credit : Instagram/Chikitha Rao Taniparthi

ఎవరీ తానిపర్తి చికితా రావు?

తానిపర్తి చికిత తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాకు చెందిన క్రీడాకారిణి. సుల్తాన్‌పూర్ ప్రాంతానికి చెందిన ఆమె సాధారణ రైతు కుటుంబంలో పుట్టిపెరిగారు. చిన్నప్పటి నుంచే క్రీడలపై ఆసక్తి ఉండటంతో తల్లిదండ్రులు ఆమెను ఆ దిశగానే ప్రోత్సహించారు. 2018లో ఎనిమిదో తరగతి చదువుతున్న సమయంలో ఆర్చరీపై ఆసక్తి పెంచుకుని శిక్షణ ప్రారంభించారు. తండ్రి శ్రీనివాసరావు వ్యవసాయం చేస్తూనే కుమార్తెకు అవసరమైన శిక్షణ అందించేందుకు ఎంతో కష్టపడ్డారు.

ప్రారంభంలో స్థానిక స్థాయి ఆర్చరీ పోటీల్లో పాల్గొన్న చికిత త్వరగానే జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుకున్నారు. స్కూల్ గేమ్స్ పోటీల్లో మంచి ప్రదర్శనతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఖేలో ఇండియా పోటీలు, జాతీయ స్థాయి ఆర్చరీ టోర్నీల్లోనూ పతకాలు సాధిస్తూ అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు.

2025లో ప్రపంచ ఛాంపియన్‌గా సంచలనం

చికితారావు కెరీర్‌లో 2025 సంవత్సరం కీలక మలుపుగా చెప్పుకోవచ్చు. కెనడాలోని విన్నిపెగ్‌లో జరిగిన వరల్డ్ ఆర్చరీ యూత్ ఛాంపియన్‌షిప్‌లో అండర్-21 మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం సాధించారు. ఫైనల్లో దక్షిణ కొరియాకు చెందిన పార్క్ యెరిన్‌ను 142-136తో ఓడించారు. దీంతో అండర్-21 మహిళల కాంపౌండ్ విభాగంలో ప్రపంచ టైటిల్ గెలిచిన తొలి భారత మహిళా ఆర్చర్‌గా చరిత్ర సృష్టించారు.

ఆ విజయం చికిత కెరీర్‌కు మరింత గుర్తింపు తీసుకొచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లోనూ ఆమె చూపించిన స్థిరత్వం, ఏకాగ్రతపై అప్పట్లో ప్రశంసలు వచ్చాయి. ప్రపంచ టైటిల్ తర్వాత ఆసియా క్రీడలపై కూడా అంచనాలు పెరిగాయి.

కుటుంబం చేసిన త్యాగాలు

చికిత విజయాల వెనుక ఆమె కుటుంబం చేసిన కృషి కూడా కీలకంగా నిలిచింది. ఆర్చరీకి అవసరమైన పరికరాలు, శిక్షణ ఖర్చులు సాధారణ రైతు కుటుంబానికి పెద్ద భారమే. అయినప్పటికీ ఆమె తండ్రి కుమార్తె లక్ష్యానికి అండగా నిలిచారు. చికిత కెరీర్‌లో పరికరాల కోసం కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. కుటుంబ వ్యవసాయ అవసరాలకు ఉపయోగించే రైస్ హార్వెస్టర్‌ను విక్రయించడం, అప్పులు చేయడం వంటి త్యాగాలు కూడా ఆమె ప్రయాణంలో భాగమయ్యాయి.

అయితే ఆర్థిక ఇబ్బందులు చికిత పట్టుదలను ఆపలేకపోయాయి. తగిన సదుపాయాలు లేని పరిస్థితుల్లోనూ సాధన కొనసాగిస్తూ తన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకున్నారు. తర్వాత ఆమెకు మెరుగైన శిక్షణ, పరికరాల విషయంలో సంస్థలు, ప్రభుత్వ వర్గాల నుంచి కూడా సహకారం లభించింది.

33
ఇప్పుడు లక్ష్యం ఒలింపిక్స్
Image Credit : X/Telangana CMO

ఇప్పుడు లక్ష్యం ఒలింపిక్స్

ఆసియా క్రీడల్లో రెండు స్వర్ణాలతో తన పేరును అంతర్జాతీయంగా మరోసారి చాటుకున్న చికిత ముందు ఇప్పుడు మరో పెద్ద లక్ష్యం ఉంది. 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో పాల్గొనే అవకాశాన్ని భారత్‌ సాధించింది. చికితారావు, సాహిల్ జాదవ్ జోడీ ఆసియా క్రీడల్లో సాధించిన విజయంతో ఈ ఒలింపిక్ కోటా దక్కింది. కాంపౌండ్ ఆర్చరీ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో తొలిసారి చోటు దక్కించుకోనుండటం ఈ విజయానికి మరింత ప్రాధాన్యం తెచ్చింది.

తెలంగాణకు గర్వకారణంగా చికిత

ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి అంతర్జాతీయ ఆర్చరీ వరకు ఎదిగిన చికితారావు ప్రయాణం ఎంతో ప్రత్యేకమైనది. చిన్న వయసులో ప్రారంభమైన ఆసక్తిని పట్టుదలతో కొనసాగించి, జాతీయ స్థాయి నుంచి ప్రపంచ ఛాంపియన్‌గా, ఇప్పుడు ఆసియా క్రీడల్లో డబుల్ గోల్డ్ విజేతగా ఎదిగారు.

చికిత సాధించిన విజయంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఒకేరోజు రెండు స్వర్ణ పతకాలు సాధించి తెలంగాణ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారని ప్రశంసించారు. ఆమె తల్లిదండ్రులు, కోచ్‌లను కూడా అభినందించారు.

చికితారావు కథలో పతకాల కంటే ముఖ్యమైనది ఆమె ప్రయాణం. పరిమిత వనరులు ఉన్న కుటుంబం నుంచి వచ్చినా లక్ష్యంపై దృష్టి పెట్టి సాధన కొనసాగిస్తే అంతర్జాతీయ స్థాయిలోనూ రాణించవచ్చని ఆమె ప్రయాణం చూపిస్తోంది. ఆసియా క్రీడల్లో రెండు స్వర్ణాలతో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన ఈ తెలంగాణ అమ్మాయి.. 2028 ఒలింపిక్స్‌లోనూ దేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధమవుతోంది.

జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో మిక్స్‌డ్ కాంపౌండ్ ఆర్చరీలో అద్భుత ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకం సాధించడమే కాకుండా 2028లో లాస్ ఏంజెల్స్‌లో జరగబోయే ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి అర్హత సాధించిన తెలంగాణ ముద్దుబిడ్డ చికిత తానిపర్తితో పాటు సాహిల్ జాదవ్‌కు ముఖ్యమంత్రి శ్రీ ఎ.… https://t.co/1x02v6OqzL pic.twitter.com/KOC1JgvXRO

— Telangana CMO (@TelanganaCMO) September 30, 2026

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
క్రీడలు
ఏషియానెట్ న్యూస్
తెలంగాణ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs West Indies: ఇండియా vs వెస్టిండీస్ 2వ వన్డే.. సిరాజ్ రీఎంట్రీ, ప్లేయింగ్ 11లో భారీ మార్పులు
Recommended image2
Asian Games: ఆసియా క్రీడ‌ల్లో మ‌రో సంచ‌ల‌నం.. ఆ విభాగంలో భార‌త్‌కు తొలి స్వ‌ర్ణం
Recommended image3
Most Sixes: అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన టాప్ 10 బ్యాటర్లు ఎవరో తెలుసా?
Related Stories
Recommended image1
Asian Games: ఆసియా క్రీడ‌ల్లో మ‌రో సంచ‌ల‌నం.. ఆ విభాగంలో భార‌త్‌కు తొలి స్వ‌ర్ణం
Recommended image2
Asian Games 2026 : మ్యాచ్ ఆడకుండానే భారత్‌కు గోల్డ్ మెడల్... ఎలా సాధ్యమో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved