Spiritual
మీకు లైఫ్‌లో శాంతి, సక్సెస్, ఆధ్యాత్మిక ఎదుగుదల కావాలంటే ఈ శివుడి మంత్రాలు తప్పకుండా జపించాలి.
మంత్రాలు అడ్డంకుల్ని, భయాల్ని తొలగిస్తాయి. పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి. శివుడి 5 బెస్ట్ మంత్రాలు, వాటి వల్ల వచ్చే లాభాలేంటో తెలుసుకుందాం.
శివుడి పంచాక్షరి మంత్రాన్ని రెగ్యులర్‌గా జపిస్తే మనసుకి ప్రశాంతత వస్తుంది. నెగెటివ్ ఎనర్జీ పోతుంది. లైఫ్‌లో విజయం సాధించడానికి కొత్త దారులు తెరుచుకుంటాయి.
"ఓం త్య్రంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్॥' ఈ మంత్రం జపిస్తే ఎక్కువ కాలం బతుకుతారు.
మీరు లైఫ్‌లో ఏదైనా సమస్యతో బాధపడుతుంటే 'ఓం నమో భగవతే రుద్రాయ' అనే ఈ మంత్రం జపించండి. మీ సమస్య తీరిపోతుంది.
"ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి. తన్నో రుద్రః ప్రచోదయాత్॥" ఈ మంత్రం మనశ్శాంతిని ఇస్తుంది. పాజిటివ్ ఆలోచనలను కలిగిస్తుంది. లైఫ్‌లో ఛాలెంజ్‌లను ఎదుర్కొనే శక్తినిస్తుంది.
'ఓం పశుపతయే నమః' ఈ మంత్రం శివుడి దయగల రూపంతో మిమ్మల్ని కనెక్ట్ చేస్తుంది. దీన్ని జపించడం వల్ల మనసు నిలకడగా ఉంటుంది. ఆధ్యాత్మిక శాంతి లభిస్తుంది.