MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Spiritual
  • Puri Jagannath: సముద్రం పక్కనే ఉన్నా ఆ గుడిలో అలల శబ్ధం వినిపించదు..సైన్స్ కి అందని అద్భుతం

Puri Jagannath: సముద్రం పక్కనే ఉన్నా ఆ గుడిలో అలల శబ్ధం వినిపించదు..సైన్స్ కి అందని అద్భుతం

Puri Jagannath: మనం ఎప్పుడైనా సముద్రం ఒడ్డుకు వెళ్తే.. చాలా దూరం నుంచే అలల సౌండ్ పెద్దగా వినిపిస్తుంది కదా. కానీ, ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయానికి వెళ్తే మాత్రం..బయట వినిపించే అలల శబ్ధం..గుడిలో అడుగుపెట్టగానే ఆగిపోతుంది. ఎందుకో తెలుసా? 

2 Min read
Author : Nandini Arava
Published : Jun 30 2026, 03:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఒక్క అడుగుతో మాయమయ్యే సౌండ్!
Image Credit : gemini ai

ఒక్క అడుగుతో మాయమయ్యే సౌండ్!

పూరీ జగన్నాథ ఆలయానికి ఉన్న మెయిన్ గేట్‌ను ‘సింహద్వారం’ అంటారు. మీరు ఈ ద్వారం బయట నిలబడితే సముద్రపు అలల సౌండ్ చాలా క్లియర్ గా వినిపిస్తుంది. కానీ, ఆ నల్లరాతి గడప దాటి లోపలికి ఒక్క అడుగు పెట్టగానే... అంతే. ఆ సౌండ్ అస్సలు వినిపించదు. అక్కడ ఏదో ఒక సైలెన్స్ జోన్ లోకి వెళ్లినట్టు అనిపిస్తుంది. మళ్లీ మీరు వెనక్కి తిరిగి అదే గడప బయట అడుగుపెడితే, అప్పటికప్పుడే రేడియో ఆన్ చేసినట్లు సముద్రపు చప్పుడు మళ్లీ మామూలుగా వినిపిస్తుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సైంటిస్టులు ఏం చెప్తున్నారు?
Image Credit : Getty

సైంటిస్టులు ఏం చెప్తున్నారు?

జనరల్ గా శబ్దం గాలి ద్వారా ప్రయాణిస్తుంది. అంత పెద్ద సముద్రపు శబ్ధం, ఎలాంటి అడ్డు లేకుండా కేవలం ఒక్క అడుగు దూరంలో ఎలా ఆగిపోతుందో ఎవరికీ అర్థం కాలేదు. దీనిపై దేశ విదేశాల శాస్త్రవేత్తలు ఎన్నో రీసెర్చ్‌లు చేశారు. గుడి గోపురాల డిజైన్ వల్ల లేదా చుట్టూ ఉన్న ఎత్తైన రాతి గోడల వల్ల సౌండ్ లోపలికి రావడం లేదేమో అని టెస్ట్ చేశారు. కానీ, గాలి ఎటు వీచినా.. వాతావరణం ఎలా ఉన్నా.. ఒక్క అడుగు తేడాతో సౌండ్ పూర్తిగా నిలిచిపోవడానికి ఆధారాలు దొరకలేదు. దాంతో సైన్స్ కూడా ఇక్కడ చేతులెత్తేసింది. 

Related Articles

Related image1
IRUMUDI KATTU: పూనకాలు తెప్పిస్తున్న రవితేజ పాట.. భక్తులకు ట్రీట్ ఇచ్చేలా 'ఇరుముడి' ఫస్ట్ సింగిల్
Related image2
Puri Jagannath: పూరీ జగన్నాథుడికి జ్వరం వస్తుందా? 15 రోజులు దర్శనం నిలిపేయడానికి కారణమేంటీ? పూరీ జగన్నాథుని అంతుచిక్కని రహస్యం
34
ఆంజనేయ స్వామి మహిమ
Image Credit : ANI

ఆంజనేయ స్వామి మహిమ

సైన్స్ సమాధానం చెప్పలేని ఈ ప్రశ్నక మన పురాణాల్లో ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఒకసారి జగన్నాథ స్వామి లక్ష్మీదేవితో కలిసి ఆలయంలో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్నారట. అయితే బయట ఉన్న సముద్రం హోరు వల్ల స్వామివారి నిద్రకు భంగం కలిగింది. దాంతో లక్ష్మీదేవి బాధపడింది. భార్య ఇబ్బందిని చూసిన జగన్నాథుడు.. హనుమంతుడిని పిలిచి, ఆ సముద్రపు సౌండ్ గుడి లోపలికి రాకుండా చూడమని చెప్పారు. స్వామి మాట ప్రకారం ఆంజనేయ స్వామి తన శక్తులతో ఆ శబ్ద తరంగాలను సింహద్వారం దగ్గరే ఆపేశారని పురాణాలు చెబుతున్నాయి.

44
సంకెళ్లతో ఉన్న హనుమంతుడు!
Image Credit : Getty

సంకెళ్లతో ఉన్న హనుమంతుడు!

ఈ కథ వల్లే పూరీ గుడిలో హనుమంతుడిని 'బేడి హనుమాన్' (సంకెళ్లతో ఉన్న ఆంజనేయుడు) అని పిలుస్తారు. ఈ ఆలయానికి నాలుగు వైపులా హనుమంతుడు కాపలా ఉంటూ, సముద్రపు అలల శబ్దాన్ని లోపలికి రాకుండా అడ్డుకుంటున్నాడని భక్తుల నమ్మకం. Puri Jagannath:సముద్రం పక్కనే ఉన్నా ఆ గుడిలో అలల శబ్ధం వినిపించదు..సైన్స్ కి అందని అద్భుతం

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఆధ్యాత్మిక విషయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image2
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Recommended image3
Vastu Plants: మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ మొక్కలున్నా అదృష్టమే!
Related Stories
Recommended image1
IRUMUDI KATTU: పూనకాలు తెప్పిస్తున్న రవితేజ పాట.. భక్తులకు ట్రీట్ ఇచ్చేలా 'ఇరుముడి' ఫస్ట్ సింగిల్
Recommended image2
Puri Jagannath: పూరీ జగన్నాథుడికి జ్వరం వస్తుందా? 15 రోజులు దర్శనం నిలిపేయడానికి కారణమేంటీ? పూరీ జగన్నాథుని అంతుచిక్కని రహస్యం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved