MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • SA vs AFG : 3 సార్లు గెలిచి.. చివరికి ఓడిపోయింది.. అఫ్గాన్ ఎక్కడ తప్పు చేసింది?

SA vs AFG : 3 సార్లు గెలిచి.. చివరికి ఓడిపోయింది.. అఫ్గాన్ ఎక్కడ తప్పు చేసింది?

SA vs AFG : నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన క్రికెట్ సమరం కేవలం ఒక మ్యాచ్ మాత్రమే కాదు, అఫ్గానిస్తాన్ జట్టుకు అంతులేని ఆవేదనను మిగిల్చిన ఒక కథ. గెలుపు ముంగిట బోల్తా పడటం అంటే ఏమిటో, సెకన్ల వ్యవధిలో చరిత్ర ఎలా మారుతుందో ఈ మ్యాచ్ నిరూపించింది. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 11 2026, 04:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
SA vs AFG : గెలుపు ముంగిట గుండెకోత.. ఆ ఒక్క పొరపాటే అఫ్గానిస్తాన్ శాపమైందా?
Image Credit : Getty

SA vs AFG : గెలుపు ముంగిట గుండెకోత.. ఆ ఒక్క పొరపాటే అఫ్గానిస్తాన్ శాపమైందా?

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్. స్కోర్‌బోర్డు ప్రకారం మ్యాచ్ టై అయింది, మొదటి సూపర్ ఓవర్ కూడా టై అయింది, చివరకు రెండో సూపర్ ఓవర్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. కానీ ఈ లెక్కల వెనుక అఫ్గానిస్తాన్ జట్టు చేజార్చుకున్న సువర్ణావకాశాలు, ఆఖరి నిమిషంలో జరిగిన తప్పిదాలు ఉన్నాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
గర్బాజ్ వీరవిహారంతో అఫ్గానిస్తాన్ కు అదిరిపోయే ఆరంభం
Image Credit : X/Saabir Zafar

గర్బాజ్ వీరవిహారంతో అఫ్గానిస్తాన్ కు అదిరిపోయే ఆరంభం

187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ జట్టుకు రహమనుల్లా గర్బాజ్ అద్భుతమైన ప్రారంభాన్ని ఇచ్చాడు. కేవలం 42 బంతుల్లో 84 పరుగులు చేసి దక్షిణాఫ్రికా బౌలర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. పవర్‌ప్లే ముగిసేసరికే అఫ్గాన్ 50/0 స్కోరుతో బలమైన స్థితిలో ఉంది. గర్బాజ్ బ్యాటింగ్ చూస్తుంటే ఈ రోజు మనదే అన్న ధీమా అఫ్గాన్ డగౌట్‌లో కనిపించింది. 187 పరుగుల భారీ లక్ష్యం కూడా అసాధ్యం కాదు అనిపించేలా అతను ఇన్నింగ్స్ ఆడాడు.

Related Articles

Related image1
SA vs AFG : క్రికెట్ చరిత్రలోనే బిగ్గెస్ట్ క్లైమాక్స్.. రెండు సూపర్ ఓవర్లు.. గ్రేట్ విక్టరీ !
Related image2
Cricketers Love stories : క్రికెట్ కింగ్స్.. బాలీవుడ్ క్వీన్స్ ! ఈ క్రేజీ జంటల గురించి మీకు తెలుసా?
36
SA vs AFG మ్యాచ్ మలుపు తిరిగింది అక్కడే
Image Credit : Getty

SA vs AFG మ్యాచ్ మలుపు తిరిగింది అక్కడే

ఒకానొక దశలో 51/0 తో ఉన్న అఫ్గానిస్తాన్, ఒక్కసారిగా 52 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ చిన్నపాటి కుప్పకూలడం వల్ల మధ్య ఓవర్లలో రన్ రేట్ బాగా తగ్గిపోయింది. ఒత్తిడి పెరుగుతున్నా బ్యాటర్లు పోరాడారు. చివరకు 175/9 వద్ద 20వ ఓవర్ ప్రారంభమైంది. చేతిలో ఒక్క వికెట్ మాత్రమే ఉన్నా, గెలుపు ఆశలు మాత్రం సజీవంగానే ఉన్నాయి.

46
20వ ఓవర్ డ్రామా: నో బాల్స్.. ఫ్రీ హిట్స్.. అయినా మిస్
Image Credit : Getty

20వ ఓవర్ డ్రామా: నో బాల్స్.. ఫ్రీ హిట్స్.. అయినా మిస్

దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్ కాగిసో రబడ వేసిన ఆఖరి ఓవర్ తీవ్ర ఉత్కంఠను కేపింది. ఆ ఓవర్‌లో రబడ రెండు నో-బాల్స్, ఒక వైడ్ వేయడంతో అఫ్గాన్ విజయానికి 3 బంతుల్లో 2 పరుగులుగా లెక్కలు మారాయి. పైగా ఫ్రీ హిట్ కూడా ఉంది. అఫ్గాన్ గెలుపుకు ఇంతకంటే మంచి అవకాశం రాదు. కానీ, 19.4వ బంతి వద్ద అనూహ్యమైన రన్ అవుట్ జరిగింది. ఫరూకీ సింగిల్ తీసి మ్యాచ్ టై చేయాల్సింది పోయి, రన్ అవుట్ అయ్యాడు. కనీసం డైవ్ కూడా చేయకపోవడం అఫ్గాన్ చేసిన అతిపెద్ద తప్పు. ఫలితంగా మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లింది.

56
సూపర్ ఓవర్ల ఉత్కంఠ.. గెలుపు అంచుల వరకు వెళ్లి..
Image Credit : our own

సూపర్ ఓవర్ల ఉత్కంఠ.. గెలుపు అంచుల వరకు వెళ్లి..

మొదటి సూపర్ ఓవర్‌లో అజ్మతుల్లా 17 పరుగులు రాబట్టాడు. దక్షిణాఫ్రికాకు 18 పరుగుల లక్ష్యం ఎదురైంది. ఆఖరి బంతికి 7 పరుగులు కావాల్సిన దశలో ట్రిస్టన్ స్టబ్స్ సిక్స్ కొట్టడంతో స్కోర్లు మళ్లీ సమమయ్యాయి. ఫజల్ హక్ ఆఖరి బంతిని సరిగ్గా వేసి ఉంటే అఫ్గాన్ అక్కడే గెలిచేది. ఇక రెండో సూపర్ ఓవర్‌లో సౌతాఫ్రికా 23 పరుగులు చేసింది. గర్బాజ్ వరుసగా 3 సిక్సర్లు బాది ఆశలు రేకెత్తించినా, ఆఖరి బంతికి 6 పరుగులు చేయలేకపోయాడు. కేశవ్ మహారాజ్ వేసిన వైడ్ లైన్ బంతిని గర్బాజ్ క్యాచ్ ఇవ్వడంతో అఫ్గాన్ ప్రస్థానం ముగిసింది.

66
అఫ్గాన్ ఎక్కడ తప్పు చేసింది?
Image Credit : Instagram/afghanistancricketboard

అఫ్గాన్ ఎక్కడ తప్పు చేసింది?

అఫ్గానిస్తాన్ ఓటమికి ప్రధాన కారణం ఒత్తిడిని నియంత్రించలేకపోవడమే. 3 బంతుల్లో 2 పరుగులు కావాల్సినప్పుడు కూల్‌గా సింగిల్ తీయాల్సింది పోయి రన్ అవుట్ అవ్వడం వారి అనుభవలేమిని సూచిస్తోంది. అలాగే డెత్ ఓవర్లలో క్రమశిక్షణ లేకపోవడం, 175/9 నుంచి 187 స్కోరును డిఫెండ్ చేయడంలో విఫలం కావడం దెబ్బతీశాయి. కెప్టెన్ రషీద్ ఖాన్ అన్నట్లు, ఒక్క డైవ్, ఒక్క బంతి చరిత్రను మార్చేసేది. ఈ ఓటమి ఒక హార్ట్‌బ్రేక్ అయినప్పటికీ, అఫ్గానిస్తాన్ ఇక ఎంతమాత్రం చిన్న టీమ్ కాదని, టాప్ జట్లకు సింహస్వప్నమని ప్రపంచానికి చాటి చెప్పింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్

Latest Videos
Recommended Stories
Recommended image1
PBKS vs DC : 210 రన్స్ కొట్టినా పంజాబ్ కింగ్స్ ఎందుకు ఓడిపోయింది? 5 కారణాలు ఇవే!
Recommended image2
IPL 2026 : స్వింగ్ కింగ్ ఈజ్ బ్యాక్.. ఐపీఎల్‌లో భువనేశ్వర్ వరల్డ్ రికార్డ్.. టీమిండియాలోకి రీఎంట్రీ ఫిక్స్?
Recommended image3
Team India: సూర్యకు షాక్.. అయ్యర్ కాదు.. టీమిండియా టీ20 కెప్టెన్‌గా సంజూ? సెలక్టర్ల ప్లాన్ ఇదే!
Related Stories
Recommended image1
SA vs AFG : క్రికెట్ చరిత్రలోనే బిగ్గెస్ట్ క్లైమాక్స్.. రెండు సూపర్ ఓవర్లు.. గ్రేట్ విక్టరీ !
Recommended image2
Cricketers Love stories : క్రికెట్ కింగ్స్.. బాలీవుడ్ క్వీన్స్ ! ఈ క్రేజీ జంటల గురించి మీకు తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved