Shani, rahuvu conjunction శని-రాహువుల కలయిక.. ఈ నక్షత్రాల వారికి అత్యంత గడ్డుకాలం!
అత్యంత కష్టకాలం: నిర్ణీత వ్యవధి ప్రకారం గ్రహ సంచారాలు, మార్పులు, ఇతర గ్రహాలతో కలయికలు ఉంటాయి. వీటి ప్రభావం కారణంగా రాశిచక్రాలు మారిపోతుంటాయి. ఇవి ఇతర రాశులపై ప్రభావాలు చూపిస్తుంటాయి. ప్రస్తుతం శని, రాహువులు కలిసి మీన రాశిలో సంచరిస్తున్నాయి. ఇది మీన రాశిపైనే కాకుండా అన్నిరాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా కొన్ని నక్షత్రాల వారికి ఈ ప్రభావం చాలా ప్రతికూలంగా మారే అవకాశం ఉందని జ్యోతిష పండితులు చెబుతున్నారు. గ్రహాలలో అత్యంత ప్రతికూల ప్రభావం చూపే శని మార్చి 29 రోజునే శని గ్రహంలోకి ప్రవేశించాడు. రాహువు కూాడా ఇదే రాశిలో ప్రయాణిస్తున్నాడు. మే 18వరకు ఈ సంచారం కొనసాగుతుంది. ఈ రెండు రాశులు ఒకేచోట ఉండటం అనేది తీవ్ర అశుభానికి సంకేతం. దీంతో కొన్ని రాశులు, నక్షత్రాల వారు తీవ్ర ప్రభావానికి లోనవుతారు.

విశాఖ నక్షత్రం
విశాఖ నక్షత్రంలో జన్మించిన వారికి ఇది కష్టకాలమే. రాహువు, శనిల దుష్ప్రభావం వీరిపై అత్యధికంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతోపాటు ఇతర కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఊహించని ఆర్థిక ఖర్చులు ఏర్పడతాయి. సమయానికి చేతికి డబ్బు అందదు. అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. దగ్గరి వాళ్లతోనే గొడవలు జరిగే అవకాశం ఉంది. చాలా ఓర్పుగా ఉండాల్సిన సమయం ఇది. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి.
ఆరుద్ర నక్షత్రం
మీనరాశిలో రాహువు, శని ఉండటం.. ఈ రాశి వారిపై చెడు ప్రభావం చూపించనుంది. జీవితంలో క్లిష్టమైన సమయాల్లో ఈ సమయం కూడా ఒకటిగా నిలవనుంది. భార్యభర్తలు మధ్య తలెత్తే మనస్పర్థలతో మానసిక అశాంతి కలుగుతుంది. పని చేసేచోట సమస్యలు మొదలవుతాయి. ఇతరులతో గొడవలకు దూరంగా ఉండాలి. అనవసర వివాాదాల్లో తలదూర్చవద్దు. ఈ సమయంలో ఎదురయ్యే సవాళ్లకు కుంగిపోకుండా తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలి.
పునర్వసు నక్షత్రం
పునర్వసు నక్షత్ర జాతకులకు ఇది గడ్డు సమయం. పన్నెండేళ్లకు ఒకసారి ఇలాంటి కష్టమైన రోజులు ప్రాప్తిస్తాయి. కుటుంబాల్లో కల్లోలాలు చెలరేగుతాయి. ప్రేమ, పెళ్లి బంధాల్లో కలతలు వస్తాయి. ఊహించని కష్టాలకు సిద్ధంగా ఉండాల్సిన సమయం. ఆర్థిక ఇబ్బందులు వచ్చి పడతాయి. అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఓర్పుగా ఉండాలి. ఆర్థికంగా అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దు.