MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Asian Games 2026 : మ్యాచ్ ఆడకుండానే భారత్‌కు గోల్డ్ మెడల్... ఎలా సాధ్యమో తెలుసా?

Asian Games 2026 : మ్యాచ్ ఆడకుండానే భారత్‌కు గోల్డ్ మెడల్... ఎలా సాధ్యమో తెలుసా?

ఏషియన్ గేమ్స్ 2026 లో పురుషుల క్రికెట్ నాకౌట్ మ్యాచ్‌లకు వర్షం అడ్డంకిగా మారింది. అయితే ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా టీమిండియా సెమీఫైనల్‌కు చేరుకుంది. శ్రీలంకతో జరగాల్సిన సెమీస్ కూడా వర్షం వల్ల రద్దయితే, భారత్ నేరుగా ఫైనల్‌కు వెళ్తుంది.

2 Min read
Author : Arun Kumar P
| Updated : Sep 29 2026, 05:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇక ఒక్క మ్యాచ్ ఆడకున్నా భారత్ కు గోల్డ్
Image Credit : BCCI

ఇక ఒక్క మ్యాచ్ ఆడకున్నా భారత్ కు గోల్డ్

ఏం జరిగినా మనమంచికే అంటుంటారు.. ఏషియన్ గేమ్స్ 2026 లో ఇదే జరుగుతోంది. పురుషుల క్రికెట్‌ విభాగంలో పలు మ్యాచ్ లకు వర్షం పెద్ద అడ్డంకిగా మారింది… అయినా టీమిండియా సెమీఫైనల్‌కు చేరుకుంది. వర్షం కారణంగా మ్యాచ్ లు రద్దు కావడంతో ఐసిసి ర్యాంకింగ్స్ లో మెరుగైన స్థానంలో ఉన్న టీమిండియా సెమీస్ కు చేరింది.

అయితే సెమీస్ లో టీమిండియా, శ్రీలంక తలపడనున్నాయి… ఈ మ్యాచ్ కూడా వర్షం వల్ల రద్దయితే ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం భారత్ ఫైనల్‌కు వెళ్తుంది. మ్యాచ్ పలితంతో సంబంధం లేకుండానే శ్రీలంక ఇంటికి వెళ్లాల్సిందే. ఒకవేళ ఫైనల్ మ్యాచ్ కూడా రద్దయితే, కొత్త నిబంధనల ప్రకారం రెండు జట్లకు గోల్డ్ మెడల్ ఇస్తారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సెమీఫైనల్‌లో శ్రీలంకతో పోరు...
Image Credit : BCCI

సెమీఫైనల్‌లో శ్రీలంకతో పోరు...

ఏషియన్ గేమ్స్ 2026 నాకౌట్ దశలో వర్షం పెద్ద సమస్యగా మారింది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు వర్షం వల్ల రద్దయ్యే పరిస్థితి ఉండటంతో, ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా జట్లు తదుపరి దశకు అర్హత సాధిస్తున్నాయి. ఇదే నిబంధనతో టీమిండియా సెమీఫైనల్‌కు చేరుకుంది.

అయితే అక్టోబర్ 1న శ్రీలంకతో జరగాల్సిన సెమీఫైనల్‌కు కూడా వర్షం ముప్పు ఉంది. ఈ మ్యాచ్ రద్దయితే నంబర్ 1 ర్యాంక్‌లో ఉన్న భారత్ నేరుగా ఫైనల్‌కు వెళ్తుంది. ఇక్కడ మ్యాచ్ ఫలితం కంటే ర్యాంకింగ్ నిబంధనలే కీలకం కానున్నాయి.

35
ఫైనల్ మ్యాచ్‌కు వర్షం పడితే ఏమవుతుంది?
Image Credit : BCCI

ఫైనల్ మ్యాచ్‌కు వర్షం పడితే ఏమవుతుంది?

ఏషియన్ గేమ్స్ నిబంధనల ప్రకారం… నాకౌట్ మ్యాచ్ వర్షం వల్ల రద్దయితే మెరుగైన ఐసీసీ ర్యాంకింగ్ ఉన్న జట్టు తదుపరి దశకు వెళ్తుంది. పురుషుల టీమిండియా ప్రస్తుతం నంబర్ వన్ స్థానంలో ఉంది. కాబట్టి ఏ దశలోనైనా వర్షం పడి మ్యాచ్ ఫలితం తేలకపోతే అది కచ్చితంగా భారత్‌కే లాభం చేకూరుస్తుంది.

45
టీమిండియాకు డబుల్ బెనిఫిట్!
Image Credit : BCCI

టీమిండియాకు డబుల్ బెనిఫిట్!

క్వార్టర్ ఫైనల్‌లో కూడా ఇదే నిబంధనతో భారత్‌కు లాభం జరిగింది. మ్యాచ్ జరగకపోయినా ర్యాంకింగ్ ఆధారంగా టీమిండియా ముందంజ వేసింది. శ్రీలంకతో మ్యాచ్ రద్దయితే భారత్ నేరుగా ఫైనల్ చేరుతుంది. అయితే ఫైనల్ మ్యాచ్‌కు నిబంధనలు వేరుగా ఉంటాయి.

అక్టోబర్ 3న జరిగే ఫైనల్ రద్దయితే రెండు జట్లకు గోల్డ్ మెడల్ ఇస్తారు. గత ఏషియన్ గేమ్స్‌లో ఫైనల్ రద్దయినప్పుడు ర్యాంకింగ్ ఆధారంగా పసిడి ఇవ్వడంపై విమర్శలు వచ్చాయి. అందుకే ఈసారి కొత్త నిబంధనలు తెచ్చారు.

55
గోల్డ్ మెడల్ కన్ఫర్మ్!
Image Credit : BCCI

గోల్డ్ మెడల్ కన్ఫర్మ్!

ఈ లెక్కన చూసుకుంటే మిగిలిన రెండు మ్యాచ్‌లకు వర్షం అడ్డుపడినా.. ఒక్క బంతి పడకపోయినా టీమిండియాకు గోల్డ్ మెడల్ దక్కుతుంది. ప్రస్తుతం శ్రీలంకతో జరిగే సెమీఫైనల్ మ్యాచ్ భారత్‌కు చాలా ముఖ్యం. ఆ తర్వాత ఫైనల్ మ్యాచ్‌లో వర్షమే ఫలితాన్ని డిసైడ్ చేసే ఛాన్స్ ఉంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
క్రికెట్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Most Centuries: సచిన్ నుంచి కోహ్లీ వరకు.. క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు బాదిన టాప్ 5 బ్యాటర్లు వీరే
Recommended image2
Virat Kohli: రిటైర్మెంట్ పై అభిమానుల గుండె పగిలే వార్త చెప్పిన కోహ్లీ
Recommended image3
Virat Kohli: విరాట్ కోహ్లీ విధ్వంసం.. ఒకే సెంచరీతో 10 సంచలన రికార్డులు బద్దలు
Related Stories
Recommended image1
Asian Games 2026 : ఆసియా క్రీడల్లో అదరగొట్టిన అమ్మాయిలు... భారత్ ఖాతాలో మరో గోల్డ్ మెడల్
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్ లో కబడ్డీలో తిరుగులేని భారత్.. ఫైనల్‌కు దూసుకెళ్లిన పురుషులు, మహిళల జట్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved