MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Spiritual
  • April 2025 Wedding: ఏప్రిల్‌లో పెళ్లిల్లే.. పెళ్లిళ్లు.. ఇన్ని ముహూర్తాలు కుదరడం చాలా అరుదు

April 2025 Wedding: ఏప్రిల్‌లో పెళ్లిల్లే.. పెళ్లిళ్లు.. ఇన్ని ముహూర్తాలు కుదరడం చాలా అరుదు

April 2025 Wedding Muhurtham Dates: పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే సాధారణంగా ఒక నెలలో రెండు, మూడు, మాక్సిమం ఐదు ముహూర్తాలు ఉంటాయి. కాని ఈ ఏప్రిల్ నెలలో వచ్చినన్ని ముహూర్తాలు గతంలో ఎప్పుడూ వచ్చి ఉండవు. ఆ పెళ్లి ముహూర్తాల తేదీలు, సమయాలు, పండితుల సలహాలు తెలుసుకుందాం రండి.   

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Mar 18 2025, 12:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఎవరింట్లో అయినా శుభ కార్యం చేయాలంటే ముహూర్తం చూడటం మన సంప్రదాయం. ముఖ్యంగా పెళ్లిళ్లకు కచ్చితంగా శుభ ముహూర్తం చూస్తారు. కొంతమంది ముహూర్తం కుదరలేదని నెలల తరబడి పెళ్లిళ్లు వాయిదాలు కూడా వేస్తారు. ముహూర్తాలకు అంత ప్రత్యేకత  ఉంది. మరి ఏప్రిల్ 2025లో ఎన్ని పెళ్లి ముహూర్తాలు ఉన్నాయో తెలుసుకుందాం రండి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

హోళీ వేడుకల సందర్భంగా కొన్ని రోజుల వరకు ముహూర్తాలు ఉండవు. ముఖ్యంగా పెళ్లిళ్లు చేయడానికి ఈ సమయం మంచిది కాదు. ఎందుకంటే ప్రస్తుతం మూఢం నడుస్తోంది. ఈ సమయంలో శుభ కార్యాలు చేయకూడదు. ఈ మూఢం అయిపోయే నాటికి ఏప్రిల్ నెల ప్రారంభమవుతుంది. ఆ నెలలో ఎన్నో శుభ ముహూర్తాలు ఉన్నాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు చేయడానికి మంచి ముహూర్తాలు ఉన్నాయి. 
 

ఇది కూడా చదవండి ఉపవాసం దేవుడి కోసం కాదా? మన ఆరోగ్యం కోసమా?

35

ఏప్రిల్ లో పెళ్లి ముహూర్తాలు
ఏప్రిల్ నెల మొత్తం మీద 9 పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. ఇంత ఎక్కువగా పెళ్లి ముహూర్తాలు చాలా అరుదుగా వస్తుంటాయి. సాధారణంగా పెళ్లి ముహూర్తం కుదరాలంటే చాలా అంశాలను పరిగణించాల్సి ఉంటుంది. జాతకాలు, గ్రహ స్థితులు, గోచారాలు,  తారాబలం, వధూవరుల గణన, రాశి ఫలాల పొంతన, ఇలా ఎన్నో అంశాలు కలిస్తేనే ఒక మంచి పెళ్లి ముహూర్తం సెట్ అవుతుంది. మీ ఇంటిలో పెళ్లి వేడుక చేయాలనుకుంటే ఏప్రిల్ నెలలో కచ్చితంగా మంచి ముహూర్తం కుదురుతుంది. ఇన్ని ముహూర్తాల్లో ఏదో ఒకటి కచ్చితంగా సెట్ అవుతుంది. 

45

ఏప్రిల్ నెలలో 13 వ తేదీ వరకు మూఢం ఉంది. దీంతో పాటు సూర్యుడు కుంభ రాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అందువల్ల 13 వరకు పెళ్లి ముహూర్తాలు లేవు. అంటే ఏప్రిల్ నెలలో సగం రోజులు పెళ్లి ముహూర్తాలు లేవు. నెల సగం అయిన తర్వాత నుంచి వివాహ ముహూర్తాలు ప్రారంభమయ్యాయి. అంటే కేవలం 16 రోజుల్లో 9 ముహూర్తాలు ఉన్నాయన్న మాట.
 

ఇది కూడా చదవండి ‘అయ్యబాబోయ్ పెళ్లి చేసుకోవాలా..’ అనే పరిస్థితి ఎందుకొచ్చింది? ఇవే కారణాలు. ఇలా చేస్తే అంతా హ్యాపీ

55

పెళ్లి ముహూర్తాలు ఉన్న తేదీలు
మార్చి 30న ఉగాది కావున అప్పటి నుంచి కొత్త సంవత్సరమైన విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. విశ్వావసు నామ సంవత్సరం చైత్ర మాసం, బహూళ పక్షం పాడ్యమి తిధి నుంచి మంచి ముహూర్తాలు ప్రారంభమవుతున్నాయి. 
ఏప్రిల్ 14(పాడ్యమి), ఏప్రిల్ 16(తదియ), ఏప్రిల్ 18(పంచమి), ఏప్రిల్ 19(షష్టి), ఏప్రిల్ 20(సప్తమి, అష్టమి), ఏప్రిల్ 21(అష్టమి, నవమి), ఏప్రిల్ 25(ద్వాదశి), ఏప్రిల్ 29(శుక్ల విదియ), ఏప్రిల్ 30(శుక్ల తదియ). ఈ తేదీల్లో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. మీ జాతకరీత్యా ఈ తిథుల్లో ఏ నక్షత్రానికి మంచి ముహూర్తం సెట్ అవుతుందో మీకు దగ్గర్లో ఉన్న ఆలయంలో పండితులను అడిగి ముహూర్తం పెట్టించుకోండి.

గమనిక: ఈ ముహూర్తాలు ప్రాంతాలు, రాష్ట్రాలను బట్టి కాస్త అటు, ఇటుగా మారతాయి. గమనించి పండితులను అడిగి శుభ ముహూర్తం నిశ్చయించుకోండి.

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image2
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Recommended image3
Vastu Plants: మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ మొక్కలున్నా అదృష్టమే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved