MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • గువాహటి టెస్ట్‌లో కొత్త ప్రయోగం.. లంచ్‌కు ముందే టీ బ్రేక్

గువాహటి టెస్ట్‌లో కొత్త ప్రయోగం.. లంచ్‌కు ముందే టీ బ్రేక్

India vs South Africa: గువాహటిలో నవంబర్ 22న భారత్, సౌతాఫ్రికా మధ్య జరగనున్న రెండో టెస్ట్‌లో టైమింగ్స్ మార్పులు చేసింది బీసీసీఐ. టీ బ్రేక్‌ను లంచ్‌కు ముందు పెట్టారు. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Nov 12 2025, 04:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
భారత్, సౌతాఫ్రికా టెస్టు సిరీస్
Image Credit : ANI

భారత్, సౌతాఫ్రికా టెస్టు సిరీస్

భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య రెండు టెస్ట్‌ల సిరీస్‌ నవంబర్‌ 14 నుంచి కోల్‌కతాలో ప్రారంభం కానుంది. అయితే, గువాహటిలో జరిగే రెండో టెస్టు మ్యాచ్ వేళల్లో బీసీసీఐ పెద్ద మార్పులు చేసింది. నవంబర్ 22న ప్రారంభమవబోయే ఈ టెస్ట్‌లో ఆట మధ్యలో సాధారణంగా లంచ్ తర్వాతే వచ్చే టీ బ్రేక్‌ను ముందే ఇవ్వనున్నారు. ఈ సారి టీని లంచ్‌కు ముందు ఏర్పాటు చేశారు. దీనికి వెలుతురు సమస్యనే ప్రధాన కారణమని బీసీసీఐ ప్రకటించింది. బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా ఈ మార్పులను మీడియాతో పంచుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
భారత్ vs సౌతాఫ్రికా టెస్టు సిరీస్: సెషన్‌ల కొత్త షెడ్యూల్
Image Credit : Getty

భారత్ vs సౌతాఫ్రికా టెస్టు సిరీస్: సెషన్‌ల కొత్త షెడ్యూల్

గువాహటి టెస్ట్‌లో టాస్ ఉదయం 8:30 గంటలకు పడుతుంది. మ్యాచ్‌ ఆరంభం ఉదయం 9:00 గంటలుగా నిర్ణయించారు. తొలి సెషన్ 9:00 నుంచి 11:00 వరకు, ఆ తరువాత 20 నిమిషాల టీ విరామం ఉంటుంది (11:00–11:20). రెండో సెషన్ 11:20 నుంచి 1:20 వరకు వుంటుంది. లంచ్ విరామం 1:20 నుంచి 2:00 వరకు ఉంటుంది. తర్వాత మూడవ సెషన్ 2:00 నుంచి 4:00 గంటల వరకు జరుగుతుంది. ఓవర్ల పూర్తిచేయకపోతే అవసరమైతే అదనంగా 30 నిమిషాలు (4:30 వరకు) ఇచ్చే అవకాశం ఉంది.

36
భారత్ vs సౌతాఫ్రికా టెస్టు సిరీస్: ఎందుకు లంచ్ కు ముందే టీ?
Image Credit : X/BCCI

భారత్ vs సౌతాఫ్రికా టెస్టు సిరీస్: ఎందుకు లంచ్ కు ముందే టీ?

దేవజిత్ సైకియా వెల్లడించిన వివరాల ప్రకారం.. గువాహటి ప్రాంతంలో శీతాకాలంలో సూర్యోదయం, సూర్యాస్తమయం చాలా ముందుగా జరుగుతాయి. సాయంత్రం సుమారు 4 గంటల సమీపంలో వెలుతురు తగ్గి ఆట నిర్వహించడం కష్టం అవుతుంది. అందువలన ఆటను పూర్తి స్థాయిలో ఆడటానికి, ఆటగాళ్ల సౌకర్యాన్నీ పరిగణలోకి తీసుకొని మ్యాచ్ ప్రారంభ సమయాన్ని అరగంట ముందుకు తీసుకొని టీ బ్రేక్‌ను లంచ్ ముందు ఏర్పాటు చేయడం అవసరమని ఆయన తెలిపారు. సాధారణంగా ఈ రకమైన మార్పులు డే నైట్ టెస్టుల్లోనే కనిపిస్తాయి, కానీ ఇక్కడ డే మ్యాచ్ లోనే దీన్ని ప్రవేశపెట్టడం ప్రత్యేకతగా ఉంది.

46
గువాహటి వేదికగా రెండో టెస్టు
Image Credit : BCCI\Twitter

గువాహటి వేదికగా రెండో టెస్టు

గువాహటి మొదటిసారి టెస్ట్ వేదికగా నిలుస్తోంది. గతంలో మహిళల వరల్డ్ వన్డేల్లో ఈ నగరం కొన్ని మ్యాచ్‌లను ఆతిథ్యం అందించింది కానీ టెస్ట్ స్థాయిలో ఇదే తొలి సారి. ఈ రెండు టెస్టుల సిరీస్‌ మొదటి మ్యాచ్ కోల్‌కతా ఈడెన్‌ గార్డెన్స్‌లో జరగనుంది. సిరీస్ ప్రారంభానికి ముందు టాస్ కోసం కోల్‌కతా మ్యాచ్‌లో బీసీసీఐ, క్రికెట్ సౌత్ ఆఫ్రికా గుర్తింపులతో ప్రత్యేక బంగారు పూత నాణే ఉపయోగించాలని కూడా నిర్ణయించారు.

56
భారత్ vs సౌతాఫ్రికా వన్డే, టెస్టు సిరీస్ షెడ్యూల్
Image Credit : Getty

భారత్ vs సౌతాఫ్రికా వన్డే, టెస్టు సిరీస్ షెడ్యూల్

ఈ రెండు టెస్టుల తర్వాత నవంబర్ 30న మూడు వన్డేల సిరీస్ ప్రారంభమై డిసెంబర్ 6 వరకు కొనసాగుతుంది. తరువాత డిసెంబర్ 9న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ప్రతిపాదనలో ఉంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ నేపథ్యంలో ఈ సిరీస్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. బోర్డు ప్రకటనలలో చెప్పినట్లు గువాహటి మ్యాచ్ సూర్యోదయం సాయంత్రం వేళల ప్రభావం కారణంగా ప్రత్యేక షెడ్యూల్‌లో నిర్వహించనున్నారు.

66
భారత్ vs సౌతాఫ్రికా టెస్టు సిరీస్: ఇరు జట్ల మధ్య ఉత్కంఠ పోరు
Image Credit : Getty

భారత్ vs సౌతాఫ్రికా టెస్టు సిరీస్: ఇరు జట్ల మధ్య ఉత్కంఠ పోరు

ఇది రెండు జట్ల మధ్య ఓ కీలక సమరమని చెప్పొచ్చు. ఇప్పటివరకు రికార్డులు గమనిస్తే.. 44 టెస్టులలో సౌతాఫ్రికా 18 సార్లు విజయం సాధించింది, భారత్ 16 సార్లు గెలిచి, 10 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. భారత గడ్డపై జరిగిన 19 టెస్టుల్లో భారత్ 11 సార్లు గెలిచింది, సౌతాఫ్రికా 5 సార్లు విజయం అందుకుంది. 3 మ్యాచ్‌లు డ్రాతో ముగిశాయి. ఈ శతాబ్దంలో సౌతాఫ్రికా భారత వేదికలో టెస్ట్ సిరీస్ గెలవలేదు. గతంలో 1999/2000 సీజన్లో హాన్సీ క్రాంజే నేతృత్వంలో సౌతాఫ్రికా 2-0తో విజయం సాధించింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
శుభ్‌మన్ గిల్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
virat kohli: ఆ ఆశ్ర‌మానికి వెళ్లినందుకు కోహ్లికి రూ. 5 కోట్లు ఇచ్చారా.? అస‌లేం జ‌రిగిందంటే
Recommended image2
Team India New Captain: టీమిండియాకు కొత్త కెప్టెన్, వైస్ కెప్టెన్లు.. పూర్తి వివరాలు ఇవే
Recommended image3
స్మృతి మంధాన చేతికి టీమిండియా పగ్గాలు.. హర్మన్‌ప్రీత్ స్థానంలో కొత్త కెప్టెన్
Related Stories
Recommended image1
ఉత్కంఠ రేపుతున్న ఐపీఎల్ 2026 ట్రేడ్ రూల్స్ ఏంటో తెలుసా?
Recommended image2
భారత్ vs దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్‌లో దంచికొట్టిన టాప్ 5 ప్లేయర్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved