వితంతువులు బొట్టు, పూలు పెట్టుకోవచ్చా?
Spiritual: మహిళలు తలలో పూలు పెట్టుకోవడం అందం కోసం మాత్రమే కాదు. దాని వెనుక ఆధ్యాత్మిక, శాస్త్రీయ, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు. అయితే.. భర్త చనిపోయిన స్త్రీలు పూలు, బొట్టు పెట్టుకోవచ్చా? లేదా? పెట్టుకుంటే ఏం జరుగుతుందంటే ?

స్త్రీలు తలలో పూలు ఎందుకు పెట్టుకోవాలి ?
భారతీయ సంస్కృతిలో మహిళలు తలలో పూలు పెట్టుకునే సంప్రదాయం, ఓ ప్రత్యేకమైన ఆచారం. ఈ ఆచారం ఇతర దేశాలలో కనిపించదు. స్త్రీలు పూలు పెట్టుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. పువ్వుల నుండి వెలువడే సువాసనకు మనస్సును ప్రశాంతపరిచే శక్తి ఉంటుంది.
ముఖ్యంగా మల్లెపూల వాసన కోపాన్ని తగ్గించి, మానసిక ఒత్తిడిని నియంత్రించి, నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మల్లెపూలు పెట్టుకోవడం వల్ల మానసిక ఆనందం, ఉత్సహం పెరుగుతుంది.
అలాగే మానసిక ప్రశాంతత, సానుకూల భావాలు వెలువడుతాయి. అంతేగాక, మల్లెపూలు పెట్టుకోవడం వల్ల పీనియల్ గ్రంథి ఉత్తేజితమవుతుందని కూడా నిపుణులు సూచిస్తున్నారు.
పూలు పెట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు
తలకు పూలు పెట్టుకోవడం వల్ల మెదడులోని కొన్ని ముఖ్యమైన గ్రంథులు ఉత్తేజితమవుతాయి. వాటిలో ముఖ్యంగా సెరోటోనిన్ వంటి ఆనందాన్ని కలిగించే హార్మోన్లను ఉత్పత్తి చేసే గ్రంథులు ప్రభావితమవుతాయి. మానసిక స్థితిని సమతుల్యం చేస్తుంది. దీని వల్ల మహిళలు మరింత ప్రశాంతంగా, ఆనందంగా ఉండగలుగుతారు.
ముఖ్యంగా మల్లెపూల వాసన నిద్రలేమి సమస్యను తగ్గించడంలో, మానసిక ఒత్తిడిని నియంత్రించడంలో సహాయపడుతుంది. పూలు పెట్టుకోవడం వల్ల మహిళలలో అందం, ఆత్మవిశ్వాసం, ఆకర్షణ పెరుగుతుంది. మనసును కూడా శాంతింపజేసే శక్తి వీటి సొంతం.
ఇది సాంస్కృతిక సంకేతం
చామంతి, మల్లె, గులాబీ వంటి పువ్వులు జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ పువ్వుల నూనెలను జుట్టుకు అప్లై చేస్తే.. జుట్టు బలంగా, పొడువుగా పెరుగుతుంది. వీటిలోని సహజమైన చల్లదనం తల చర్మాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
జాజి, మల్లె వంటి పువ్వులను ప్రతిరోజూ తలపై పెట్టుకునే మహిళలు ఎక్కువగా ఏకాగ్రతతో ఉండడమే కాకుండా, స్పష్టంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కలిగి ఉంటారట. ఇది వారి మానసిక స్థితికి కూడా సహాయకారిగా పనిచేస్తుంది.
స్త్రీలు తలలో పూలు పెట్టుకోవడం దీర్ఘకాల సంప్రదాయం, సాంస్కృతిక గుర్తింపు. ఈ ఆచారాన్ని అనుసరించడం వల్ల వారు తమ సంస్కృతిని కాపాడుతూ, తదుపరి తరాలకు ఆ విలువల్ని చేరవేస్తున్నారు. ఈ సంప్రదాయం అందాన్ని, ఆరోగ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిపిన జీవనశైలి భాగంగా నిలుస్తోంది.
భర్త చనిపోయాక పూలు పెట్టుకోవచ్చా?
ఆధ్యాత్మిక పరంగా.. తలలో పూలు పెట్టుకోవడం వల్ల మహాలక్ష్మి దేవి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. ఈ ఆచారం ఇంట్లో ఐశ్వర్యం, సమృద్ధి, శుభశక్తుల ప్రసరణకు దోహదపడుతుంది. అయితే, “భర్త చనిపోయాక స్త్రీలు పూలు పెట్టుకోవచ్చా?” అనే సందేహం చాలామంది ఉంది.
ఈ ప్రశ్నకు దేశమంగైయర్ కరసి అనే ఒక ఆధ్యాత్మిక ప్రచారకురాలు చక్కటి వివరణ ఇచ్చారు. ఆమె అభిప్రాయం ప్రకారం.. ఈ వాదన పూర్తిగా తప్పు. పూలు మహిళకు పుట్టుకతోనే సంక్రమిస్తాయి, అవి ఆమె వ్యక్తిత్వానికి, ఆనందానికి, ఆత్మవిశ్వాసానికి గుర్తుగా ఉంటాయి.
భర్త లేని మహిళలు పూలు పెట్టుకోవద్దని, బొట్టు పెట్టుకోవద్దని చెప్పడం ఒక సాంఘిక నిర్మితి మాత్రమేనని, అది మహిళలను ఒంటరితనంలోకి నెట్టే ఆచారమని ఆమె అన్నారు. నిజానికి, ప్రతి మహిళ జీవితంలోని ఏ దశలోనైనా పూలు ధరించవచ్చు, అది ఆమె హక్కు, ఆనందం, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని వివరించారు.
అలంకారమే కాదు ఆత్మగౌరవ సూచిక
స్త్రీలు పూలు పెట్టుకుంటే ఒక ప్రత్యేకమైన శోభ సంతరించుకుంటుంది. ఇది ఒక రకమైన ఆనందానికి, శాంతికి, ఉత్సాహానికి నిదర్శనం. ప్రతి రోజు పూలను ధరించడం ద్వారా మహిళలు తమ జీవితాన్ని సంతోషంగా, ఉత్సాహంగా గడిపే అవకాశం పొందుతారు.
చిన్న వయస్సు నుంచే ఆడపిల్లలకు పూలు పెట్టుకునే అలవాటు నేర్పడం అత్యంత ముఖ్యమైనది. ఇది కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు. వారిలో అందాన్ని, అభిమానం, ఆత్మగౌరవాన్ని పెంపొందించే ఒక సాంస్కృతిక శక్తి.
సువాసనగల పువ్వులు ఉన్న చోట కలిగే ఆనందానికి హద్దులే ఉండవు. అలాంటి పూలు మనస్సును ఉల్లాసంగా, మైమరిపించేలా మార్చగలవు. కాబట్టి తలలో పూలు పెట్టుకోవడం అనేది అందం, ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు మేలు చేస్తాయి.