ఈ రాశుల వారికి దండిగా శివుడి అనుగ్రహం.. పూజిస్తే పట్టిందల్లా బంగారమే!
Lord Shiva: జ్యోతిశాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు పుట్టుకతోనే అదృష్టవంతులు. మరికొన్ని రాశుల వారికి కష్టాలు ఉన్న శివుడిని పూజిస్తే ఆయన అనుగ్రహం లభించి, అన్నీ శుభాలే కలుగుతాయి. భక్తి శ్రద్ధలతో శివుడిని పూజిస్తే కష్టాలన్ని తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. సోమవారం నాడు శివునికి అభిషేకాలు, అర్చనలు చేస్తుంటారు. జ్యోతిష్య శాస్త్రంలో కూడా శివుడికి అత్యంత ప్రాముఖ్యం ఉంది. పరంగా కూడా శివుడికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత కలిగి ఉంటాడు. శివుడికి కొన్ని రాశుల వారితో దగ్గరి సంబంధం ఉంది.

Angry Zodiac Signs
వృశ్చిక రాశివారికి సహజంగానే శివయ్య అనుగ్రహం ఉంటుంది. భోళాశంకరుడిని పూజిస్తే వీరికి కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. ధనలాభం కలుగుతుంది. తలపెట్టిన పనుల్లో సానుకూల ఫలితాలు పొందుతారు. ఆరోగ్యం బాగుపడుతుంది. పరమేశ్వరుడిని పూజిస్తుంటే కష్టాలు రాకుండా ఆయన కాపాడతాడు.
కుంభ రాశి వారికి పరమశివుని అనుగ్రహంతో మంచి ఫలితాలు కలుగుతాయి. కుంభ రాశిలో జన్మించిన వారికి శని అధిపతి. శనికి, శివుడికి సంబంధం ఉంటుంది. ఈ జాతకులపై నిత్యం శివయ్య చల్లని చూపు ఉంటుంది. రోజూ శివుడిని పూజించడం వల్ల ఉన్న సమస్యలన్నీ తీరతాయి. వాళ్లు చేసే పనులకు తప్పకుండా సానుకూల ఫలితాలు దక్కుతాయి.
మేష రాశివారికి శివుడి ఆశీస్సులు దండిగా ఉంటాయి. ప్రతి సోమవారం దేవదేవుడిని పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి. అనుకున్న పనుల్లో సులభంగా విజయాలు సాధిస్తారు. దీంతో పాటు ఆర్థికంగా కూడా బోలెడు లాభాలు పొందుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఎలాంటి సమస్యలు వచ్చిన సులభంగా పరిష్కారం పొందుతారు. పరమశివుడిని కటాక్షం పుష్కలంగా ఉండటంతో కష్టాలన్నీ ఎప్పటికప్పుడు తొలగిపోతాయి.
Horoscope
శివుడికి అత్యంత ఇష్టమైన రాశుల్లో మకర రాశి ఒకటి. దీంతో వీరు పట్టిందల్లా బంగారం అవుతుంటుంది. ఎలాంటి కష్టాలనైనా శివుడిని పూజించి తేలికగా బయట పడవచ్చు. తలపెట్టిన పనుల్లో విజయం దక్కుతుంది. వీరిని శివయ్య ఎప్పటికప్పుడు కష్టాల నుంచి గట్టెక్కిస్తాడు. ప్రతి ప్రయత్నం విజయవంతమై వీళ్లు విశేషంగా రాణిస్తారు.
గమనిక: ఈ సమాచారం కేవలం జ్యోతిష్య నిపుణులకు అనుగుణంగా ఇవ్వబడింది.