దీపావళి రోజున ఏ రాశివారు ఏ వస్తువు దానం చేయాలో తెలుసా?
జోతిష్యశాస్త్రం ప్రకారం ఏ రాశివారు ఏం దానం చేస్తే వారికి మంచి జరుగుతుందో తెలుసుకుందాం…
దీపావళి పండగ వచ్చేస్తోంది. ఈ పండగను దేశవ్యాప్తంగా అందరూ చాలా ఆనందంగా జరుపుకుంటారు. అయితే.. దీపావళి వేళ ఇంటిని అలంకరించుకోవడం, టపాసులు కాల్చడమే కాదు.. దాన దర్మాలు కూడా చేయాలట. మరి, జోతిష్యశాస్త్రం ప్రకారం ఏ రాశివారు ఏం దానం చేస్తే వారికి మంచి జరుగుతుందో తెలుసుకుందాం…
telugu astrology
1.మేష రాశి..
ప్రస్తుతం బయట చలి చంపేస్తుంది. ఈ చలికారంగా చాలా మంది ఇబ్బందిపడుతున్నారు. అలాంటివారు.. ఈ సమయంలో ఎవరైతే ఇబ్బందిపడుతున్నారో వారికి ఈ దీపావళి రోజున స్వెట్లర్లు, దుప్పట్లు లాంటివి దానం చేయాలి. ఇది, ఈ రాశివారికి చాలా మంచి చేస్తుంది.
telugu astrology
2.వృషభ రాశి..
పండగ సంతోషం పంచుకోవడంతో మరింత పెరుగుతుంది. అందుకే వృషభ రాశివారు ఈ దీపావళి రోజున స్వీట్లు, మిఠాయి లాంటివి పంచాలి. అది కూడా చిన్న పిల్లలకు పంచి పెట్టాలి. ఇది ఈ రాశివారికి శుభ ఫలితాలు ఇస్తుంది.
telugu astrology
3.మిథున రాశి..
మిథున రాశివారు ఈ దీపావళి రోజున శుభ ఫలితాలు పొందడానికి, శ్రేయస్సు పొందడానికి పక్షులకు ఆహారం, నీరు పెట్టాలి.
telugu astrology
4.కర్కాటక రాశి..
కర్కాటక రాశివారు ఈ దీపావళి పండగ రోజున లక్ష్మీదేవిని పూజించాలి. లక్ష్మీదేవిని పూజించిన తర్వాత.. ఎవరికైనా పేదలకు మినపప్పును దానం చేయాలి. ఇలా చేయడం వల్ల కర్కాటక రాశివారికి శుభం జరుగుతుంది.
telugu astrology
5. సింహ రాశి..
సింహ రాశివారు ఈ దీపావళి రోజున నవ ధాన్యాలు పేదలకు దానం చేయాలి. ఇలా పేదలకు దానం చేయడం వల్ల.. కుటుంబంలో ఉన్న ధన సమస్యలు, పేదిరకం మొత్తం తొలగిపోతాయి.
telugu astrology
6.కన్య రాశి..
కన్య రాశివారు ఈ దీపావళి రోజున మీ ఇంటికి సమీపంలో ఉన్న శనీశ్వర ఆలయానికి వెళ్లి.. ఆ రోజున ఆవనూనె దానం చేయాలి. ఇలా చేయడం వల్ల ఈ రాశివారికి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవి తగ్గిపోతాయి.
telugu astrology
7.తుల రాశి..
తుల రాశివారు ఈ దీపావళి రోజున పేదలకు ఆహారం లేదంటే డబ్బు దానం చేయాలి. పేదలకు ఇలాంటి దానం చేయడం వల్ల.. ఈ రాశివారికి మేలు జరుగుతుంది.
telugu astrology
8.వృశ్చిక రాశి..
దీపావళి పండగ రోజున వినాయకుడు, లక్ష్మీ దేవిని పూజించిన తర్వాత.. ఈ రాశివారు అవసరంలో ఉన్నవారికి దుప్పట్లు లాంటివి డొనేట్ చేయాలి. ఇలా చేస్తే.. వృశ్చిక రాశివారికి మేలు జరిగే అవకాశం ఉంది.
telugu astrology
9.ధనస్సు రాశి..
ధనస్సు రాశివారు ఈ దీపావళి పండగ రోజున ఏదైనా ఆహారం అరటి ఆకులో పెట్టి.. దానిని ఆవుకు అందించాలి. ఇలా చేయడం వల్ల ఈ రాశివారికి మంచి జరుగుతుంది. కోరుకున్నవి లభిస్తాయి.
telugu astrology
10.మకర రాశి..
మకర రాశివారు ఈ దీపావళి రోజున ఏదైనా ఒక రకం పప్పును దానం చేయాలి. ఇలా చేయడం వల్ల మకర రాశివారికి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.
telugu astrology
11.కుంభ రాశి..
కుంభ రాశివారికి ఈ దీపావళి రోజున ఏదైనా కొత్త వస్తువులను లేదంటే ఆహారాన్ని.. పేదలకు లేదంటే అనాథ పిల్లలకు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల కుంభ రాశివారికి లాంగ్ లైఫ్ లభిస్తుంది.
telugu astrology
12.మీన రాశి..
మీన రాశివారు ఈ దీపావళి రోజున ఏదైనా పేద కుటుంబానికి చెందిన ఎవరైనా విద్యార్థికి విద్యా దానం చేయడం వల్ల.. మీకు శుభం జరిగే అవకాశం ఉంది.