Dream: నవరాత్రల వేళ... కలలో ఇవి కనిపిస్తున్నాయా? మీ దశ తిరిగినట్లే..!
Dream: స్వప్నశాస్త్రం ప్రకారం...మనకు రాత్రిపూట వచ్చే ప్రతి కలకీ ఓ అర్థం ఉంటుంది. మరి, నవరాత్రిల వేళ కలలో మనకు దుర్గామాత కనిపిస్తే ఏమౌతుంది? అర్థమేంటి?

Dream
హిందూ మతంలో నవరాత్రులు చాలా పవిత్రమైనవి. ఈ సమయాన్ని అత్యంత శుభకాలంగా పరిగణిస్తారు. ఈ తొమ్మిది రోజులు దుర్గా మాతను పలు రూపాల్లో అలంకరించి.. పూజించుకుంటూ ఉంటాం. అలాంటి సమయంలో సహజంగానే అమ్మవారికి సంబంధించిన కలలు రావచ్చు. మరి కలలో ఏవి కనిపిస్తే... మంచి జరుగుతుంది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం....
1.కలలో దుర్గా దేవి....
స్వప్న శాస్త్రం ప్రకారం, మనం దుర్గాదేవిని కలలో చూసినట్లయితే, లేదా దుర్గాదేవికి సంబంధించిన ఏదైనా రూపాన్ని చూసినట్లయితే.. ఇలాంటి కలను చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. అలా దుర్గా దేవిని కలలో చూస్తే.... ఆమె ఆశీస్సులు లభించినట్లే. అంతేకాదు.. జీవితంలో అన్ని సమస్యలు, అడ్డంకులు తొలగిపోతాయని అర్థం.
కలలో కమలం పువ్వు....
శాస్త్రాల ప్రకారం, కమలం పువ్వు అనేది లక్ష్మీదేవితో మాత్రమే కాకుండా దుర్గాదేవితో కూడా సంబంధం కలిగి ఉన్న పువ్వు. అయితే, మనం ఎక్కువగా కమలంపై లక్ష్మీదేవిని చూస్తాము. నవరాత్రి పండుగ సమయంలో కలలో కమలం పువ్వును చూస్తే అది చాలా శుభప్రదమని చెబుతారు. కలలో కమలం పువ్వును చూడటం అంటే ఆర్థిక లాభం, శ్రేయస్సు , అదృష్టానికి సంకేతం.
తెలుపు లేదా ఎరుపు పువ్వులు...
మీ కలలో ఎరుపు లేదా తెలుపు పువ్వును చూడటం అంటే దేవత ఆశీస్సులు మీపై ఉన్నాయని అర్థం. ఎర్రటి పువ్వు బలం, ధైర్యం , విజయాన్ని సూచిస్తుంది, తెల్లటి పువ్వు శాంతి , సానుకూలతను సూచిస్తుంది.
దుర్గా దేవి ఆలయం...
నవరాత్రి సమయంలో మనం దుర్గాదేవి ఆలయం గురించి కలలు కన్నట్లయితే, ఆలయ గంటలు మోగడం లేదా పూజ చేయడం వంటివి కలలో కనిపిస్తే, అలాంటి కలలు మీకు త్వరలో శుభవార్త అందుతాయని సూచిస్తాయి. ఈ కల మన జీవితాల నుండి ప్రతికూలతలను తొలగించడమే కాకుండా, త్వరలో శుభవార్త వింటారు అని అర్థం.
కలలో దుర్గాదేవి వాహనం
దుర్గ సింహవాహిని. ఆమె వాహనం సింహం, ఆమె సింహంపై స్వారీ చేస్తుంది. అలాంటి సందర్భంలో, నవరాత్రి సమయంలో మన కలలో సింహాన్ని చూసినట్లయితే, ధైర్యం , బలం మీ జీవితంలోకి ప్రవేశిస్తాయని అర్థం. ఈ కల రాబోయే రోజుల్లో విజయం , ఆత్మవిశ్వాసానికి చిహ్నంగా పరిగణిస్తారు.
ప్రవహించే నీరు లేదా నది..
9 రోజుల శారదయ నవరాత్రి పండుగ సమయంలో, మీరు మీ కలలో స్పష్టమైన నీరు, నది లేదా ఏదైనా ప్రవహించే నీటిని చూసినట్లయితే, దుర్గాదేవి తన అనుగ్రహాన్ని మీకు ప్రసాదించిందని , స్వచ్ఛతను సూచిస్తుందని అర్థం. కలల సిద్ధాంతం ప్రకారం, ఈ కల మీ అసంపూర్ణమైన పని త్వరలో పూర్తవుతుందని, మీరు మానసిక శాంతిని పొందుతారని సూచిస్తుంది.