వాస్తు ప్రకారం.. వంటింట్లో ఈ రెండు గిన్నెలను ఎప్పుడూ కూడా బోర్లించకూడదు..
వాస్తు ప్రకారమే ఇంట్లో ప్రతి వస్తువూ ఉండాలని చెబుతుంటారు. వాస్తును ఫాలో అయితే ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉండవంటారు జ్యోతిష్యులు. ముఖ్యంగా వంటగది విషయంలో కూడా వాస్తు శాస్త్ర నియమాలను పాటించాలంటున్నారు జ్యోతిష్యలు.
వాస్తును ఖచ్చితంగా ఫాలో అవుతుంటారు కొందరు. ఎందుకంటే ఇంట్లో వాస్తు ప్రకారమే ప్రతీది ఉంటే ఎలాంటి సమస్యలు రావని నమ్ముతారు. అయితే వంటగదిలో పాత్రల విషయానికి కూడా ఇది వస్తుందట. అవును మన వంటింట్లో కొన్ని పాత్రలను ఎలా పెట్టాలి? ఎలా పెట్టకూడదో నియమాలు ఉన్నాయి. ఈ వాస్తు నియమాలను పాటిస్తే మీ ఇంట్లో ధాన్యాలకు ఎలాంటి లోటు ఉండదట. ముఖ్యంగా వాస్తు ప్రకారం.. వంటింట్లో కొన్ని పాత్రలను బోర్లించకూడదు. దీనివల్ల మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి వేటిని బోర్లించకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
రోటీ పాన్
పాన్ ను రొట్టెలను కాల్చడానికి ఉపయోగిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. రొట్టెల పాన్ ను ఎప్పుడూ కూడా తలకిందులుగా పెట్టకూడదు. అవును ఇలా చేస్తే మీ ఇంట్లో వాస్తు లోపాలు ఏర్పడుతాయి. దీంతో మీరు ఇంట్లో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
Do you know how to finish a week's work in the kitchen in one day
కడాయి
కడాయిని ఉపయోగించి కూరలను, ఫ్రైలను చేస్తుంటారు. అయితే ఈ కడాయిని కూడా ఎప్పుడూ బోర్లించకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఒకవేళ కడాయిని బోర్లిస్తే మీ ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.
క్లీన్ చేయాలి
కడయాని ఉపయోగించినా.. పాన్ ను ఉపయోగించినా.. మీరు వాటిని వెంటనే క్లీన్ చేయాలి. వీటిని ఉపయోగించి అలాగే పెడితే మీ ఇంట్లో ఎన్నో సమస్యలు వస్తాయి. అందుకే వాస్తు శాస్త్రం వీటిని ఉపయోగించిన వెంటనే శుభ్రం చేయాలని చెబుతోంది.
ఈ దిశలో ఉంచాలి
వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో కొన్ని వస్తువులను ఎప్పుడూ కూడా వంటగదికి పడమర దిశలోనే పెట్టాలి. వీటిలో రాగి, ఇత్తడి, ఉక్కు ఉన్నాయి. ఈ వస్తు నియమాలను పాటిస్తే మీరు ఎన్నో సమస్యల నుంచి బయటపడతారు. ఇంట్లో సమస్యలొచ్చే ప్రమాదం కూడా తక్కువగా ఉంటుంది.