Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ 4 సందర్భాల్లో అస్సలు సిగ్గు పడకూడదు!
ఆచార్య చాణక్యుడు... ఒక వ్యక్తి తన జీవితంలో ఎదగడానికి, విజయం సాధించడానికి అవసరమైన ఎన్నో విషయాల గురించి తన నీతి సూత్రాల్లో ప్రస్తావించాడు. ఒక వ్యక్తి ఎలా ఉండాలి? ఎలాంటి వ్యక్తులతో స్నేహం చేయాలి? ఎలాంటి వారిని పెళ్లి చేసుక వాలి? లాంటి చాలా విషయాలను మనం చాణక్యుడి బోధనల ద్వారా తెలుసుకోవచ్చు. ఆచార్య చాణక్యుడి ప్రకారం ఒక వ్యక్తి 4 సందర్భాల్లో అస్సలు సిగ్గు పడకూడదు. సిగ్గు పడితే అతని జీవితం అక్కడే ఆగిపోతుంది. ఇంతకీ ఎలాంటి సందర్భంలో అలా ఉండకూడదో ఇక్కడ తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఆచార్య చాణక్యుడు తన నీతిసూత్రాల్లో ఒక వ్యక్తి సిగ్గు పడకూడని 4 సందర్భాల గురించి పేర్కొన్నాడు. చాణక్య నీతిలో చెప్పిన ఈ 4 సమయాల్లో సిగ్గు లేదా సంకోచం ఉంటే ఆ వ్యక్తి ఎదుగుదల అక్కడే ఆగిపోతుందట. చాణక్యుడి ప్రకారం ఎప్పుడు సిగ్గు పడకూడదో ఇక్కడ తెలుసుకుందాం.
సంపద విషయంలో..
ఆచార్య చాణక్యుడి ప్రకారం సంపదకు సంబంధించిన విషయాల్లో ఒక వ్యక్తి ఎప్పుడూ సిగ్గు పడకూడదు. ఎవరైనా మీ దగ్గర డబ్బు అప్పుగా తీసుకుంటే.. వారిని తిరిగి ఇవ్వమని అడగడానికి వెనకాడకండి. మీ ప్రవర్తన సిగ్గు సంకోచంతో ఉంటే, మీరు పదే పదే నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ సిగ్గుపడటం మంచిది కాదంటాడు చాణక్యుడు.
ఫుడ్ విషయంలో
చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి ఆహారం తినడానికి ఎప్పుడూ సిగ్గు పడకూడదు. అలా చేసేవారు ఎప్పుడూ ఆకలితో ఉంటారని చాణక్యుడు చెబుతాడు. ఒక వ్యక్తి తన ఆకలిని అణచి వేయకూడదని ఆయన అంటాడు. నిజానికి, ఆకలితో ఉన్న వ్యక్తి తన శరీరం, మనస్సును నియంత్రించలేడు. అతని ఆలోచించే, అర్థం చేసుకునే సామర్థ్యం కూడా తగ్గుతుంది.
నేర్చుకునే దగ్గర..
ఏదైనా విద్యను నేర్పించే వ్యక్తి నేర్చుకునే వారికంటే చిన్నవాడిగా ఉన్నప్పుడు.. కొందరు విద్యను పొందడానికి సిగ్గుపడతారు. కానీ ఆచార్య చాణక్యుడు చెప్పినట్లు మంచి విద్య ఎక్కడ నుంచి వచ్చినా నేర్చుకోవాలి. మంచి విద్యార్థి అంటే ఎలాంటి సంకోచం లేకుండా అన్ని అడిగి నేర్చుకునేవాడు. సిగ్గుపడేవారు ఎప్పుడూ వెనుకబడే ఉంటారు.
అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్పడంలో..
తప్పు, ఒప్పుల మధ్య వ్యత్యాసం తెలిసినా కొందరు మాట్లాడటానికి వెనకాడతారు. ఒక వ్యక్తి తన అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయాలి. ఎలాంటి సంకోచం ఉండకూడదు. చాణక్య నీతి ప్రకారం సిగ్గుతో మాటలను అణిచివేసేవారు జీవితంలో ఎప్పుడూ ముందుకు సాగలేరు. కాబట్టి ఎలాంటి సంకోచం లేకుండా జీవించాలి.