- Home
- Sports
- Vaibhav Suryavanshi : బుమ్రా బౌలింగ్ లో ఒక్క సిక్స్ కూడా కొట్టలేని హిట్టర్లు.. వైభవ్ వీళ్లందరికంటే తోపు..!
Vaibhav Suryavanshi : బుమ్రా బౌలింగ్ లో ఒక్క సిక్స్ కూడా కొట్టలేని హిట్టర్లు.. వైభవ్ వీళ్లందరికంటే తోపు..!
సంజూ శాంసన్, శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ లాంటి స్టార్ ప్లేయర్లే టీ20ల్లో బుమ్రా బౌలింగ్‌లో సిక్సర్ కొట్టలేకపోయారు. కానీ 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

వైభవ్ ధైర్యం...
Indian Premier League 2026 : ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఒక 15 ఏళ్ల కుర్రాడి అసామాన్య ధైర్యానికి గుర్తుగా నిలిచిపోతుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ పేసర్ గా వెలుగొందుతున్న టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను ఎదుర్కొన్న తొలి ఓవర్లోనే వైభవ్ సూర్యవంశీ రెండు భారీ సిక్సర్లు బాది అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు.
పవర్ హిట్టర్లకు సాధ్యం కానిది..
బుమ్రాను షాక్‌కు గురిచేసిన ఆరంభం
దిగ్గజాలకూ అసాధ్యమైన ఘనత..
వైభవ్ ప్రదర్శన ఎందుకు ఇంత ప్రత్యేకమో తెలియాలంటే అంతర్జాతీయ స్టార్ల రికార్డులు చూడాలి. టీ20 క్రికెట్‌లో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, ట్రావిస్ హెడ్ లాంటి విధ్వంసకర బ్యాటర్లు ఇప్పటివరకు ఒక్క సిక్సర్ కూడా కొట్టలేదు.
గిల్ vs బుమ్రా
అభిషేక్ vs బుమ్రా
ట్రావిస్ హెడ్ vs బుమ్రా
పూరన్ vs బుమ్రా
సంజూ vs బుమ్రా
బుమ్రాకే చుక్కలు..
కేవలం 15 ఏళ్ల వయసులో ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌ను ఇంత ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్న వైభవ్ సూర్యవంశీ.. భారత క్రికెట్‌లో తర్వాతి సంచలనం అవుతాడని క్రీడా విశ్లేషకులు అప్పుడే అంచనా వేస్తున్నారు. బుమ్రా బౌలింగ్ లోనే ఇలా ఆడాటంటే అతడు ఎవరి బౌలింగ్ లో అయినా అలవోకగా బౌండరీలు బాదగలడని అర్థమవుతోంది.

