MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Spiritual
  • Kitchen Vastu: ఇంట్లో డబ్బులకు లోటు రావద్దంటే.. వంటగదిలో ఈ 5 అస్సలు అయిపోకూడదు!

Kitchen Vastu: ఇంట్లో డబ్బులకు లోటు రావద్దంటే.. వంటగదిలో ఈ 5 అస్సలు అయిపోకూడదు!

Kitchen Vastu: సనాతన సంప్రదాయం ప్రకారం, వంటగదిని ఇంటి ఐశ్వర్యానికి కేంద్రంగా భావిస్తారు. అందుకే కిచెన్‌లో ఈ 5 పదార్థాలు పూర్తిగా అయిపోకుండా చూసుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అవేంటో, అయిపోతే ఇంట్లో ఎలాంటి సమస్యలు వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Kavitha G
Published : Jun 16 2026, 12:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
వాస్తు ప్రకారం కిచెన్ లో ఏవి పూర్తిగా అయిపోకూడదు?
Image Credit : AI Image

వాస్తు ప్రకారం కిచెన్ లో ఏవి పూర్తిగా అయిపోకూడదు?

సనాతన ధర్మంలో వంటగదికి చాలా ప్రాధాన్యం ఉంది. ఇది వంట చేసే చోటు మాత్రమే కాదు.. ఇక్కడే అన్నపూర్ణా దేవి కొలువై ఉంటుందని నమ్మకం. అందుకే వంటగదిలో కొన్ని పదార్థాలు ఎప్పుడూ పూర్తిగా అయిపోకుండా చూసుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు.  అవి నిండుగా ఉండటం వల్ల ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదని, సుఖశాంతులు, ఆర్థిక స్థిరత్వం ఉంటాయని నమ్మకం. మరి ఆ పదార్థాలేంటో తెలుసుకుందామా.. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
పసుపు
Image Credit : Getty

పసుపు

హిందూ సంప్రదాయం ప్రకారం పసుపు చాలా పవిత్రమైంది. దీన్ని బృహస్పతి (గురు గ్రహం)కి ప్రతీకగా భావిస్తారు. గురుడు జ్ఞానం, గౌరవం, శుభ ఫలితాలు, అభివృద్ధికి కారకుడు. అందుకే ఇంట్లో పసుపు డబ్బా ఖాళీ అవ్వడం అశుభం. పసుపు కొద్దిగా ఉన్నప్పుడే కొత్తది తెచ్చి నింపుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

Related Articles

Related image1
Moon Transit: మిథున రాశిలో చంద్రుడు.. ఈ 4 రాశులవారికి డబ్బుతో పాటు ప్రశాంతత!
Related image2
Dream Meaning: కలలో Ex లవర్ కనిపిస్తే అర్థం ఏంటి? మనసు ఇంకా వారినే కోరుకుంటున్నట్లా?
36
ఉప్పు
Image Credit : Getty

ఉప్పు

వాస్తు శాస్త్రంలో ఉప్పుకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. ఇది రాహు, కేతు గ్రహాల ప్రభావంతో ముడిపడి ఉంటుందని నమ్ముతారు. ఉప్పు డబ్బా పూర్తిగా ఖాళీ అయితే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, మానసిక ఆందోళనలు పెరుగుతాయట. అందుకే ఉప్పు డబ్బాలో ఎప్పుడూ కొంచెమైనా ఉప్పు ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

46
బియ్యం
Image Credit : instagram

బియ్యం

బియ్యాన్ని "అక్షత" అని కూడా అంటారు. అక్షత అంటే నాశనం లేనిది, శుభానికి సంకేతం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బియ్యానికి చంద్ర, శుక్ర గ్రహాలతో సంబంధం ఉంది. ఇంట్లో బియ్యం పూర్తిగా అయిపోతే ఆర్థిక స్థిరత్వం, కుటుంబ సౌభాగ్యం దెబ్బతింటాయని నమ్మకం. అందుకే బియ్యం డబ్బాను ఎప్పటికప్పుడు నింపుతూ ఉండాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

56
పిండి
Image Credit : Getty

పిండి

వాస్తు ప్రకారం వంటగదిలో పిండి డబ్బా పూర్తిగా ఖాళీ అవ్వడాన్ని కూడా అశుభంగా భావిస్తారు. ఇది సంపద, గౌరవం, కుటుంబ అభివృద్ధిపై చెడు ప్రభావం చూపుతుందని నమ్మకం. అందుకే పిండి పూర్తిగా అయిపోయే వరకు ఆగకుండా, కొద్దిగా మిగిలి ఉన్నప్పుడే కొత్త పిండిని నింపుకోవడం మంచిది.

66
ఆవాల నూనె లేదా వంట నూనె
Image Credit : Getty

ఆవాల నూనె లేదా వంట నూనె

ఆవాల నూనెకు శని గ్రహంతో సంబంధం ఉందని ఆధ్యాత్మిక విశ్వాసాలు చెబుతున్నాయి. చాలా మంది నూనె పూర్తిగా అయిపోయాకే కొత్తది కొంటారు. కానీ వాస్తు ప్రకారం ఇది మంచిది కాదు. నూనె డబ్బా పూర్తిగా ఖాళీ అయితే పనుల్లో ఆటంకాలు, అనవసర ఖర్చులు, మానసిక ఒత్తిడి పెరుగుతాయట. అందుకే నూనె కొద్దిగా ఉన్నప్పుడే కొత్తది తెచ్చి పెట్టుకోవడం ఉత్తమం.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image2
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Recommended image3
Vastu Plants: మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ మొక్కలున్నా అదృష్టమే!
Related Stories
Recommended image1
Moon Transit: మిథున రాశిలో చంద్రుడు.. ఈ 4 రాశులవారికి డబ్బుతో పాటు ప్రశాంతత!
Recommended image2
Dream Meaning: కలలో Ex లవర్ కనిపిస్తే అర్థం ఏంటి? మనసు ఇంకా వారినే కోరుకుంటున్నట్లా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved