MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Spiritual
  • Monday Facts: సోమవారానికి ఆ పేరు ఎలా వచ్చింది? ఆరోజు శివుడినే ఎందుకు పూజించాలి?

Monday Facts: సోమవారానికి ఆ పేరు ఎలా వచ్చింది? ఆరోజు శివుడినే ఎందుకు పూజించాలి?

Monday Facts: వారానికి ఉన్న 7 రోజుల్లో సోమవారానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున పరమశివుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తారు. ఉపవాసాలు ఉంటారు. అసలు సోమవారానికి ఆ పేరు ఎలా వచ్చింది? ఇదే రోజున మహాదేవుడిని ఎందుకు పూజిస్తారో తెలుసా?

2 Min read
Author : Nandini Arava
Published : Jul 14 2026, 04:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
సోమవారం గురించి ఆసక్తికర విషయాలు
Image Credit : Asianet News

సోమవారం గురించి ఆసక్తికర విషయాలు

సోమవారం వచ్చిందంటే చాలు….శివాలయాలకు జనం పోటెత్తుతారు. ఎంత పనిలో ఉన్నా సరే…ఉదయాన్నే లేచి తలంటుకుని కోవెళ్లకు వెళ్తారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తారు. ఉపవాసాలు ఉంటారు.వారానికి ఉన్న 7 రోజుల్లో ఈ సోమవారానికి చాలా ప్రాముఖ్యత ఉంది.  అసలు సోమవారానికి ఆ పేరు ఎలా వచ్చింది? ఇదే రోజున మహాదేవుడిని ఎందుకు పూజిస్తారో తెలుసా?

వారంలో మొదటి రోజు సోమవారం. ఈ రోజు శివుడికి, చంద్రుడికి పూజలు చేయడం చాలా ప్రత్యేకం. సోమవారానికి సంబంధించి మన పురాణాల్లో చాలా నియమాలు, సంప్రదాయాలు ఉన్నాయి. వీటిని పాటిస్తే జీవితంలో సుఖసంతోషాలు ఉంటాయని నమ్ముతారు. అసలు వారంలో మొదటి రోజుకు సోమవారం అనే పేరే ఎందుకు వచ్చింది? దీనికి జ్యోతిష్య శాస్త్రంలో సమాధానం ఉంది. ఆ ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
గంటలను జ్యోతిషంలో 'హోర' అంటారు
Image Credit : Getty

గంటలను జ్యోతిషంలో 'హోర' అంటారు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఒక రోజుకు 24 గంటలు ఉంటాయి. ఈ గంటలను జ్యోతిషంలో 'హోర' అంటారు. ప్రతి హోరకు ఒక గ్రహంతో సంబంధం ఉంటుంది. హోర నియమం ప్రకారం, రోజులోని మొదటి గంటకు (సూర్యోదయం సమయంలో) ఏ గ్రహం అధిపతిగా ఉంటుందో, ఆ రోజంతటికీ అదే అధిపతి అవుతుంది. ఆదివారం తర్వాత వచ్చే రోజున (సూర్యోదయం) 25వ గంట చంద్రుడి హోరలోకి వస్తుంది. చంద్రుడికి 'సోముడు' అనే మరో పేరు కూడా ఉంది. అందుకే వారంలో మొదటి రోజుకు సోమవారం అని పేరు వచ్చింది.

36
శివుడిని ఎందుకు పూజిస్తారు?
Image Credit : Getty

శివుడిని ఎందుకు పూజిస్తారు?

సోమవారం శివ పూజకు చాలా ప్రాముఖ్యత ఉంది. దీనికి కారణం ఏంటంటే, ఈ రోజు చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ చంద్రుడు మహాదేవుడి తలపై అలంకారంగా ఉన్నాడు. అందుకే సోమవారం శివుడిని పూజిస్తే, చంద్రుడిని కూడా పూజించినట్లే అవుతుంది. మన పురాణాలు సోమవారం శివ పూజకు ఇంత ప్రాధాన్యత ఇవ్వడానికి ఇదే కారణం.

46
శివుడిని ఎలా పూజించాలి?
Image Credit : Getty

శివుడిని ఎలా పూజించాలి?

- సోమవారం ఉదయాన్నే లేచి స్నానం చేసి, వ్రతం, పూజ చేస్తానని సంకల్పం చెప్పుకోవాలి.
- రోజంతా సాత్విక జీవితం గడపాలి. అంటే, ఎవరిపైనా కోపం తెచ్చుకోకూడదు, చెడుగా ఆలోచించకూడదు.
- దగ్గర్లోని శివాలయానికి వెళ్లొచ్చు లేదా ఇంట్లోని పూజ గదిలోనైనా శివుడికి పూజ చేయవచ్చు.
- శివలింగానికి మొదట శుద్ధమైన నీటితో, తర్వాత పాలతో, మళ్లీ నీటితో అభిషేకం చేయాలి.
- శివుడికి బిల్వపత్రాలు, తెల్ల చందనం, మారేడు, జిల్లేడు పూలు, పండ్లు సమర్పించాలి.
- ఆ తర్వాత నైవేద్యం పెట్టి, హారతి ఇవ్వాలి. ఇలా చేస్తే మీ కోరికలు తప్పక నెరవేరుతాయి.

56
ఈ మంత్రం పటించాలి
Image Credit : Getty

ఈ మంత్రం పటించాలి

సోమవారం శివుడికి ఇష్టమైన రోజు కాబట్టి, ఈ రోజు మహాదేవుడి మంత్రాలను జపించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. కింద ఇచ్చిన మంత్రాలలో దేన్నైనా జపించవచ్చు-
- ఓం నమః శివాయ
- ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్।
ఉర్వారుకమివ బంధనాన్మృత్యోర్ముక్షీయ మామృతాత్॥
- ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్॥

66
సోమవారం రోజు ఇవి దానం చేయాలి
Image Credit : Getty

సోమవారం రోజు ఇవి దానం చేయాలి

జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి రోజు కొన్ని ప్రత్యేక వస్తువులను దానం చేయడం వల్ల మంచి జరుగుతుందని చెబుతారు. ఈ వస్తువులను దానం చేస్తే జీవితంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. సోమవారం రోజున తెల్లని వస్త్రాలు, బియ్యం, పాలు, పటికబెల్లం, పెరుగు, తెల్లని పువ్వులు, వెండి వంటి వాటిని దానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ వస్తువులన్నీ చంద్రుడికి సంబంధించినవి.


గమనిక: ఈ ఆర్టికల్‌లోని సమాచారం మత గ్రంథాలు, పండితులు, జ్యోతిష్యుల నుంచి సేకరించబడింది. మేము ఈ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ఒక మాధ్యమం మాత్రమే. పాఠకులు ఈ సమాచారాన్ని కేవలం సూచనగా మాత్రమే పరిగణించాలి.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఆధ్యాత్మిక విషయాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Life Lessons : దశావతారాల నుంచి Gen-Z నేర్చుకోవాల్సిన 10 జీవిత పాఠాలు
Recommended image2
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image3
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Related Stories
Recommended image1
Railways: ఛీ.. ట్రైన్‍లో ఇదేం పాడు పని...దుప్పట్లు కూడా సరిపోవట్లేదుగా
Recommended image2
Western Toilet: వెస్ట్రన్ టాయిలెట్ వాడుతున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved