MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Sports
  • Abhishek Sharma : టీమిండియాకు బిగ్ షాక్.. నమీబియాతో మ్యాచ్‌కు స్టార్ ఓపెనర్ దూరం?

Abhishek Sharma : టీమిండియాకు బిగ్ షాక్.. నమీబియాతో మ్యాచ్‌కు స్టార్ ఓపెనర్ దూరం?

Abhishek Sharma : టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నమీబియాతో జరగనున్న మ్యాచ్‌కు స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ దూరమయ్యే అవకాశం ఉంది. అతని స్థానంలో సంజూ శాంసన్ బరిలోకి దిగే ఛాన్స్ కనిపిస్తోంది. అభిషేక్ శర్మకు ఏమైంది?

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 10 2026, 10:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రపంచ నంబర్ 1 బ్యాటర్‌కు ఏమైంది? ఢిల్లీ నెట్స్ ప్రాక్టీస్‌లో కనిపించని అభిషేక్ శర్మ
Image Credit : Getty

ప్రపంచ నంబర్ 1 బ్యాటర్‌కు ఏమైంది? ఢిల్లీ నెట్స్ ప్రాక్టీస్‌లో కనిపించని అభిషేక్ శర్మ

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ తన రెండో మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 12, గురువారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నమీబియాతో టీమిండియా తలపడనుంది. 

అయితే, ఈ కీలక మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు పెద్ద షాక్ తగిలింది. టీ20 ఫార్మాట్‌లో ప్రపంచ నంబర్ 1 బ్యాటర్, విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనారోగ్యం కారణంగా అతను మంగళవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు కూడా హాజరు కాలేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అభిషేక్ శర్మ ఆరోగ్యంపై లేటెస్ట్ అప్‌డేట్
Image Credit : Getty

అభిషేక్ శర్మ ఆరోగ్యంపై లేటెస్ట్ అప్‌డేట్

అభిషేక్ శర్మ ప్రస్తుతం తీవ్రమైన జ్వరం, కడుపు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్‌లోనే అతను అనారోగ్యంతోనే బరిలోకి దిగాడు. ఆ మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్ అయిన అభిషేక్, రెండో ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్‌కు కూడా రాలేదు. 

అతని స్థానంలో సంజూ శాంసన్ ఫీల్డింగ్ బాధ్యతలు చేపట్టాడు. తాజాగా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోషేట్ మాట్లాడుతూ.. అభిషేక్ ఇంకా కోలుకోలేదని, నమీబియాతో మ్యాచ్ సమయానికి అతను అందుబాటులో ఉంటాడని ఆశిస్తున్నట్లు తెలిపారు.

35
ఢిల్లీలో ప్రాక్టీస్ సెషన్‌కు అభిషేక్ శర్మ దూరం
Image Credit : AFP

ఢిల్లీలో ప్రాక్టీస్ సెషన్‌కు అభిషేక్ శర్మ దూరం

మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత జట్టు ప్రాక్టీస్ సెషన్ నిర్వహించింది. జట్టు సభ్యులందరూ ప్రాక్టీస్‌లో పాల్గొన్నప్పటికీ, అభిషేక్ శర్మ మాత్రం కనిపించలేదు. ముంబై నుంచి జట్టుతో కలిసి అతను ఢిల్లీకి ప్రయాణించలేదని కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి. 

ఫిబ్రవరి 15న పాకిస్థాన్‌తో జరగనున్న హై-వోల్టేజ్ మ్యాచ్‌ను దృష్టిలో ఉంచుకుని, టీమ్ మేనేజ్‌మెంట్ అతనికి విశ్రాంతినిచ్చి, పూర్తి ఫిట్‌నెస్ సాధించేలా చూడాలని భావిస్తోంది.

45
రిప్లేస్‌మెంట్‌గా సంజూ శాంసన్?
Image Credit : Getty

రిప్లేస్‌మెంట్‌గా సంజూ శాంసన్?

అభిషేక్ శర్మ అందుబాటులో లేకపోతే, అతని స్థానంలో సంజూ శాంసన్ ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశం ఉంది. మంగళవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ జోడీగా నెట్స్‌లో తీవ్రంగా శ్రమించారు. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అర్షదీప్ సింగ్ వంటి బౌలర్లను ఎదుర్కొంటూ శాంసన్ చాలా సమయం ప్రాక్టీస్ చేశాడు. శాంసన్‌తో పాటు ఇషాన్ కిషన్ కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉండటం జట్టుకు సానుకూల అంశం.

55
బుమ్రా రాక.. వాషింగ్టన్ సుందర్ ఫిట్‌నెస్
Image Credit : Getty

బుమ్రా రాక.. వాషింగ్టన్ సుందర్ ఫిట్‌నెస్

భారత జట్టుకు మరోవైపు ఊరటనిచ్చే వార్త కూడా అందింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. నెట్స్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు అతను వేగవంతమైన బంతులతో ఇబ్బంది పెట్టాడు. 

అమెరికాతో మ్యాచ్‌కు దూరమైన బుమ్రా, నమీబియాతో మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నాడు. అలాగే, గాయం నుంచి కోలుకున్న ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా జట్టుతో చేరాడు. అతను కూడా ప్రాక్టీస్‌లో పాల్గొని తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకునే ప్రయత్నం చేశాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Asia Cup 2026 Final: ఆసియా కప్‌లో భారత్‌ను ఆపడం ఎవరి వల్ల కాదు.. మళ్లీ ఫైనల్‌కు టీమిండియా గ్రాండ్ ఎంట్రీ
Recommended image2
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image3
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Related Stories
Recommended image1
IND vs NAM : టీమిండియాలో 3 భారీ మార్పులు.. స్టార్ బౌలర్ అవుట్ !
Recommended image2
T20 World Cup : బ్యాట్ పడితే కోట్లు.. ఫోజు కొడితే లక్షలు! టీ20 వరల్డ్ కప్ రిచెస్ట్ ప్లేయర్స్ వీళ్లే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved