Dream: కలలో శివలింగం కనిపిస్తే.. అర్థమేంటి?
కొంతమందికి కలలో శివుడు వివిధ రూపాల్లో కనిపిస్తుంటాడు. ఇలా కనిపించడం దేనికి సంకేతం అనేది ఈ కథనంలో…

కలలో శివుడు
మనం నిత్యం ఎన్నో రకాలు కలలు కంటూ ఉంటాం.వాటిలో కొన్ని మనకు గుర్తుంటాయి...కొన్ని గుర్తుండవు.కలలలో కూడా కొన్ని దైవానికి సంబంధించినవి ఉంటే ..కొన్ని దెయ్యాలకు సంబంధించినవి ఉంటాయి.ఇలా కలలలో రకాల రకాల ప్రదేశాలు,వస్తువులు, మనుషులు కనపడుతుంటారు. అలా కనిపించే వాటిలో చాలామంది తమకు పరమశివుని రూపం కనిపించిందని చెబుతుంటారు. అలా కలలో శివుడు కనిపించడమంటే సామాన్య విషయం కాదు. ఇది ఆధ్యాత్మికంగా ఎంతో లోతైన అర్థాన్ని కలిగి ఉంటుంది.
సృష్టి కర్త..లయకారుడు...
హిందూ సంప్రదాయంలో శివుడు అంటే సృష్టి కర్త..లయకారుడు. సర్వ సృష్టికి మూలకారకుడు..అలాంటి మూల్లోకాలను ఏలే పరమాత్ముడు కలలో కనిపించడం అంటే జీవితంలో ఓ కొత్త దశ మొదలు కాబోతుందని అర్థం.ఇది కేవలం ఓ కల కాదని, మన ఆధ్యాత్మిక పథంలో ముందడుగు వేసే సూచనగా భావించవచ్చు.
శివుడు కలలో ఏ రూపంలో ఎలా కనిపడితే ఎలా అర్థం చేసుకోవచ్చో ఇక్కడ తెలుసుకుందాం...
నటరాజ రూపంలో శివుడు కలలో కనిపిస్తే...
అది మనకు జీవితంలో మార్పు మొదలైందన్న సంకేతాన్ని తెలియజేస్తుంది. ఏదో ఒక దశ ముగిసి, కొత్తది మొదలవబోతున్న సూచన. మనం గతాన్ని వదిలిపెట్టి ముందుకు సాగాలన్న దైవిక ఆహ్వానం పలికినట్లు అర్థం చేసుకోవచ్చు.
ధ్యానం చేస్తున్న శివుడు కనిపిస్తే..
అది మన ఆత్మవిశ్లేషణ అవసరాన్ని తెలియజేస్తుంది. మన లోతైన ఆత్మ శాంతిని కోరుకుంటోందన్న సంకేతం అది. అలాంటి కల మనకు ప్రశాంతంగా ఉండాలని, ఆలోచనలతో ముందుకు పోవాలని తెలియజేస్తుంది.
శివపార్వతులు కలలో కనపడితే..
శివపార్వతులు కలలో కనపడితే అది సంబంధాల్లో సామరస్యం, ఐక్యతకు సంకేతం. మానవ సంబంధాలు సంతులనంగా ఉండాలన్న సందేశం ఈ కల ఇస్తుంది. కొన్ని సందర్భాల్లో కలలో అర్ధనారీశ్వర రూపంగా శివుడి దర్శనం వస్తే, అది మన లోపల ఉన్న రెండు శక్తుల సమతుల్యతను ప్రతిబింబిస్తుంది. మనలో స్త్రీపురుష లక్షణాలు సమపాళ్లలో ఉండాలని మనం ఆధ్యాత్మికంగా ఎదగాలన్న సూచన ఇస్తుంది.
చిహ్నాలే ఎక్కువగా
కలలో శివుని ఆకారాన్ని కంటే చిహ్నాలే ఎక్కువగా కనిపించే అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకు, శివుడి మూడవ కన్ను లేదా ఆయన తలపై చంద్రుడి అర్ధచంద్రం కనిపిస్తే, అది మన అంతర్ముఖతను సూచిస్తుంది. మనలో దాగి ఉన్న జ్ఞానాన్ని వెలికితీయడానికే అలాంటి సంకేతాలు కలల రూపంలో వస్తుంటాయి. అలాగే, శివలింగం కలలో కనిపిస్తే అది ఆత్మశుద్ధి, జీవనశుద్ధిని సూచిస్తుంది. ఇలాంటి కలలు మనకు ఎదురవుతున్న సమస్యల నుంచి విముక్తి దిశగా మార్గదర్శనం చేస్తాయి.
ఆధ్యాత్మిక చైతన్యం
ఇది కేవలం ఊహా కాదని, చాలామంది ఆధ్యాత్మికులు, కలల విశ్లేషకులు కూడా అంటారు. ముఖ్యంగా కలల్లో వచ్చే ఈ దైవిక రూపాలు మనకు ఏదో ఒక మార్గాన్ని సూచిస్తాయని, మన ఆత్మ ఎదుగుదల కోసం సూత్రాలుగా ఉంటాయని చెబుతారు. శివుడిని కలలో చూడడాన్ని చాలామంది దైవిక అనుగ్రహంగా భావిస్తారు. మనకు ఏదో కొత్త ఆధ్యాత్మిక చైతన్యం మొదలవబోతోందన్న సూచన ఇది.