MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Spiritual
  • Ashadam: ఆషాఢంలో పెళ్లిళ్లు, శుభకార్యాలు చేయకపోయినా..పండుగలకు కొదవలేదు..ఏమేం ఫెస్టివల్స్ చేస్తారో తెలుసా?

Ashadam: ఆషాఢంలో పెళ్లిళ్లు, శుభకార్యాలు చేయకపోయినా..పండుగలకు కొదవలేదు..ఏమేం ఫెస్టివల్స్ చేస్తారో తెలుసా?

Ashadam: ఆషాఢ మాసం అనగానే అందరికీ గుర్తొచ్చేది శుభకార్యాలు లేని శూన్య మాసం అని. అందుకే ఈ నెలలో పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, వేడుకలు ఏమీ జరగవు. కానీ ఈ మాసంలో కొన్ని పండుగులు మాత్రం చాలా సందడిగా జరుగుతాయి. అవేంటో తెలుసా? 

2 Min read
Author : Nandini Arava
Published : Jul 02 2026, 01:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
తెలంగాణ బోనాలు (ఆషాఢ బోనాలు)
Image Credit : our own

తెలంగాణ బోనాలు (ఆషాఢ బోనాలు)

ఆషాఢ మాసానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో పెళ్లిళ్లు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు జరగవు కాబట్టి దీనిని కొందరు "శూన్య మాసం" అని పిలుస్తారు. కానీ కొన్ని ఉత్సవాలు, పండుగలతో సందడిగా ఉంటుంది. ప్రకృతిలో మార్పులతో పాటు భక్తిభావం వెల్లివిరిసే ఈ ఆషాఢ మాసంలో జరుపుకునే ప్రధాన పండుగలు, విశేషాలు ఇవే

తెలంగాణ బోనాలు (ఆషాఢ బోనాలు)

తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఆషాఢ మాసం అంటేనే బోనాల జాతర. గోల్కొండ జగదాంబిక అమ్మవారి పూజతో ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమవుతాయి. లష్కర్ బోనాలు (సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి), పాతబస్తీ భాగ్యలక్ష్మి అమ్మవార్లకు భక్తులు నైవేద్యం (బోనం) సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
జగన్నాథ రథయాత్ర
Image Credit : X-Shree Jagannatha Temple Puri

జగన్నాథ రథయాత్ర

ఒడిశాలోని పూరీ క్షేత్రంలో జరిగే జగన్నాథుని రథయాత్ర ఆషాఢ శుక్ల విదియ నాడు ప్రారంభమవుతుంది. శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర దేవిలతో కలిసి రథాలపై గుండిచా ఆలయానికి ఊరేగింపుగా వెళ్తారు. ఈ అద్భుత ఘట్టాన్ని చూడటానికి ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. 

Related Articles

Related image1
Irumudi: ఇరుముడిలో ఏమేం పెడతారు? కొబ్బరికాయలో నెయ్యి ఎందుకు వేస్తారు?
Related image2
Puri Jagannath: సముద్రం పక్కనే ఉన్నా ఆ గుడిలో అలల శబ్ధం వినిపించదు..సైన్స్ కి అందని అద్భుతం
36
తొలి ఏకాదశి (శయన ఏకాదశి)
Image Credit : Asianet News

తొలి ఏకాదశి (శయన ఏకాదశి)

ఆషాఢ శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అంటారు. ఈ రోజు నుంచే మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై యోగనిద్రలోకి వెళ్తాడని నమ్ముతారు. ఇక్కడి నుంచే పవిత్రమైన చాతుర్మాస్య వ్రతం ప్రారంభమవుతుంది. ఈ రోజున భక్తులు రోజంతా ఉపవాసం ఉండి, ఆరోగ్యానికి మేలు చేసే పేలాల పిండిని ప్రసాదంగా తీసుకుంటారు. 

46
గురు పౌర్ణమి (వ్యాస పౌర్ణమి)
Image Credit : Getty

గురు పౌర్ణమి (వ్యాస పౌర్ణమి)

ఆషాఢ శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమిగా జరుపుకుంటారు. మహాభారతం, పురాణాలను మానవాళికి అందించిన వేదవ్యాస మహర్షి జన్మించిన రోజు ఇది. అందుకే దీనిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. ఈ రోజున తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను, ఆధ్యాత్మిక మార్గాన్ని చూపిన సద్గురువులను పూజించి వారి ఆశీస్సులు తీసుకుంటారు. 

56
ఆషాఢ నవరాత్రులు (వారాహి నవరాత్రులు)
Image Credit : our own

ఆషాఢ నవరాత్రులు (వారాహి నవరాత్రులు)

శరన్నవరాత్రుల్లాగే ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులను గుప్త నవరాత్రులు లేదా ఆషాఢ నవరాత్రులు అంటారు. ఈ తొమ్మిది రోజులు శక్తి స్వరూపిణి అయిన వారాహి దేవిని, గాయత్రీ దేవిని భక్తులు ఎంతో నిష్ఠతో ఆరాధిస్తారు. 

66
గోరింటాకు ప్రాధాన్యత
Image Credit : our own

గోరింటాకు ప్రాధాన్యత

ఆషాఢంలో వర్షాల వల్ల వాతావరణం చల్లబడి ఇన్ఫెక్షన్లు, గోళ్లు పాడవ్వడం వంటి సమస్యలు వస్తుంటాయి. గోరింటాకు శరీరానికి చలవ చేయడమే కాకుండా చర్మ వ్యాధుల నుండి రక్షిస్తుంది. అందుకే ఈ నెలలో గోరింటాకు పెట్టుకుంటారు. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఆధ్యాత్మిక విషయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image2
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Recommended image3
Vastu Plants: మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ మొక్కలున్నా అదృష్టమే!
Related Stories
Recommended image1
Irumudi: ఇరుముడిలో ఏమేం పెడతారు? కొబ్బరికాయలో నెయ్యి ఎందుకు వేస్తారు?
Recommended image2
Puri Jagannath: సముద్రం పక్కనే ఉన్నా ఆ గుడిలో అలల శబ్ధం వినిపించదు..సైన్స్ కి అందని అద్భుతం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved