Diwali 2025: దీపావళి రోజున కచ్చితంగా చేయాల్సినవి, చేయకూడనివి ఏంటో తెలుసా?
Diwali 2025: దీపావళి పండగను ఇష్టపడని వారు ఉండరు. ఈ రోజున మంచి భక్తితో పూజిస్తే... లక్ష్మీ దేవి కటాక్షం లభిస్తుందని నమ్ముతారు. అలా లభించాలి అంటే చేయాల్సినవీ, చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. వాటిని ఫాలో అయితే, శుభాలు జరిగే అవకాశం ఉంటుంది.

Diwali
దీపావళి పండగ అంటే వెలుగుల పండగ మాత్రమే కాదు, సంపద, శ్రేయస్సు కి సూచిక. ఈ పర్వదినం రోజున మనం లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. అలా చేయడం వల్ల ధన సంపద, సౌఖ్యం, సంతోషం కచ్చితంగా కలుగుతాయి. అయితే ఈ దీపావళి పండగ రోజున కొన్ని పనులు చేయడం వల్ల శుభాలు కలుగుతాయి. మరికొన్ని పనులు చేయడం వల్ల నష్టాలు కలిగే అవకాశం కూడా ఉంది. అందుకే... ఈ దీపావళి రోజున కచ్చితంగా చేయాల్సినవి ఏంటి? చేయకూడనివి ఏంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం....
దీపావళి రోజున కచ్చితంగా చేయాల్సినవి...
దీపావళి పండగ రోజున లక్ష్మీదేవిని పూజించడం చాలా మంచి విషయం. అయితే.. ఆ పూజను ప్రదోష కాలంలో చేయడం మంచిది. ఆ సమయంలో పూజిస్తే.. లక్ష్మీదేవి కటాక్షం కచ్చితంగా లభిస్తుంది. ఆమె ఆశీస్సులు మీకు లభిస్తాయి. అంతేకాదు.... ఈ పర్వదినం రోజున ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. లక్ష్మీదేవి పరిశుభ్రతను ఎక్కువగా ఇష్టపడుతుంది. అందుకే.. ఇంటి ప్రతి మూలను శుభ్రపరిచి, ఇంటి ప్రతి మూలల్లోనూ దీపాలు వెలిగించాలి.
ఇవి కూడా ఫాలో అవ్వాల్సిందే...
లక్ష్మీదేవిని పూజించే సమయంలో.. ఆమె ఫోటో లేదా విగ్రహాన్ని ఎర్రటి వస్త్రం పై ఉంచాలి. ఇలా చేయడం శుభ ఫలితాలు లభిస్తాయి. ఇక... దేవుడి పూజకు వాడే విగ్రహాలను మట్టి లేదా.. వెండి వాడటం శుభప్రదం. ఇక.. పూజ చేసే స్థలం కూడా చాలా ముఖ్యం. అందుకే ఇంటిలో తూర్పు లేదా ఈ శాన్య మూలలో పూజ చేయడం అత్యంత శుభప్రదం. ఇంటికి కూడా చాలా మంచిది. ఇక... ఇంటి గుమ్మం వద్ద.. కుంకుమ, పసుపుతో స్వస్తిక వేయండి. గడపకు సైతం పూజ చేసుకోవాలి. ఇది.. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగడానికి సహాయపడుతుంది.
మీరు దేవుడి వద్ద అఖండ దీపం కనుక వెలిగించినట్లయితే... ఆ దీపం రాత్రంతా ఆరిపోకుండా చూసుకోవాలి. అంటే మరుసటి రోజు ఉదయం వరకు దీపం వెలుగుతూ ఉండేలా చూసుకోవాలి. ఇక, పూజ చేసే సమయంలో... కోపం, అహంకారాలకు దూరంగా ఉండి.. ప్రశాంతంగా పూజ చేయడం మంచిది.
ఈ పొరపాట్లు మాత్రం చేయకూడదు...
దీపావళి పండగ రోజున నలుపు రంగు దుస్తులు ధరించకూడదు. ఇది ప్రతికూల శక్తిని సూచిస్తుంది. పసుపు, ఎరుపు, తెలుగు రంగు దుస్తులు ధరించడం చాలా శుభప్రదం. అంతేకాదు.. పూజ చేసే సమయంలో ఐరన్ వస్తువులు పొరపాటున కూడా ఉపయోగించకూడదు. ఇవి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పెంచే ప్రమాదం ఉంది. అంతేకాకుండా.. ఈ రోజున ఆహారం తీసుకునే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఉల్లి, వెల్లుల్లి, గుడ్లు, చికెన్ లాంటివి తినకూడదు. మద్యపానానికి పూర్తిగా దూరంగా ఉండాలి. ఇక.. లక్ష్మీదేవిని పూజించే ఈ రోజున భార్య, తల్లి, సోదరి , కుమార్తె.. అంటే ఇంట్లో ఏ ఆడపిల్లను అవమానించవద్దు. బాధ పెట్టకూడదు. ఈ రోజున ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకూడదు. దీని వల్ల ఇంట్లో నుంచి డబ్బు బయటకు వెళ్లే అవకాశం ఉంది.
చివరగా...
దీపావళి రోజున మనం చేసే ప్రతి చిన్న పనీ మన జీవన శైలిని, మన ఇంటి శాంతిని ప్రభావితం చేస్తుంది. ఈ శుభదినం మన ఇల్లు కాంతులతో నింపడమే కాకుండా, మన హృదయాల్లోనూ వెలుగు నింపాలి. శుభం, ఐశ్వర్యం, ఆనందం మీ జీవితంలో ఎప్పటికీ వెలుగులా ప్రసరించాలి.