Chanakya Niti: వీరికి దూరంగా ఉండకపోతే మీరే నష్టపోతారు
ఆచార్య చాణక్య రాసిన నీతి శాస్త్రం నేటికీ మనకి చాలా ఉపయోగపడుతుంది. మూడు రకాల వ్యక్తులతో ఎక్కువ సాన్నిహిత్యం మనల్ని ఇబ్బందుల్లోకి నెడుతుందని చాణక్య చెప్పారు.

ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతి లో మన జీవితానికి సంబంధించిన చాలా విషయాలను తెలియజేశారు. మనం మన జీవితాన్ని సంతృప్తిగా గడపడం కోసం ఎలాంటి వాటిని అనుసరించాలి అనే విషయాలను ఆయన చాణక్య నీతిలో పేర్కొన్నారు. కష్టాలు, అపాయాలు తెచ్చే పరిస్థితులను నివారించడానికి కొన్ని ముఖ్యమైన సూచనలు అందించారు. ముఖ్యంగా జీవితంలో మూడు రకాల మనుషులకు దూరంగా ఉండాలి, మరి, ఆ ముగ్గురు ఎవరో చూద్దామా..
చాణక్య నీతి ఏం చెప్పిందంటే..
"అత్యాసన్న వినాశాయ దూరస్థా న ఫలప్రదా: | సేవితవ్యం మధ్యాభాగేన రాజా బహిర్గురు: స్త్రియం:"
అంటే, రాజులు (శక్తివంతులు), అగ్ని, స్త్రీల విషయంలో ఎక్కువ దగ్గరగా ఉండటం కూడా హానికరం, చాలా దూరంగా ఉండటం కూడా మంచిది కాదు. సమతుల్యత అవసరం.
1. శక్తివంతుల (రాజులు) తో జాగ్రత్తగా వ్యవహరించాలి..
శక్తి ఉన్నవారు తమ అధికారాన్ని ఉపయోగించి అవసరమైతే శిక్షించగలరు. వారితో అతి సమీపంగా ఉండడం వల్ల వారి కోపానికి గురయ్యే అవకాశం ఉంది. అదే విధంగా పూర్తిగా దూరంగా ఉండడం వల్ల రక్షణ కోల్పోయే ప్రమాదం ఉంది. అందువల్ల, సరైన స్థాయిలో ఆప్యాయత, గౌరవం చూపిస్తూ నడవాలి. ఎంత వరకు అవసరం ఉందో, అంత వరకు మాత్రమే ఉండాలి.
2. అగ్ని తో జాగ్రత్తగా ఉండాలి
అగ్ని జీవితం కోసం అవసరం అయినా, దాని పరిధి మించి దగ్గరగా వెళితే ప్రమాదమే. చలికాలంలో వెచ్చదనం కోసం దగ్గరగా వెళ్ళడం అవసరం అయినా, భద్రతా నిబంధనలను పాటించాలి. అలాగే, అగ్ని ద్వారా ఉత్పన్నమయ్యే ప్రమాదాలను నిర్లక్ష్యం చేయకుండా తగిన దూరం పాటించాలి. లేదంటే, మీరు ప్రమాదంలో పడే అవకాశం ఉంది.
chanakya woman
3. స్త్రీలతో సాన్నిహిత్యం విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి.
చాణక్య నీతి ప్రకారం, అపరిచిత స్త్రీలతో అనవసరంగా ఎక్కువ సాన్నిహిత్యం పెంచుకోకూడదు. అది మీకు చాలా ప్రమాదకరం. ఇది మన పరువును, గౌరవాన్ని దెబ్బతీయగలదు. అదే సమయంలో వారి అవగాహన లేకుండా దూరంగా ఉండడం వల్ల కూడా అనవసరమైన అపార్థాలు ఏర్పడవచ్చు. అందువల్ల, గౌరవంగా వ్యవహరించాలి.
చాణక్యుడు చెప్పిన ఈ సూక్తి నేడు కూడా సమకాలీన ప్రపంచంలో ఎంతో వర్తిస్తుంది. సంబంధాలు, ఉద్యోగ సంబంధాలు, సామాజిక జీవితం.. అన్ని రంగాల్లోనూ మితిమీరిన మైత్రి లేదా తీవ్రమైన విద్వేషం రెండు ప్రమాదకరమే. మధ్యస్థితిని పాటించడం జీవన విజయానికి కీలకం.