- Home
- Life
- Spiritual
- గణేష్ చతుర్థి 2025: లక్ష్మీ కటాక్షం పొందాలా? వినాయక చవితి వచ్చేలోగా ఇంట్లో నుంచి ఈ వస్తువులు తీసేయండి
గణేష్ చతుర్థి 2025: లక్ష్మీ కటాక్షం పొందాలా? వినాయక చవితి వచ్చేలోగా ఇంట్లో నుంచి ఈ వస్తువులు తీసేయండి
వినాయక చవితి వచ్చేలోగా.. ఇంట్లో నుంచి కొన్ని వస్తువులను తీసేయాలి. అప్పుడే..మీకు గణేశుని ఆశీస్సులు, లక్ష్మీ కటాక్షం కూడా లభిస్తుంది? మరి ఆ వస్తువులు ఏంటి? ఇంట్లో పేదరికాన్ని పెంచే వస్తువులు ఏంటి?

Ganesh Chaturthi
వినాయక చవితి హిందువుల అతి ముఖ్యమైన పండగ. ఈ రోజున ఆ వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ముఖ్యంగా ఈ రోజున, ఇంటికి వినాయకుడి విగ్రహాన్ని తెచ్చుకొని.. ఆయనకు నచ్చిన పూలు, పండ్లు, పలహారాలు సమర్పిస్తారు. ఈ పండగను కనీసం పదిరోజుల పాటు వైభవంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఈ పండగను భాద్రపద మాసంలోని శుక్ల పక్షంలోని చతుర్థి తేదీన వస్తోంది. ఈసారి ఈ పండగ ఆగస్టు 27వ తేదీన వస్తోంది.
పండగ వస్తోంది అనగానే.. అందరూ తమ ఇంటిని శుభ్రం చేసుకుంటూ ఉంటారు. అయితే, వాస్తు ప్రకారం పండగకు ముందే కొన్ని మార్పులు కచ్చితంగా చేసుకోవాలి.ఎందుకంటే.. వినాయక చవితి పండగ వస్తూ వస్తూనే మనకు ఆనందం, శుభం, శ్రేయస్సు తెస్తుంది. ఈ పండగను జరుపుకోవడం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది అని నమ్ముతుంటారు. అలా అడుగుపెట్టాలి అంటే.. కచ్చితంగా కొన్ని మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా ఇంట్లో నుంచి కొన్ని వస్తువులను తొలగించాలి. మరి, అవేంటో చూద్దాం..
చినిగిన పుస్తకాలు...
చాలా మంది తమ ఇంట్లో చినిగిపోయిన, పాత పుస్తకాలను కూడా దాచుకుంటూ ఉంటారు. అవి ఉపయోగిస్తూ ఉంటే పర్వాలేదు.. అలా కాకుండా.. ఓ మూలన పడేసి ఉంచితే.. వాటిని తొలగించడమే మంచిది. ఎందుకంటే.. అలాంటి పుస్తకాలు ఇంట్లో ఉంటే.. పిల్లలు విద్యకు దూరం అయ్యే అవకాశం ఉంది. అంతేకాదు.. తెలివితేటలు కూడా పెరగకపోవచ్చు. కాబట్టి.. వీటిని తొలగించండి.
చెరిగిన నోట్లు...
చాలా మందికి డబ్బులు దాచుకునే అలవాటు ఉంటుంది. ఈ క్రమంలో...చినిగిపోయిన వాటిని కూడా దాచిపెట్టేస్తూ ఉంటారు. కానీ, అలాంటివి ఉంచుకోవడం వాస్తు ప్రకారం మంచిది కాదట. అదృష్టాన్ని దూరం చేసే అవకాశం ఉంది. కాబట్టి.. అలాంటి నోట్లను తొలగించడమే మంచిది.వాటిని మార్చగలిగితే మార్చేయడమే మంచిది. ముఖ్యంగా అలాంటి నోట్లను పూజ కోసం అస్సలు ఉపయోగించకూడదు.
పాత దుస్తులు..
మీరు సంవత్సరాలుగా ధరించని మురికి, చిరిగిన బట్టలు ఉంటే, ముందుగా వాటిని ఇంటి నుండి బయటకు విసిరేయండి. ఎందుకంటే ఈ వస్తువులు ఇంటికి అదృష్టాన్ని తీసుకురావు. అవి ప్రతికూలతను ఆకర్షిస్తాయి. ఇంట్లో ఉన్న డబ్బు కూడా నీటిలా ఖర్చు అవుతుంది. పాత బట్టలు, మురికి బూట్లతో గణేశుడిని ఇంటికి తీసుకురావడం శుభం కాదు. దీనివల్ల మీరు విఘ్న వినాయకుడి కోపానికి గురవుతారు. కాబట్టి, మీ ఇంట్లో అలాంటి వస్తువులు ఉంటే, వాటిని బయట పారవేయండి.
గణేష్ చతుర్థి నాడు ఇంట్లో ఉంచకూడని వస్తువులు:-
* విరిగిన , దెబ్బతిన్న విగ్రహాలు: విరిగిన, దెబ్బతిన్న విగ్రహాలు ఇంటి శక్తిని నాశనం చేస్తాయి. గణేష్ చతుర్థి శుభ సందర్భంగా, అటువంటి విగ్రహాలను గౌరవంగా తొలగించండి. ఇది సానుకూల శక్తి ప్రవాహాన్ని పెంచుతుంది.
* విరిగిన ఫర్నిచర్: విరిగిన ఫర్నిచర్, తుప్పు పట్టిన పాత్రలు, పాత దెబ్బతిన్న ఉపకరణాలు ఇంటిని చిందరవందర చేయడమే కాకుండా ప్రతికూలతను కూడా తెస్తాయి. దాన్ని సకాలంలో సరిచేయండి లేదా ఇంటి నుండి తీసివేయండి.
* విరిగిన గడియారాలు: సరిగ్గా పనిచేయని గడియారాలు లేదా హ్యాండ్‌బ్యాగులు అశుభంగా పరిగణిస్తారు. గణేశుడు రాకముందే వీటిని ఇంటి నుండి తీసివేయడం మంచిది.
* పూజా స్థలం శుభ్రత: గణేశుడిని ప్రతిష్టించే ముందు పూజా స్థలాన్ని పూర్తిగా శుభ్రం చేయండి. సానుకూలతను పెంచడానికి మంచి ధూపం, శుభ్రమైన నీటితో పూజా స్థలాన్ని శుద్ధి చేయండి.
* పాత, అనవసరమైన వస్తువులు: మీ ఇంటి నుండి విరిగిన, ఉపయోగించని లేదా చికాకు కలిగించే వస్తువులను తొలగించండి. ఇది ఇంటి శక్తిని రిఫ్రెష్ చేస్తుంది.
* గణేశుని విగ్రహం సరైన దిశ: గణేశ విగ్రహాన్ని ఇంటి ఈశాన్య లేదా తూర్పు దిశలో ప్రతిష్టించాలి. సరైన దిశ శుభం, శ్రేయస్సును తెస్తుంది.