- Home
- Life
- Spiritual
- Dhanteras 2025: ధనత్రయోదశి రోజున ఈ ఒక్క పని చేసినా.. మీ జేబులు డబ్బుతో నిండటం ఖాయం..!
Dhanteras 2025: ధనత్రయోదశి రోజున ఈ ఒక్క పని చేసినా.. మీ జేబులు డబ్బుతో నిండటం ఖాయం..!
Dhanteras 2025: దీపావళికి ముందే మనమంతా ధనత్రయోదశిని జరుపుకుంటాం. ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే... ఆమె ఆశీస్సులు లభిస్తాయని, ఆర్థిక సమస్యలు తీరిపోతాయని నమ్ముతారు.

Dhanteras
ఈ ఏడాది అక్టోబర్ 18, శనివారం ధన త్రయోదశి జరుపుకోనున్నారు. దీనినే ధంతేరాస్ అని కూడా పిలుస్తారు. ఈ ధన త్రయోదశి రోజున లక్ష్మీదేవి, కుబేరుడి కి పూజ చేస్తారు. అంతేకాదు...ఈ రోజు నుంచే దీపాలు వెలిగించడం మొదలుపెడతారు. నార్మల్ గా నూనె దీపం కాకుండా.. నెయ్యి దీపం వెలిగిస్తే శుభ ఫలితాలు కలుగుతాయని కూడా నమ్ముతారు. అంతేకాదు, ఈ రోజున కొన్ని పనులు చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తీరడమే కాదు.. సంపద కూడా పెరుగుతుంది. మరి, ఆ పనులేంటో చూద్దామా,.
ధనత్రయోదశి రోజున ఏం చేయాలి..?
13 దీపాలు వెలిగించాలి... ధన త్రయోదశి రోజున సాయంత్రం మీరు ఇంట్లో 13 దీపాలను వెలిగించాలి. లక్ష్మీదేవి, కుబేరుల ముందు ఒక దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషపడుతుంది. కుబేరుడి అనుగ్రహం కూడా పొందుతారు. ఇంటికి సంపద, శ్రేయస్సును కూడా తీసుకువస్తుంది. మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెట్టాలి అంటే... కేవలం దేవుడి ముందు దీపం వెలిగిస్తే సరిపోదు . మీరు ఇంట్లో డబ్బు దాచుకునే ప్రదేశానికి కూడా పూజ చేయాలి.
లక్ష్మీ కటాక్షం కోసం...
శంఖంలో నీరు : దీపావళికి ముందే మీ ఇంటికి ఓ శంఖాన్ని తీసుకురావాలి. ఒకవేళ ఆల్రెడీ శంఖం ఉంటే... దానిని శుభ్రం చేసి.. శుభ్రమైన నీటిని అందులో చేర్చాలి. ఆ తర్వాత ఆ నీటిని ఇంట్లో మొత్తం చల్లాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది.
ఇంటి గుమ్మం వద్ద ఓం చిహ్నం... ధన త్రయోదశి రోజున, మీరు మీ ఇంటి ప్రధాన ద్వారం అందంగా అలంకరించాలి. లక్ష్మి ఈ ద్వారం ద్వారా మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి, ప్రధాన ద్వారం శుభ్రంగా ఉండాలి. ముందుగా ఇంటి ప్రధాన ద్వారం శుభ్రం చేయండి. మురికి లేకుండా చూసుకోండి. తరువాత పసుపు, కుంకుమతో... దర్వాజ మీద ఓం అని రాయండి.
లక్ష్మీదేవి ఫోటో..
ఈ వస్తువును సేఫ్‌లో ఉంచండి: ధన త్రయోదశి రోజున మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో లక్ష్మీదేవి చిత్రాన్ని దాచుకోవాలి. డబ్బు, బంగారం ఉన్న ప్రదేశంలో... లక్ష్మీదేవి కమలం పువ్వు లో కూర్చున్నట్లుగా, రెండు వైపులా ఏనుగులు ఉండేలా చూసుకోవాలి. అలాంటి లక్ష్మీదేవిని మీ బీరువాలో దాచుకుంటే... ఆర్థిక సమస్యలు తీరిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.