MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • Vastu Tips: మొబైల్‌లో దేవుడి ఫొటో వాల్‌పేపర్‌గా పెట్టడం మంచిది కాదు.. ఎందుకో తెలుసా?

Vastu Tips: మొబైల్‌లో దేవుడి ఫొటో వాల్‌పేపర్‌గా పెట్టడం మంచిది కాదు.. ఎందుకో తెలుసా?

Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం మొబైల్‌లో కొన్ని రకాల వాల్‌పేపర్లు పెడితే మీ జీవితంలో ప్రతికూల ప్రభావం పడుతుందట. ఎలాంటి వాల్‌పేపర్‌ పెట్టకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Mar 21 2025, 08:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

వాస్తు శాస్త్రం ప్రకారం మనం చేసే పనులు మన జీవితాలపై ప్రభావం చూపిస్తాయి. అందుకే చాలా మంది ఇళ్లను కట్టుకొనేటప్పుడు కచ్చితంగా వాస్తు ప్రకారం కట్టుకుంటారు. లేదంటే ఆ దోషాలు జీవితంపై ప్రభావం చూపుతాయని నమ్ముతారు. కేవలం ఇంటి విషయంలోనే కాకుండా మనిషి జీవితంపై ఎన్నో రకాలుగా వాస్తు ప్రభావం ఉంటుందని పండితులు చెబుతున్నారు. వాస్తు నియమాలు పాటించకపోతే ఫలితాలు కూడా అదే విధంగా ఉంటాయని అంటున్నారు. వాస్తు ప్రకారం మొబైల్ ఫోన్ లో ఎలాంటి వాల్ పేపర్ పెట్టకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. 

25

వాస్తు శాస్త్రం ప్రకారం మత స్థలాల ఫోటోలను మొబైల్ ఫోన్‌లో వాల్‌పేపర్‌గా పెట్టుకోకూడదు. ఎందుకంటే దేవుడికి సంబంధించిన ఏ చిన్న వస్తువైనా పవిత్రంగా చూసుకోవాలి. కాని చాలాసార్లు మనం మురికి చేతులతో మొబైల్‌ను ముట్టుకుంటాం. కొంతమందికి బాత్‌రూమ్‌కు కూడా మొబైల్ ఫోన్ తీసుకెళ్లే అలవాటు ఉంటుంది. ఈ కారణాల వల్లనే మత స్థలాల ఫోటోలను ఎప్పుడూ ఫోన్‌లో పెట్టుకోకూడదు. అలా పెట్టి ఇలాంటి పనులు చేస్తే దేవుడిని అవమానించినట్టు అవుతుంది. ఇది జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు.

దీన్ని కూడా చదవండి:   ఏప్రిల్‌లో పెళ్లిల్లే.. పెళ్లిళ్లు.. ఇన్ని ముహూర్తాలు కుదరడం చాలా అరుదు

35

వాస్తు ప్రకారం మీ మొబైల్ ఫోన్‌లో దేవుడి ఫోటోలను వాల్‌పేపర్‌గా ఎప్పుడూ పెట్టుకోకండి. కాని చాలా మంది ఇదే పనిచేస్తారు. దేవుడి ఫోటో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడొచ్చు. దండం పెట్టుకోవచ్చు అనుకుంటారు. కాని భగవంతుడిని పవిత్రంగా, నిర్మలమైన మనస్సు, శుభ్రమైన శరీరంతో మాత్రమే పూజించాలి. కొంతమంది పండితులు చెప్పిన వివరాల ప్రకారం ఫోన్‌లో దేవుడి ఫోటోలు పెట్టుకుంటే గ్రహ దోషాలు కలుగుతాయట. ఇది కాకుండా మీ జీవితంలో చాలా ప్రతికూల ప్రభావం పడుతుందట. 

దీన్ని కూడా చదవండి: ఈ 5 మంత్రాలు జపిస్తే ఏ పనైనా సక్సెస్ అవుతుంది

45

కొందరు దుఃఖం, కోపం, అసూయ, సంతోషం, అత్యాశ వంటి వాటిని చూపే చిత్రాలను తమ మొబైల్ ఫోన్‌లో వాల్‌పేపర్‌గా పెట్టుకుంటారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఇలాంటి భావోద్వేగ వాల్‌పేపర్‌ పెట్టుకోవడం తప్పు. మీరు ఇలాంటి వాల్‌పేపర్‌ పెట్టుకుంటే దాని వల్ల మీ జీవితంలో చాలా ప్రతికూల ప్రభావం ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ వాల్‌పేపర్ వల్ల మీరు చాలా ఒత్తిడికి కూడా గురవుతారట.

55

వాస్తు శాస్త్రం ప్రకారం మీ మొబైల్ ఫోన్‌లో నలుపు, నీలం, గోధుమ లేదా ఊదా రంగులో ఎప్పుడూ వాల్‌పేపర్ పెట్టుకోకండి. దీని వల్ల జీవితంలో మీరు ఎప్పుడూ విజయం సాధించలేరు. అంతేకాకుండా చేసే పనిలో కూడా అభివృద్ధి ఉండదు. కాబట్టి మీ మొబైల్ ఫోన్‌లో ఈ రంగుల్లో వాల్‌పేపర్ ఎప్పుడూ పెట్టుకోకండి.

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
ఆధ్యాత్మిక విషయాలు
రాశి ఫలాలు
హిందూ పండుగలు
Latest Videos
Recommended Stories
Recommended image1
Dosa Prasadam: ఈ గుడిలో ప్రసాదంగా దోశలు పెడతారు.. ఆ దోశ స్పెషాలిటీ ఏంటో తెలుసా?
Recommended image2
Ugadi Festival 2026: ఉగాది రోజు పూజ ఎప్పుడు చేయాలి? పండితులు చెప్పిన శుభ మూహుర్తం ఇదే.
Recommended image3
Ugadi 2026: ఉగాది రోజు ఇలా చేస్తే ఏడాది అంతా అదృష్టమే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved